అదృష్టం
రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు
“అద్దం వైపు చూసా,నువ్వు ఎప్పుడు అందంగా తయారైన, ఆ అద్దమే నీ అందానికి అసూయ పడడం,”
నేనొక ప్రేమ కోయిలను,నీ గురించి ఆలోచిస్తూ పాడుతున్న,
“నల్లని కాటుక అదృష్టం ఏమిటో, నీ చేప లాంటి కన్నులకు అంటుకొని తరించింది,”
“మరుమల్లెల అదృష్టం ఏమిటో,నీ కారుమేఘాల కురులలో ముడుచుకొని విరబూసే,”
“నీ లేత పెదవుల పైన రంగు కు అదృష్టం ఏమిటో, కొద్ది నిముషాల అయినా తళ తళ లాడటం,”
“నీ అకుపచ్చ రంగు చీర అంచుకు ఎంత.అదృష్టమో, నీ సున్నితమైన,సుకుమారమైన దేహానికి అతుక్కొని ఆనందం తో రెప రెప లాడడం,”
‘నాకు ఒక్కసారి ఆ అదృష్టాన్ని ప్రసాదించు ప్రియతమా,నీ వెచ్చని ఒడిలో
మంచు ముక్కలా కరిగిపోవాలని కోరుతున్న నీ ప్రియుడు.