చీమ-చిలుక కథ

చీమ-చిలుక కథ

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

ఒకసారి ఒకచీమ యేటి వొడ్డున అడుకుంటుంది. అనుకోకుండా అది నీటిలో పడిపోయింది.అది సాయం కోసం చూసింది.కానీ ఎవరూ లేరు యేటిలో  చీమ నీటిలో అలా కొట్టుకొని పోతుంది.అది ఎంతగా ప్రయత్నించిన ఒడ్డుకు చేరలేకపోయింది.ఇదంతా ఒక రామచిలక చెట్టుపై నుండి గమనిస్తుంది. ఎలాగైనా చీమను రక్షిద్దామని నిర్ణయించుకుంది.బుర్రలో ఒక ఆలోచన మెదిలింది. ఒక ఆకు ను తీసి చీమ వెళ్తున్న దారిలో వేసింది. వెంటనే ఆ చీమ కూడా ఆ ఆకుని అందుకొని నీటిలో నుండి ఆకు మీదకు చేరుకొని ప్రాణం దక్కించుకుంది.బ్రతుకు జీవుడా అని ఒడ్డుకు చేరింది.ఇదంతా చిలుక చేసిన సాయం అని గుర్తించింది.చీమ చిలుక స్నేహితులు గా మారారు. ఒకసారి ఒకవేటగాడు వేటకు వచ్చాడు.ఆ వేటగాడు ఆ చెట్టుపై ఉన్న చిలుకకి గురి పెట్టాడు. అది గమనించిన చీమ వేటగాడు కాళ్లకు కరిచింది.అబ్బా అని కాలుని గోకు కొని కిందకు చూసి గురి తప్పాడు. చిలుకకి గురి తప్పడం తో చిలక తప్పించుకొని పారిపోయింది.ఆ విధంగా చీమ చిలుక ప్రాణం కాపాడింది.ఒకరికి సాయం చేస్తే మనకు కూడా ఏదో విధంగా భగవంతుడు సాయం చేస్తాడు.ఆ రోజు నుంచి చీమ చిలుక మధ్య స్నేహం ఎక్కువైంది. చాలా సంతోషంగా కాలం గడుపుతున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!