అలసిన బ్రతుకులు

(అంశం – మానవత్వం ముసుగులో వ్యాపారం)

అలసిన బ్రతుకులు

రచయిత: వాసి జ్యోత్స్న

మధ్యతరగతి జీవితాలు
సమయానికి రావు జీతాలు
ఎలా బ్రతకాలో తెలియక అష్టకష్టాలు
చాలీ చాలనీ జీతాలతో చేయాలి అప్పులు

బిడ్డలను పోషించుకోలేక
వారికి సరియైన తిండి పెట్టే
స్థితి లేక అడుక్కుతినలేక
లాక్ డౌన్ పేరిట మూతబడిన కంపెనీలు
కనీస ఉపాది కోల్పోయి
భారంగా మిగిలిన జీవనాధారం

ఎన్నో ఆశలు అన్నిటిని మూటగట్టి
కనురెప్పలమాటున కన్నీటిని దాచి
కుటుంబ తీర్చిదిద్దాలని
తల్లిగా తను కడుపు మాడ్చుకుని
అందరి అవసరాలను తీర్చి

చిరు వ్యాపారంపై వచ్చిన
ఆ రూపాయిలను పైసా పైసా మూటగట్టి
అలసిన బ్రతుకును ఈడిస్తూ
మానవత్వం అనువంత కూడా అగుపించని
ముసుగు వ్యాపారంలో తెరచాటు బ్రతుకును వెళ్ళగక్కుతున్న
జీవితాలు మారెదెప్పుడు…?
సరియైన జీవనోపాధి దొరికేదెప్పుడు…?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!