అగమ్యగోచరం

అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” )

అగమ్యగోచరం

రచన: తిరుపతి కృష్ణవేణి

పార్వతమ్మ కి వయసు రీత్యా ఆరోగ్యం సరిగాసహకరించటం లేదు. దానికి తోడు, రెండు రోజుల క్రితం బాత్రూంకి వెళ్ళి కాలు జారి కింద పడి పోవటంతో కాలికి,నడుముకి,గాయాల
య్యాయి. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఇంటి పని వంట పని అంతా తనే చేసుకోవాలి. కాసిన్ని,టీ నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేక పోయే?. అని మనసులోనే వాపోయింది. ఇంటి ప్రక్కవారు ఊర్లో ఉన్న ఒక అర్. ఏం.పి.డాక్టర్ని పిలిచారు. ఆయన పరీక్షించి ఇంజక్షన్ చేసి వెళ్ళారు. ఉద్యోగ రీత్యా కొడుకు కోడలు హైదరాబాద్ లో వుంటారు. పార్వతమ్మ వ్యవసాయ భూములను చూచు కుంటూ, కౌళ్ల ద్వారా వచ్చిన డబ్బును కొడుకుకు ఇవ్వటం, కొడుకు దగ్గర నాలుగు రోజులు ఉండి వస్తూ ఉంటుంది.ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఏ పనీ చెయ్యాలన్నా చాలా కష్టంగా వుంది. కరోనా పరిస్థుతుల మూలంగా కూడా పట్టణాలనుండి పల్లెలకు,
పల్లెలనుండి పట్టణాలకు ప్రయాణాలు చేయటం కూడా కష్టమైపోయింది. కరోనా మహమ్మారి భయం ఇంకా జనాలను పూర్తిగా వీడి పోలేదు.నా లాంటి వయస్సు మళ్ళిన వారి దగ్గరికి రావాలంటేనే భయపడుతున్నారు.చుట్టు ప్రక్కల వాళ్లు వూరికే ఎందుకు వస్తారు ఎవరి పనులు వాల్లకి వుంటాయి కదా! అని మంచంలోలేవ లేని పరిస్థితిలో ఉన్న పార్వతమ్మ గత స్మృతులను నెమరువేయసాగింది. మాది పెద్ద కుటుంబం, అమ్మ, నాన్నలకు నేనే మొదటి సంతానం.పెళ్లి ఈడు వచ్చాక పెద్ద రైతు వారి కుటుంబంలో నలుగురు అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబంలోకోడలి గా అడుగు పెట్టాను. ఒకానొకప్పుడు ఎలా వుండేది తను ఇంటినిండా చుట్టాలు పట్టాలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అమ్మ నాన్న వచ్చి పోయె వాళ్ళతో ఎంతో కళ కళ లాడుతూ వుండేది. ఇంట్లో పెద్ద దానిని అవటం వలన నాకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం కలిగినా వెంటనే ఇలా వచ్చి వాలి పోయె వారు.నాకు ఏ చిన్న కష్టoవచ్చి, కాకితో కబురు చేసినా, నా పుట్టింటి వారు హుటాహుటిన వాలి పోయోవారు.మా అమ్మ తమ్మళ్ళు, మేన మామలు, వాళ్ళపిల్లలు, నాన్నవైపు బంధువులు, నన్ను చాలా అభిమానంతోచూచే వారు.ఎల్లవేళలానాకుచేదోడవాదోడుగావుండేవారు. ఎప్పుడొచ్చినా పార్వతమ్మకోరినట్లయితే ఎంతో అభిమానంతో రెండు రోజులుండి వ్యవసాయ పనుల్లో సహాయం చేసి వెళ్ళేవారు.
పెళ్లి అయి చాలా కాలంవరకు పార్వతమ్మకు సంతానం లేకపోవటo వలన,పార్వతమ్మ తల్లి దండ్రులకు ఎంతో బాధగా ఉండేది. కూతురు సంతానం గురించి ఎన్నో పూజలు పునస్కారాలు, చేయించటం. గుళ్ళు, గోపురాలు, వనదేవతల జాతర్లకు మొక్కులు చెల్లించటం చేసే వారు.పార్వతమ్మకు సంతానం లేనికారణంగా బంధువులు, చుట్టు ప్రక్కల వారు సూటి పోటీ మాటలతో వేధించేవారు. పిల్లలు లేని కారణంగా వారి ఆస్థి పాస్థులపై అత్తింటి వారి నుండి అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆత్మీయులు పార్వతమ్మకు ఒక సలహా ఇచ్చారు. నీకెంటమ్మా! బాగా ఆస్థిపాస్థులు ఉన్నాయి ఒక అబ్బాయినో, అమ్మాయినో పెంచుకో వచ్చుకదా? నీ కష్టాలు తీరి సుఖంగా ఉంటావు. మీ
దాయాదులతో నీకు ఇబ్బంది ఉండదు.అన్ని రకాలుగా అమ్మాయిని పెంచుకుంటేనే మంచిది అనే నిర్ణయానికి వచ్చింది.
మంచి చదువులు చదివించి, వయస్సువచ్చిన తర్వాత నాతరుపు వాళ్లకు ఇచ్చి పెళ్లిచేస్తే మాతో కలసి ఉంటారు.నా కుటుంబం నిలబడుతుంది. మాకు వారసులు వస్తారు, నా అవసాన దశలో నన్ను జాగ్రత్త గా చూచు కుంటారు.నా ఆస్థి పాస్థులకు డోకా ఉండదు, అనేది పార్వతమ్మ అలోచన!! కొద్ది కాలం తర్వాత ఉమ్మడి కుటుంబంలో కోడళ్ల మధ్య చిన్నచిన్న గొడవలు జరిగి
అన్నదమ్ముల ఆస్థి పంపకాల వరకు వచ్చింది. ఇంత కాలం ఉమ్మడి కుటుంబం లో ఉన్న అన్నదమ్ములంతా వేరు, వేరు కుటుంబాలుగా విడిపోయి, ఎవరికి వారే స్వంతంగా వ్యవసాయం చేసు కోవటం ప్రారంభించారు.కాలం ఆగదు కదా! చూస్తుండగానే అమ్మాయి సరస్వతి పెరిగి పెద్దదయింది. పాఠశాలకు వెళ్తూంది. అలాగే పార్వతమ్మ చేసిన పూజల ఫలితంగా పండంటి మగపిల్లవానికి జన్మనిచ్చింది.సరస్వతి కి ఇంటిపని వంటపని, తమ్ముణ్ణి ఆడించటంతోనే సరిపోయేది. ఈ పని వత్తిడిల కారణంగా సరస్వతి పాఠశాల చదువుకు దూరమైనది. చదువుమీద సరస్వతి సరిగా శ్రద్ద చూపలేకపోయింది. అమె చదువు గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.సరస్వతి ఇంటిపనికే బంధీఖానా అయినది.కొడుకు పుట్టిన తరువాత పార్వతమ్మ లో చిన్నగా స్వార్థం మొదలయింది ఇంత కాలం కూతురు మీద వున్న ప్రేమ కాస్త కొడుకు మీద రెట్టింపయింది.సరస్వతి కి పెళ్లి ఈడు వచ్చింది దానికి ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది అనుకొని,దగ్గర బంధువుల్లో ఒక అబ్బాయిని చూసి పెళ్ళి చేసింది.ఆఅబ్బాయి ఒక ప్రభుత్వ ఉద్యోగి చాలా మంచి వాడు కావటంతో సరస్వతి జీవితం బాగానే ఉంది.కాని, అల్లుడి మంచి తనాన్ని ఆసరాగా తీసుకుని పార్వతమ్మ కూతురికి ఇవ్వాలసిన కట్న కానుకలు కూడా సరిగా ఇవ్వలేదు.కొడుకు పెరిగి పెద్ద వాడు అయ్యాడు. . కొడుకుకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుడిగా తీర్చి దిద్ది ఒక మంచి అమ్మాయి ని చూసి పెళ్లి చేసింది. కొడుకు, కూతురు హైద్రాబాద్ లోనే
స్థిర పడ్డారు.
కొంతకాలం మనుమలు, మనవరాళ్ళతో ఎంతో సంతోషంగా కాలం వెళ్ళబుచ్చింది పార్వతమ్మ.
కరోనా నేపధ్యం ఒక వైపు, వయస్సు మీద పడి వృద్ధాప్యం ఒక వైపు కారణంగా ఎవరింటికి వారే పరిమితమయ్యారు. ఈ
పరిస్థితుల ప్రభావం వలన భర్తను కోల్పోయిన పార్వతమ్మ బరువు భాద్యతలు ఎవరు తీసుకోవాలి, అనే సమస్య తలెత్తిoది. పెంచిన ప్రేమా? కన్నా ప్రేమా? అనే సంధిగ్ధంలో పడింది పార్వతమ్మ పరిస్థితి.
కన్నకొడుకు మీద ప్రేమతో అక్కడ ఉండటానికి పార్వతమ్మకు ఇష్టం. కాని కొడుకు కుటుంబ పరిస్థితితులు దృష్ట్యా అక్కడ ఉండలేకపోతోంది. కూతురు కూడా తన కొడుకుల వద్ద సుదూర ప్రాంతంలో ఉండటం వలన కరోనా దృష్ట్యా అక్కడికి కూడా పార్వతమ్మ వెళ్లలేని పరిస్థితి.
ఇప్పుడు ఎవరికీ అక్కరలేని పార్వతమ్మ వంటరిగా తన స్వగ్రామంలో నివసిస్తున్నది.
ఎవరి కుటుంబాలను వారు చూచుకుంటూ “ఎవరివారే యమునాతీరే ” అన్నట్లు ఉంటే నాలాంటి ముసలి తల్లుల పరిస్థితి అగమ్య గోచరమే!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!