గడిచినరోజులు

అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” )

గడిచినరోజులు

రచన: చెరుకు శైలజ

కమ్యూనిటీ లో అందరం కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా కలిసి వెళ్ళేవాళ్ళం.
వినాయక చవితి, శ్రీరామనవమి అయితే ఆ సందడే వేరు వినాయక చవితి వేడుకలు పదకొండు రోజులు చేసేవారు.
రోజు పూజలు,ప్రసాదాలు సాయంత్రం ఏదో ఒక కార్యక్రమం పిల్లల డాన్సులు పాటలు , పెద్దల ప్రవచనాలు ఎన్నో టాలేంట్ లు బయటకు వచ్చేవి. మేము సాయంత్రం విష్ణూ సహస్ర నామాలు చదివే వాళ్ళం .ఆ వినాయకుని మండపంలో కూర్చుని రోజు వారి పూజను తిలకించే వాళ్ళం. ఎన్నో రకాల ప్రసాదాలు వచ్చేవి .వాటిని మేము అందరం ఆడవాళ్ళం కలిసి అందరికి పంచేవాళ్ళం. చివరి రోజు వినాయాకుని సన్నిధి లో హోమం అక్కడే భోజనాలు ఆ తరువాత సాయంత్రం ఊరేగింపు మా కమ్యూనిటీ చుట్టూ తిరగడం బాండ్ మేళం డాన్స్ లు పాటలు భార్య భర్తలు కలిసి డాన్స్ చేయడం ఆడవాళ్లం కోలాటం ఎంతో ఆనందంగా సాగేది. అప్పుడే అందరికి ప్రసాదాలు పంచడం. అవి తింటు హాయిగా ఆ దేవుని ఊరేగింపులో పాల్గొనే వాళ్ళం
ఎమా కమ్యూనిటిలోనే పక్క నే ఖాళీ జాగా లో నిమజ్జనం చేసేవాళ్ళం .అక్కడ ఒక పెద్ద గొంత తవ్వి అందులో మా మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసేవాళ్ళం. ఎంతో సరదాగా ఆ పదకొండు రోజులు అందరు కలిసిమెలిసి సంతోషం గా గడిపేవాళ్ళం. శ్రీరామనవమి మన ఇంట్లోనే రాముని కళ్యాణం జరుగుతుంది అన్నట్టుగాఉండేది. అక్కడే భోజనాలు సాయంత్రం రాముని విగ్రహలతో ఊరేగింపు పాటలు, భోజనాలు డాన్స్ లు ఇంటికి వచ్చేసరికి రాత్రి అయ్యేది. శ్రావణ మాసంలో పూజలు, పేరాంటాలు చాలా జరిగేవి.
ఒక వారం ఒకరి ఇంట్లో లలిత సహస్ర నామాలు చదువుతు పసుపు కుంకుమలు తీసుకొని అందరం సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. బతుకమ్మ అందరం కలిసి మొదటిరోజు ఆడేవాళ్ళం .చివరి రోజు సద్దుల బతుకమ్మ చాలా బాగా చేసుకునేవాళ్లం . రంగు రంగుల పట్టు చీరలతో పెద్ద పెద్ద బతుకమ్మ లతో ఆ ఆట పాటలతో
మా కమ్యూనిటీ అంతా ఎంతో వైభవంగా జరిగేది . ఫోటోలతో , సెల్ఫీలతో మగవాళ్ళు పక్కనే నిలబడి ఆనందంగా తిలకించే వాళ్ళు. మాకు అలసిపోకుండా కుర్చీలు వేయించే వాళ్ళు. మంచినీళ్లు పెట్టించే వాళ్ళు. బతుకమ్మ పాటలు రీరికార్డింగ్ పెట్టే వాళ్ళు. ఆ పాటలకు అనువుగా మేము చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడేవాళ్ళం.బతుకమ్మ ఆడినాక ఆ బతుకమ్మలను ఒక నీళ్ళ గుంటలో నిమజ్జనం చేసి బతుకమ్మ ఓలాలాడే పాట పాడుకొని అందరికి ఆ బతుకమ్మ లో ఉన్న పసుపు గౌరమ్మని అందరికి ఇచ్చి కుంకుమ బొట్టు అందరికి పెట్టి మేము తీసుకుని పోయిన ప్రసాదాలు పంచి రాత్రి వరకు ఇంటికి వచ్చే వాళ్ళం. నిజంగా ప్రతి ఒక వేడుక అందరం కలిసి బాగా జరుపుకునే వాళ్ళం. కాని ఈ కరోనా వైరస్ వచ్చి ఎవరికి వారే యమున తీరే లాగా చేసింది. ఒక నెల కాదు ఆరునెలలు కాదు. ఏకంగా సంవత్సరం దాటిపోయింది.ఎవరి ఇంట్లో వాళ్ళె పండుగలు జరుపుకోవడం.బతుకమ్మ కూడా ఎవరి ఇంటి ముందు వారే ఆడి గబగబా తీసివేసి తలుపులు వేసుకోవడం.ఒక ఫోర్లులో ఉన్న వారు కూడ చూసుకున్నా మాట్లాడేది లేదు. ఆ మాస్క్ పెట్టుకొని భయంతో హడావుడిగా ఎవరైనా ఎదురైతారోమోనని భయంతో ఇంట్లో కి దూరడం. మరి ఈ సెకండ్ వెవ్ గాలిలో కూడా వస్తుంది అని చెప్పేసరికి మరి భయం ఎక్కువ అయింది.ఇంక తెలిసినవాళ్ళు బంధువులు ప్రెండ్స్ ఎందరో కరోనా వలన ప్రాణాలు కోల్పోయారు .దానితో భయం ఎక్కువైంది. మనిషి ఎదురైతే భయమే, అంతకు ముందు ఏదైనా జంతువు ఎదురైతే బయపడే వాళ్ళం. ఇప్పుడు మనిషిని చూసి మనుషులమే భయపడుతున్నాం.ఏమిటి విపరీతమైన రోజులు ఎందుకు ఇలా జరుగుతోంది. మనకు మనమే ఇంట్లో కూర్చుని ఎన్ని నాళ్ళు ఇలా ఎవరిని కలవకుండా, చూడకుండా భయం లేకుండా ఉండేది.మాట్లాడేది ఎప్పుడు ఆ రోజులు తీరిగి వచ్చేది ఎప్పుడు.ఆదే తెలియని పరిస్థితి పిల్లలు ఏ ఆటలు లేకుండా ఇంట్లో నే ఆన్లైన్లో పాఠాలు వాళ్ళ తో పాటు తల్లి కూడా పిల్లల పక్క నే కూర్చుని ఉండడం. వాళ్ళ రేపటి భావి భవిష్యత్తు ఏమిటి? ఇంట్లో నే పాఠాలు నేర్చుకోవాల్సిన దేనా! ఆ పాఠశాలలు తెరిచేదెపుడు వాళ్ళు మరల వారి తోటి స్నేహితులతో ఆడుతూ పాడుతు బడికి వెళ్లేది ఎప్పుడు. ఇవన్నీ ప్రశ్నలే వీటి జవాబులు కాలమే చెప్పాలి. ఈ కరోనా లో అంత పెండ్లిలు మనకు కావలసిన వాళ్ళు చేసుకున్న వెళ్ళలేక ఇంట్లో నే వీడియో లైవ్ చూడడం. ఎంత దగ్గరి వాళ్ళుచనిపోయిన వెళ్లె వీలులేక బాధ పడుతు గడిపిన రోజులు. ఎంతో దారుణమైన రోజులు ఎవరికి రావద్దు ఇలాంటి రోజులు. కాని మొత్తం ప్రపంచనికి వచ్చింది. ఇలాంటి దుస్థితి. ఈ రోజు ప్రపంచం అంతా ఒకే తీరుగా ఉంది. ఉన్న వాడు, లేనివాడు ఎవరికైనా ఒక్కటే కరోనతో భయమే.మా కమ్యూనిటీలో కరోనా చాలా మందికి వచ్చింది. దానికి ఇద్దరు బలి అయ్యారు. అలివేలుఆంటీ చాలా మంచిది ఉండే పారాయణ టైంలో ఎప్పుడు నవ్వుతు పలకరించేది . ఆంటి కరోనా తో పోయింది అని తెలిసే సరికి నేను తట్టుకోలేక పోయాను. వెంటనే ఒకరీకి ఫోన్ చేశాను హాయ్ అండి. ఏమిటి అలివేలు ఆంటీ కరోనాతో చనిపోయారట కదా జయ అవును గాయిత్రి
నేను ఇప్పుడే మెసేజ్ చూశాను .ఎంతో మంచి ఆంటీ ఉండే కదా! నిజం ఆ ఆంటీని మనం మిస్ అవుతున్నాం. కనీసం చివరి చూపు చూద్దాం అన్న కరోనా తో పోయారు . అమ్మో ఇంకా ఏమైనా ఉందా మాములుగానే బయటకు వెళ్లడం లేదు .ఇంకా దీనికి వెళ్ళడమా గాయిత్రి అంది. సరే జయ ఒక పని చేద్దాం మనం అందరం ఆ ఆంటీని తలుచుకుంటు 3నిమిషాలు మౌనంగా ఉందాం.ఈ విషయం ఆందరీకి తెలియాలి. అంటే మీరే ఈ రోజు సాయంత్రం 6గంటలకి అని మెసేజ్ పెట్టాండి. అందరం కలిసి ఎవలరి ఇంట్లో వాళ్ళమే ఆంటీకి నివాళి అర్పిందాం .సరే గాయిత్రి చాలా మంచి ఆలోచన అంది. ఆ విషయం గ్రూప్ లో పెట్టింది జయ. అందరు ఆ టైం కి ఎవరికివారే ఆ ఆంటీకి శ్రద్ధాంజలి ఘటించాం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!