భయం లేనిదెక్కడ?

భయం లేనిదెక్కడ?

రచయత :: రాజ్

మావా…. ఒ…మావా..
ఏంది మావా…బారెడు పొద్దెక్కిన తొంగునే ఉన్నావు.లే మావ పనికి పోవాలి గంద.పనికీ పోతేనే గంద మన కడుపు నిండేది జనాల చెత్త బుట్టలు ఖాళీ అయ్యేది!
మావా…అని తన మావని కొట్టి లేపుతోంది యాదమ్మ! అంతలోనే గభాలున లేచాడు మాదయ్య!
యాది… యాది ..అని..కంగారుగా లేచాడు మావ మాది! అప్పుడు యాదమ్మ… ఏమైంది మావ.. సెప్పూ ఏమైంది? అప్పుడు మాది ఇలా చెప్పటం మొదలు పెట్టాడు.
యాదమ్మ…రాత్రి నువ్వు సందెకాడే తొంగుండి పోనావ్ గదే నాకు సానా సేపు నిద్ర పట్టనేదే.నువ్వు ఉంటావ్ గంద కాసేపు అనుకున్నానే నేను అల అల అటు ఇటు కదుల్తు దొర్లుతూ… కళ్ళు మూసుకున్నా.అల మూసుకున్నా నా అంతే ఏవో పిచ్చి పిచ్చి కలలే.
అవునా…మావ…యే కలలు మావ..ఏమ్ జరిగినాది అసల!
ఆ…యాదికొచ్చిందే యాది.నేను పని మీద పక్క ఊరికి వెళ్లి వస్తున్న అంట యాది, చేతిలో నిండు గా డబ్బు ఉంది ,నా యాదమ్మ దగ్గరికి పోతాండ అనుకుంటూ హాయిగా వత్తాన్నంట దారి అంత అలా అలా…నల్ల రంగు పులుముకుంది అంతవరకు ఎంతో హాయిగున్న నా గుండెలో ఏదో గుబులు మొదలైనాదే ఇంతలోనే నా భుజం పైన ఏదో పడినట్టు అనిపించినాదే ఇంక సూసుకో యాది
కంగారు కంగారుగా నా సేత్తో దులిపేసూకొని నాలుగడుగులు పరిగెత్తిన! యెనక్కి తిరిగి సూసిన ఒక సారి అక్కడ పడింది చెట్టు కొమ్మ నుండి ఒక ఆకు.అప్పుడు నా గుండె దడ దడ మనటం తగ్గినదే.మెల్లగా మనసు కుదుట పరుచుకొని మళ్లీ నడక మొదలెట్టిన.మొదలెట్టిన గానీ యాది గుండెల్లో…భయం బయల్దేరినాదే.ఆ అభయాంజనేయ రూపును తలచుకొంటూ వస్తాన్నంట!అఠాత్తుగా నా కాళ్ళు రెండు ఆగిపోనాయే కదలటం లేదు ఏదో చుట్టేసింది నా కాళ్ళని. అంతేనే.. యాది!
నా పాణాలు గాల్లో కలిసిపోనాయే.భగమంతుడా..అని ఒకవైపు.మరో వైపు యాదమ్మ అని నిన్ను తలచుకున్నా నే!…నా కాళ్ళు చుట్టేసింది యే కొండ సిలువొ అని…భయం భయం తో నా కాళ్ళు సూసినా యాది అంతే..అదొక పెద్ద
బండి టైర్ యే యాది! అప్పుడు చూడు నా సంతోషం ఆ టైర్ తోనే గంతులేసిన అంట
ఇంతలోనే…నువ్వు లేపినవే యాది!
అవునా…మావ! ఏంది మావ అంత భయపడ్డావా!అయిన మావ నాకు సెప్పకుండ ఏడకి పోకు మాది మావ!😥😥
అలాగే నేవే..నా ముద్దుల యాది!నేను యెళ్లింది కలలోనే నిజంగా కాదు గంద!అవునే యాది అసల ఈ భయం అంటే..ఎందుకే..అంత భయం అందరికీ!
అదేం నేదు మావ….అసలకి ఆ భయానికే భయం తెలుసా అందుకే..అది అందరూ ఉన్నపుడు రాదు, ఎలుగు లో ఉన్నపుడు రాదు.
అవునే యాది నువ్వు సెప్తాంటే తెలుత్తాంది నిజమే! మరి యాదే నీకు ఎప్పుడు భయం అనిపించ నేదా?
ఎందుకు అనిపించదు మావ! కానీ! భయమేసినపుడల్లా.. నీకు ఇంకా ఇంకా దగ్గరగా వచ్చి నీ ఒడిలో పడుకోండి పోత మావ! నా మావ పై నాకున్న పేమ నాకెలాంటి భయాన్ని కలగనివ్వదు.నువ్వే నా ధైర్నం మావ!
భయం అన్నిటి కన్నా ఎక్కువగా భయపడేది పేమా కే మావ! ఈ రెండు ఎలాంటివో తెల్సునా! పేమ పిల్లి అయితే భయం ఎలుకలు మావ! ఎన్ని ఎలుకలు వచ్చిన పిల్లిని చూసి భయపడినట్టే… పేమ ఉన్న సోటుకి భయం రానేదు మావ! ఇప్పటికైనా తెలుసుకో మావ నువ్వంటే నాకు ఎంత పేమో!
ఓ మాది మావ! మన భయం తర్వాత గానీ ముందు మనం పనిలో కి ఎల్దాం పదా
లేదంటే..ఈ జనాలకి వాళ్ళు ఏసిన సెత్త ను చూసి వాళ్ళకే భయం.అందుకే..ఈ చెత్త ఎత్తే వాళ్ళు ఎప్పుడు వత్తారా..మా చెత్తని ఎపుడు తీసుకెళ్తారా అని అదే పనిగా సూత్తూ ఉంటారు..
పద…పదా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!