తూర్పు తెల్లవారింది
రచన::సుజాత.కోకిల
కోడి కూతతో తూర్పు తెల్లవారింది.
కళ్ళాపు చల్లిన వాకిళ్లు ముగ్గులతో కళకళలాడుతున్నాయి.
భక్త హరిదాసు వీధి వీధికీ పరుగులు పెడుతు హరి కీర్తనలు, పాడుకుంటూ
అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు పిల్లలు సందడి చేస్తూ
బుల్లి బుల్లి చేతులతో బియ్యం దానం చేస్తూ ఆనందపడుతున్నారు.
కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టుగా
పొట్టకుటి కోసం.తన కళానైపున్యాన్ని
ప్రదర్శించుకుంటూ జీవితాన్ని
గడుపుకుంటున్నాడు.మన తెలుగింటి
ఆడపడుచులు పట్టు పరికిణిలతో
గొబ్బెమ్మలు పెడుతూ ముచ్చటపడుతూ
మన ఊరి ఆనందమంతా మన వాకిళ్ళలోనెే ఉన్నది
ఉన్నట్టుగా ఆనందంతో మురిసిపోతున్నారు
గంగిరెద్దుల వాడు వచ్చి సన్నాయి ఊదుకుంటూ
వాకిట్లో సన్నాయి వాయిస్తూన్నాడు
లక్ష్మీదేవి లాంటి దొరసాని నిలబడింది
దండం పెట్టు బసవన్న అంటున్నాడు బసవన్న
అలాగే తలాడిస్తూ నమస్కారం చేసింది
బంగారు చేతులు చలువగల చేతులు దొరసాని చల్లగా ఉండాలి
పంచ అయినా చీరయినా దానం చెయ్యండి అంటూ
బసన్నతో విన్యాసం చేయిస్తున్నాడు తమకు తోచిన
సహాయం చేసి లోనికి వెళ్లారు
అందరి ఇళ్లల్లో సంక్రాంతి పండగ వేడుకగా జరుపుకుంటున్నారు.
***