నీట్ నెస్!

నీట్ నెస్!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

గడియారం మధ్యాహ్నం రెండు కొట్టింది! రాజారావుకు, నీట్ నెస్ అంటే చాలా ఇష్టం!
కానీ,ఏం లాభం,
మనవళ్ళు ఇల్లు పీకి పందిరేసేరకం!
చక్కగా గుర్రుపెట్టి నిద్రపోతుంటే,
టీవీలో”పిల్లలు దేముడు చక్కనివాళ్ళే”అని,
ఇల్లంతా వినపడే శబ్దంతో పాటవస్తోంది!
చిరాగ్గా మొహంపెట్టి, టీవీ కట్టేదామనిలేచాడు!
కాలు కిందపెట్టగానే, కస్సుమంది, పాము బొమ్మ!
ఏం పిల్లలో ఏంలోకమో, ఏంటో,అనుకుంటూ
బొమ్మలేరసాగాడు! అవన్నీ ఏరి, బొమ్మల రాక్ లో సర్ది, హాలులోకి వచ్చాడు!
గడియారం ఠంగ్ మని మూడుకొట్టింది!
హాలులో, సోఫాలో దుప్పట్లు, దిళ్ళు కనపడ్డాయి!
ఇంతవయస్సు వచ్చినా ఇంకా పిల్లలకు నీట్ నెస్
అలవడలేదనుకుంటూ, దుప్పట్లు మడతపెట్టి,
దిళ్ళు, దుప్పట్లు కప్ బోర్డ్ లో సర్దివచ్చాడు!
గడియారం ఠంగ్ మని నాలుగుకొట్టింది!
ఇంకో బెడ్ రూమ్ లో లైట్లుఫ్యాన్లు వెలుగుతూ
కన్పించినాయి! కరెంట్ బిల్లు పేలుతున్నా
శ్రధ్ధలేదంటూ, ఆ గదిలోకి వెళ్ళి,
లైట్లు, ఫ్యాన్లు ఆపేశాడు.
బాత్రూంలో కారిపోతున్న జలధారను ఆపేసి, బాత్రూం, బెడ్ రూమ్, మొత్తం సర్దేశాడు!
గడియారం ఠంగ్ మని ఐదు కొట్టింది! ఇంతలో,
మబ్బులుకమ్మిన ఆకాశం నుంచి వానచినుకులు పడసాగాయి, బాల్కనిలోకి వెళ్ళి, ఆరేసిన బట్టలన్ని తీసి, మడతపెట్టి, కప్ బోర్డులో సర్దేశాడు!
గడియారం ఠంగ్ మని ఆరుకొట్టింది!
మళ్ళీ, తనగదిలోకి వచ్చేశాడు!
తీరుబాటుగా, ఎంత ఆలోచించినా,
తను ఏం పనిచేద్దామనుకొని,
లేచాడో, గుర్తుకురాలేదు!
టీవీలో మాత్రం, మౌనమే
నీ భాష ఓ మూగమనసా,
పాట వినిపిస్తోంది, చాలామంచి పాట అనుకున్నాడు, రాజారావు!
గడియారం ఠంగ్ మని ఏడు కొట్టింది!
ఏదో పని చేద్దామనుకున్నా
ఏంటది అని ఇంకా ఆలోచిస్తున్నాడు,
నీట్ నెస్ రాజారావు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!