అమ్మ ఆత్మీయత

అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” )

అమ్మ ఆత్మీయత 

రచన: D.స్రవంతి

నాని త్వరగా రెడీ అవ్వు టైం అవుతుంది..రా..
ఏంటమ్మా.. ప్రతి పండక్కి ఇంట్లో ఉండకుండా అటు ఇటు తిప్పుతారు. మనం వెళ్ళేదే… సంవత్సరానికి ఒకసారి…
నువ్వు గొడవ చేసావో మీ నాన్న అసలే పంపరు నాని..
ఇప్పటి పిల్లలకి ఏం తెలుస్తుంది….
ఇంకా మా చిన్నప్పుడు అయితే ఉమ్మడి కుటుంబం తోటి ఎంత సందడిగా ఉండేదో అందరూ ఒకచోట చేరి భోజనాలు చేయడం ఆనందంగా గడపడం, ఆ ..ఆటలు సంతోషాలు వేరు.. హూ.. ఇప్పటి పరిస్థితుల్లో ఎవరి పనుల్లో వారు బిజీ అయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్నారు. మేము కనీసం సంవత్సరానికి ఒకసారి అయిన కలుసుకుంటున్నాము అంది అమ్మ.
అమ్మ వాళ్ల ఊరు వెళ్లాలని అమ్మమ్మ, తాతయ్య, మామయ్య తన బంధువులను కలుసుకోవాలనే తపన ఆరాటం మాటల్లో చెప్పలేనివి.
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరగానే అమ్మ చేసే సందడి అంతా ఇంతా కాదు తన బంధువులను స్నేహితులను అందరినీ కలిసినప్పుడు ముఖంలో కనిపించే ఆనందం నాకెన్నో విషయాలూ తెలియజేసేవి. బంధాలు, బంధుత్వాలు ప్రేమానురాగాలు, బంధాలకు అమ్మ ఇచ్చే విలువలు అర్థమయ్యేవి.
నాన్న ఉద్యోగ రీత్యా మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం సంవత్సరానికి ఒకసారి అమ్మమ్మ వాళ్ళింటికి నానమ్మ వాళ్ళింటికి వెళ్లేవాళ్లం. సంతోషంగా గడిపే వాళ్ళం రోజులు గంటలుగా గంటలు నిమిషాలు గా గడిచిపోయేవి. చా..అప్పుడే సెలవులు అయిపోయాయి అనిపించేవి… ఆ రోజులు.
మరుసటి సంవత్సరం నానమ్మ తాతయ్య కాలం చేశారు… ఇంకా ఊరు వెళ్లడం తగ్గిపోయింది.
నా స్టడీస్ లో నేను, ఉద్యోగంలో నాన్న బిజీగా ఉండి వెళ్లలేక అమ్మ ఒక్కతే అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్లి వస్తూ ఉండేది. వెళ్ళి వచ్చిన ప్రతిసారి జరిగిన విషయాలు, గడిపిన క్షణాలు చెప్పేది.
కానీ ఒక సారి అమ్మ ..నాకు,నాన్నకు ఏమో చెప్పాలని ప్రయత్నిస్తునా మేము అవి ఏమీ పట్టనట్టుగా ఎప్పుడూ అక్కడ ఉండే విషయాలే సంతోషాలే కదా.. అమ్మ చెప్పేది అని ఎవరి పనుల్లో వాళ్ళం బిజి అయి వినిపించుకోలేదు.
ఈసారి నాన్న నేను కూడా అమ్మమ్మ తాతయ్య ఇంటికి వస్తాము అని అన్నా….అమ్మ మమ్మల్ని రావద్దని వారించింది.అందుకు సరే అని తనని ఒక్కదాన్నే పంపించాము. కానీ ఎందుకు అలా అంటుంది అని ఆలోచించ లేకపోయాను..
అలా కళ్ళముందు కదిలి వెళ్ళిన అమ్మ కొన్ని గంటల్లోనే మృత్యుఒడిలోకి చేరింది. వెళుతున్న బస్సు యాక్సిడెంట్ అయింది,
హాస్పిటల్లో డాక్టర్లు మేము చాలా ట్రై చేసాము కానీ తన మానసిక ఒత్తిడికి గురి అయింది తన శరీరము ట్రీట్మెంట్ కి సహకరించడం లేదని , అందుకే తన ప్రాణం కాపాడలేకపోయాము అని చెప్పారు.
అమ్మ మానసిక ఒత్తిడికి గురి కావడం ఏంటి! ఏం జరిగింది! అమ్మ బంధాలు బంధుత్వాలు ఆత్మీయతకు అనురాగాలకు ప్రతీక . ఇలా కావడం ఏంటి అని నాలో నేనే మదన పడ్డాను.
కొన్ని రోజుల తర్వాత తాతయ్యకు పక్షవాతం వచ్చి కాలం చేశారు. అక్కడికి వెళ్ళిన నాన్నకు నాకు అసలు విషయాలు తెలిసాయి…
తాతయ్య ఆస్తి పంపకాలు చేశాడు. అందుకు మామయ్య ” అమ్మను దత్తత తీసుకున్నారు అని, పెళ్లి చేశారు, అన్ని పెట్టుపోతలు చేశారు ,ఇంకా ఆస్తిలో భాగాలు కూడా నా.. బాగా లెందుకు ఆస్తి మొత్తం తనకి ఇవ్వండి అని అనడంతో” అసలు విషయం అప్పుడే తెలిసిన అమ్మ నిర్ఘాంతపోయింది ,తను వాళ్ళకు ఏమి కానని, ఏ బంధుత్వం లేదని, ఆప్యాయత అనురాగాలు లేవని తెలిసి చాలా మదన పడింది ,మానసిక క్షోభను అనుభవించింది అమ్మ.
ఈ విషయాలన్నీ మాకు చెప్పాలని చాలా తాపత్రయ పడింది కానీ మేము ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా.. అయిపోయి అమ్మను పట్టించుకోలేదు.
అమ్మ…అమ్మ… నీ బాధను నేను అర్థం చేసుకోలేకపోయాను, మానవ సంబంధాలకు,ప్రేమ అనురాగాలకు, బంధుత్వాలకు విలువ ఇచ్చిన నువ్వు వారికి నువ్వు ఏమీ.. కావు ..అన్న మాటకు ఎంతలా నీ హృదయం ద్రవించిందో…
నన్ను మన్నించు అమ్మ.. నీతో సమయాన్ని గడప లేకపోయాను, నీ బాధను అర్థం చేసుకోలేకపోయాను, నీ మాటలను వినిపించుకోలేదు క్షమించు.

మనము ఎంత బిజీ పనిలో ఉన్న, మన అన్న వారి తో సమయాన్ని గడపాలి, మన ఆత్మీయుల యోగక్షేమాలు తెలుసుకోవాలి
ఓ చిన్న చిరునవ్వు
ఓ తియ్యని పలకరింపు
బంధాలను దగ్గరికి చేరుస్తుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!