బామ్మ మాట బంగారు బాట

అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” )

బామ్మ మాట బంగారు బాట

రచన: సుజాత

పాలేరు రంగయ్య వచ్చి ఆరుబయట పక్కలు వేసి వెళ్లి పోయాడు ఎండకాలం ఆరుబైట వాతావరణం చల్లగాలితో హాయిగా ఉంది.పిల్లలు ఆడుతూ పాడుతూ పక్కులన్ని చెరిపేశారు బామ్మ వచ్చేసరికి పక్కలన్నీ చెదిరి ఉన్నాయి ఎవ్వరురా పక్కలన్ని పొర్లిపెట్టారు అంటూ కేకలు పెడుతు వచ్చింది బామ్మగారు.వామ్మో అంటూ పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు పిల్లలు. రాము అటుగా వెళ్తున్నాడు అరేయ్ అబ్బీ మీరే నట్రా పక్కలు పొర్లిపెట్టింది.అంటూ మెల్లిగా
గదమాయిస్తున్నట్టు అంది

బామ్మ అంటే అందరికీ భయం ప్రేమ రెండు ఉన్నాయి నేను కాదు బామ్మగారు. అంటూ బేలమొహం వేసాడు
మరి ఇంక ఎవ్వరురా అంది. బామ్మ గారు రాకేశ్ హరి వాళ్లు ఇందాక ఇక్కడే ఆడుకున్నారు బామ్మగారు అంటూ చెప్పాడు. అవున సరేర వేళ్ళు రాము అంది అక్కడినుండి వెళ్లి హమ్మయ్య అనుకున్నాడు రాము తనలో తనే నవ్వుకుంది బామ్మ బడవలు ఒకటే అల్లరి ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు.అల్లరి పిల్లలు అని నవ్వుకుంది పిల్లలతోనే సుఖం పిల్లలతోనే కష్టం అనుకుంది మనసులో ఆయన పోయాక గంపెడు సంసారాన్ని ఈదుకుంటూ ఇంత దూరం వచ్చాను ఆయన పోయినప్పుడు అందరు చిన్నపిల్లలే ఎన్నికష్టాలు పడ్డానో ఆ దేవుడికే తెలుసు ఆ దేవుడి దయ వలన అందరు బాగానే ఉన్నారు గతాన్ని మనసులో తలుచుకుని బాధపడింది

బామ్మగారి కుటుంబం చాల పెద్దది ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు అందరినీ చదివించి పెళ్లిళ్లు చేసింది ముగ్గురు కోడల్లు ఇద్దరు ఆడపిల్లలు వారివారి పిల్లలు గంపెడు సంసారం అయింది అందరు కలిసే ఉంటారు. మనవళ్లు మనవరాళ్లు అందరూ ఇంచుమించుగా పది సంవత్సాల లోపు పిల్లలే ఒక పెద్ద కొడుకు పిల్లలే పెద్ద పిల్లలు పెద్దకొడుకు రాకేష్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు బిడ్డ లావణ్య ఇంజనీరు చదువు పూర్తయింది.

తన బిడ్డలు అత్తారింట్లోనే ఉంటారు పండుగలకు శుభకార్యాలకు మాత్రమే వస్తు పోతుంటారు తన కోడల్లను కూడ అలాగే పంపిస్తుంది పెద్దకొడుకు బిడ్డ
లావణ్య కి బిడ్డ కొడుకు హరి కి పెళ్లి చేయాలనే ఆలోచన ఉంది ఎండాకాలం హాలిడేస్ కదా అందరూ వచ్చారు పిల్లలందరూ కలిసి ఆడుతూ పాడుతూ సరదాగా ఉన్నారు. అదే పెళ్లి విషయం కొడుకు కోడలితో మాట్లాడాలి రేపు ఉదయాన్నే మాట్లాడతాను అనుకుంటూ పడుకుంది.

కోడళ్ళు పన్నులన్నీ చక్కబెట్టి వచ్చి పడుకుంటారు
కనకం చిన్న తప్యాలతో మంచి నీళ్లు తెచ్చి పెట్టింది ఎమండి దాహం వేస్తే ఇక్కడ మంచి నీళ్లు పేట్టాను తీసుకోండి అంటూ చెప్పింది. తన భర్తకు అలాగే లేవే అంటూ ఆవలిస్తూ పడుకున్నాడు. పెద్ద కొడుకు కోడలు పిల్లలు బామ్మగారు మాత్రమే బయట పడుకున్నారు మిగతా వాళ్లు ఎవరి గదుల్లో వాళ్లు పడుకున్నారు.

లావణ్య బావ ఎక్కడ ఉన్నాడో అనుకుంటు
వెతుక్కుంటూ పెరడటి వైపు వచ్చింది.లావణ్య
అమ్మ వాళ్ళు ఇంక పడుకున్నారో లేదోనని చూసింది ఇంక అమ్మ పడుకున్నట్టు లేదు నన్ను చూడగానే ఎంటమ్మ ఇంక పడుకోలేదు అంటూ అడిగింది లేదమ్మ నిద్రరావట్లేదు అంది మరి నీవు ఇక్కడ పడుకుంటావ ఆరుబయట చల్లగా ఉంది అంది లేదమ్మా నేను లోపలే పడుకుంటాను అంటూ మీరు పడుకోండి అని వెళ్ళింది సరే.వెళ్ళు చాల టైమ్ అయింది అంది కనకం.

పల్లేటూరిలో అందరు పెందలాడే పడుకుంటారు బస్తీలోపుట్టి పెరిగిన పిల్లలకి తొందరగా నిద్రపట్టదు . లావణ్య చుట్టూ చూసింది. ఎక్కడ బావ కనిపించలేదు పెరటి గుమ్మము వైపు వెళ్ళింది. అక్కడ బావ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు.అమ్మ బావ ఇక్కడ ఉన్నావా అంటూ వెనుక వైపు నుండి రెండు చేతులతో గట్టిగా కళ్లు ముసింది ఏంటి నీ అల్లరి అంటూ ఒక చేత్తో తన వైపుకు లాక్కున్నాడు అమాంతం తన గుండెలపై వాలింది అయ్యో బావా అంది సారి సార్ మళ్లీ చేస్తానంటూ ఫోన్ పెట్టేస్తూ తన గుండెపై వాలి ఉన్న మరదలిని దగ్గరకు తీసుకున్నాడు ఆ..బావ నా జుట్టు. అంది నేనేం చేశాను నువ్వేగా వచ్చింది అన్నాడు.నీ షేర్ట్ గుండిలో నా జుట్టు చిక్కుకుంది మెల్లిగా తివ్వు బావ అంది

ఏంటి బావ మరి చిన్న పిల్లాడిలా అల్లరి అంది లావణ్య నీవేగా ముందు అల్లరి పెట్టింది.సరదాగా కబుర్లు చెప్పమన్నావు అందుకే సరదాగా ఉన్నాను అంతే నవ్వుతూ అన్నాడు అబ్బొో చెప్పావులే కబుర్లు ఏదో సరదాగా కబుర్లు చెబుదామని చిలిపిగా చూస్తూ అన్నాడు చేయి వదలకుండానెే ఆ…ఆ అవును పాపం రాకరాక వచ్చింది మరదలు పిల్ల
కాబోయే పెండ్లాం సరదాగా కబుర్లు చెప్పుకుందాం అనెేది ఉందా నీకు ఏం లేదు ఎంతసేపు ఫోన్తోనే ముచ్చట్లు బావ నా జుట్టు తన షర్ట్ గుండీలొో చిక్కుక్కున్న జుట్టును తీయబోయింది.

బావ నొప్పిగా ఉంది మెల్లిగా తీయవా సరే నంటూ మెల్లిగా తీస్తూ తన కళ్ళల్లోకి చూశాడు తను కూడా బావ కళ్ళల్లోకి అలాగే చూస్తుండిపోయింది బావ స్పర్శ తాకగానే ఏదో తెలియని అలజడి మొదలైంది ఒక్కసారిగా నరాలు జివ్వుమన్నాయి మనసు ఆనందంతో తేలిపోయింది. చెప్పు లావణ్య మాట్లాడవే అంటూ తన గడ్డాన్ని పైకెత్తాడు సిగ్గుతో తలవంచుకుంది.ఏం మాట్లాడను బావ కళ్ళతోనెే అంది మాట్లాడ లేదని మారాం చేశావుగా ఇప్పుడు ఏంటి మౌనంగా ఉండిపోయావు అంటూ గిలిగింతలు పెడుతూ నవ్వాడు.

ఆ ఆ చాలు చాలు బావ నవ్వుతూ అంది ఏం మాట్లాడాలి ఏం లేదు బావ అంటూ పక్కకు జరిగింది సిగ్గుతొో రేపు పెళ్ళయ్యాక కాస్త సిగ్గు దాచి పెట్టు నా వైపు చూడు కళ్లలోకి కళ్లు పెట్టి చూసాడు రెండు చేతులతో కళ్ళు మూసుకుంది ఏంటి బావ అలా చూస్తున్నావ్ మరింత సిగ్గుపడుతూ అంది లావణ్య మాట మారుస్తూ బావ ఇంకా పడుకోలేదా నీవు చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము. అని ఇలా వచ్చాను తను వచ్చిన విషయం దాస్తు పద చాలా పొద్దుపోయింది పడుకుందాం నెేను బయటే పడుకుంటాను నువ్వెళ్ళు లావణ్య గుడ్ నైట్
గుడ్ నైట్ బావ అంది

లావణ్య కు రాత్రంతా నిద్రపట్టలేదు బావను గురించి ఆలోచిస్తూ పడుకుంది. పిల్లలు అక్క అంటూ లేపడంతో తెలివి వచ్చింది బారెడు పొద్దెక్కింది హాళ్లో అంతా హడావుడిగా వుంది ఏమిటో అంత హడావుడి అనుకుంటూ ఫ్రెష్ అయి హాల్లోకి వెళ్ళింది.అత్తయ్యలు మామయ్యలు వచ్చారు. బామ్మగారితో మాట్లాడుతున్నారు.అమ్మ అందరికీ టిఫిన్ కాఫీలు అందిస్తుంది. హాయ్ అత్తయ్య బావున్నారా ఏం కోడలిపిల్ల బావున్నావా బాగున్నాను అత్తయ్య రా అమ్మా ఇలా వచ్చి కూర్చో హాయ్ మామయ్య ఎలా ఉన్నావమ్మా లావణ్య బావున్నాను మామయ్య నీ చదువు అయిపోయిందటగా అవును మామయ్యా బామ్మ గారు మొదలు పెట్టారు పెళ్లి ముహూర్తాలు ఈ నెలలో చాలా బాగున్నాయట పంతులుగారు చెప్పి వెళ్లారు మీకు ఏది బాగుంటుందో చూడండి ఆ ముహూర్తాలలో మీకేది బావుంటే అది నిర్ణయించండి సరెే అమ్మ ఈ నెల ఇరవై ఏడు న చాలా బావుందమ్మా అదే ఫిక్స్ చేసుకుందాం సరే మీ ఇష్టం తల్లి అంటూ అక్కడినుండి వెళ్లిపోయింది.

పిల్లలందరూ మా అక్క పెళ్లి కూతురైంది అంటూ నవ్వుతూ ఆట పట్టిస్తున్నారు చీ పొండిరా నన్నే ఆట పట్టిస్తారా నవ్వుతూ అంది. పెళ్లి దగ్గరగా పెట్టుకోవడంతో హడావుడి ఎక్కువైంది
పెళ్ళి సందడితో ఇల్లంతా కళకళలాడుతుంది.
లావణ్య పెళ్లికూతురుగా ముస్తాబైంది అంతా ఒకే కుటుంబం కావడంతో ఈ ఇంట్లోంచే బావ కూడా పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యాడు అందరూ హాల్ కి బయలుదేరారు హాల్ అందంగా ముస్తాబైంది పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని స్టేజిమీదికి తీసుకువచ్చారు. బంధుమిత్రుల సపరివార సమేతంగా హాలంతా కిటకిటలాడుతోంది.వేద మంత్రాల సాక్షిగా లావణ్య బావ ఒక్కటయ్యారు బావ అంటూ ప్రేమగా తన కౌగిలిలో గువ్వల ఒదిగిపోయింది.బావ తలపై చేయి వేస్తూ నవ్వుతూ ఇంకా దగ్గరగా తీసుకున్నాడు. చెట్టుపై ఉన్న జంట పక్షులు తమ వైపు చూస్తూ నవ్వుతున్నట్టుగా అనిపించింది ఇద్దరు తలుపులు మూసుకుని .ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తమ ప్రేమ ప్రపంచంలో అడుగు పెట్టారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!