మేక వన్నె పులి

అంశం: సస్పెన్స్

మేక వన్నె పులి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

సాధనా! అంటూ పిలిచాడు కార్తీక్. హా కార్తీక్ చెప్పు ఏంటి మంచి హుషారుగా ఉంది బండి అంది సాధన. నడు! ఇప్పుడు మనకి సమయం వచ్చింది, అంతా రెడీ, ఆ గూడెం జనాల సభకు వెళ్ళాలి, అన్నాడు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్న జంట, అంతే కాదు సాధన జర్నలిస్ట్, కార్తిక్ ఎస్ ఐ గా పని చేస్తున్నారు, చాలా చురుకైన తెలివైన వారే కాదు, పేదలకు సహాయం చేస్తూ, అన్యాయాలను ఎదిరించడంలో ముందు ఉంటారు.  వీళ్లిద్దరూ కలిసి ఒక కేస్ పట్టుకుని ఛేదించడంలో గత కొంత కాలం నుంచీ చాలా కష్ట పడుతున్నారు. అంతేనా, వారి పెళ్లి కూడా కొంత కాలం వాయిదా వేసుకుని మరీ పేదల పక్షాన శ్రమిస్తున్నారు.
ఇక వివరాల లోకి వెళ్తే….
ఓ రోజు సాయంత్రం రామాపురం అనే చిన్న గ్రామంలో ఆ ఊరి పెద్ద కామేశం ఆ మధ్య గూడెంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వారికి వేరే చోట ఏవో పథకాల పేరు చెప్పి ఇల్లు కట్టించి పట్టాలు పంచి పెట్టే పనిలో కోలాహలంగా ఉంది. పాపం ఆ పేదవారికి తెలియని కథ వేరే ఉంది. అదేమిటంటే..
ఓ రోజు, కాయకష్టం తో పని చేసుకుని వచ్చి రెండు మెతుకులు తిని రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు ఓ పది కుటుంబాలు ఉన్న ఆ గూడెం జనం. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా అగ్ని జ్వాలలు రాజ్యమేలడం మొదలైంది. అందరూ ఉలిక్కి పడి లబో దిబొ అంటూ పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకో గలిగారు కానీ ఉన్న గూడు, బట్ట, సామాన్లు మాత్రం ఆ అగ్నికి ఆహుతి అయిపోయాయి. సమయం కోసం ఎదురు చూస్తున్న కామేశం గారు ఉరకలు పరుగులు తో వచ్చి వారికి కొంచెం బస అదీ ఏర్పాట్లు చేసి ఓదార్పునిచ్చి, తొందర లోనే వేరే చోట పక్కా ఇల్లు కట్టిస్తామని, నష్ట పరిహారం ఇప్పిస్తామని చెప్పి, నిరక్షరాస్యులయిన వీరి చేత ఎన్నో కాగితాలు, స్టాంప్ పేపర్ల మీద సంతకాలు, వేలు ముద్రలు తీసుకుని వారి వెంటే ఉండి పనులన్నీ దగ్గర ఉండి మరీ చూసుకున్నారు. అయితే ఈ తతంగం అంతా ఈయన ఇంత జాగ్రత్త గా ఎందుకు చూస్తున్నారు, ఇంత సహాయం ఎందుకు చేస్తున్నారు అని సాధన కి ముందు నుంచీ అనుమానంగా ఉంది, ఇదే విషయం కార్తీక్ కూడా చెప్పి ఏదైనా మోసం ఉందా అని వెలికి తీయడం మొదలు పెట్టారు. అయితే కామేశం గారు బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి కాబోయే ఎమ్ ఎల్ ఏ అని, రాజకీయంగా అందరితో సంబంధాలు ఉండడం తో సాక్ష్యాధారాలు లేకుండా ఏమీ చెయ్య లేమని, అనధికారికంగా వాళ్ళ పని లో వాళ్ళు ఉన్నారు సాధన, కార్తీక్. ఇంత చేయించే కామేశం కూడా వారి జాగ్రత్త లో వారూ ఉన్నారు. వారు ఎన్ని అరాచకాలు చేసినా సాక్షాలు లేకుండా చెయ్యడం, అక్రమార్జన లో ఓ పావు వంతు ఏదో మంచి పనికి ఖర్చు చేసి పేరు సంపాదించడం లో అందె వేసిన చెయ్యి ఈయనది. అలా చట్టానికి దొరక్కుండా జాగ్రత్త పడుతూ, ఎదురు తిరిగిన వారి ఆచూకీ లేకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కథలోకి వస్తే. అందరికీ ఇళ్ళ పట్టాలు అందించి దేవుడు అనిపించు కోవడం పూర్తి అయింది. కార్యక్రమం లో ఇప్పుడు ఈయన్ని ఎమ్ ఎల్ ఏ అభ్యర్థి గా ప్రకటించడం తరువాయి. సరిగ్గా అప్పుడే కార్తీక్ సభలోకి వచ్చి యూ ఆర్ ఉండర్ అరెస్ట్ అంటూ బేడీలు అందించాడు కామేశం గారికి. ఊహించని పరిణామానికి ఊగి పోతూ కార్యకర్తలను, అభిమానులను రెచ్చ గొట్టే ప్రయత్నం చేసినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. సాధన, కార్తీక్ ముందే ఇది ఊహించి జనాలకి నిజం తెలిసేలా చేసి వారి వారి అభిమానులతో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతకీ అసలు నిజం ఏమిటంటే ఈ కాలిపోయిన గూడెం స్థలాలు కామేశం గారు, ఒక సంస్థకు ధారాదత్తం చేయించి, అది నగరానికి దగ్గర్లో ఉండడం తో అక్కడ మంచి వ్యాపార సముదాయం నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, దానికి తగ్గట్టు ఈ కథ అంతా నడిపించారు. అది తెలియని గూడెం జనం వీరిని దేవుడు అనుకుంటూ జేజేలు కొడుతున్నారు. అయితే ఇదంతా పక్కా సాక్ష్యాలు సంపాదించి, కామేశం దగ్గర పని చేసే నమ్మకస్తుడైన వీరేశం దగ్గర ఆధారాలు సేకరించి, తానే ఈ అగ్నిప్రమాదం చేశానని చెప్పించి వీడియో తీయించి అన్ని మాధ్యమాలలో ఇదే సమయంలో ప్రసారం అయ్యేలా చేశారు. దానితో ఒకే దెబ్బకి కార్తీక్ కి, సాధన కి మంచి పేరు రావడం, కామేశం గారి నిజస్వరూపం బయట పడడం జరిగింది.
అదండీ ఎంతటి వారైనా మోసం చేసేవారు ఎప్పటికీ తప్పించుకు తిరగలేరు అనే మన మేక వన్నె పులి అయిన కామేశం గారి నిజ స్వరూపం. ఇక ఆయన జైలుకి, మనం ఇంటికి, కథ కంచికి.

You May Also Like

5 thoughts on “మేక వన్నె పులి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!