ప్రయాస..!
రచన: సుజాత.పి.వి.ఎల్
అమ్మ ఒడి నుండి బయట పడి
నడక నేర్చిన క్షణం నుండి
నేటివరకు పరిగెడుతూనే ఉన్నా..
ఇంటి సంరక్షణ…
పిల్లల బాధ్యత నెత్తిమీద వేసుకుని
అనుక్షణం తపనంతా నాదే..!
ఎంత చేసినా..
ఎవరికీ ఏమీ కాకుండా
బ్రతుకీడుస్తున్న ’ఒంటరి’ కాలమంతా నాదే..
జననం నుండి మరణం దాకా
అంతా మిధ్యేనని గ్రహించి కూడా
కాలంతో పాటు పరిగెడుతున్న
ప్రయాస కాలమంతా నాదే..
చివరకు నాకు మిగిలేది కూడా అదే..!!
***