ఎవరికి వారే

అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” )

ఎవరికి వారే

రచన: జయకుమారి

Jaya

యమున తటిలో నల్లనయ్యకై ఎదురు చూసినే రాధ..
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయేనే కదా.
అని పాడుకుంటూ అనిరుధ్ ని తలుచుకుంటూ అద్దం ముందు నిలబడిన జగతి  ని వెనుక నుంచి కౌగిలించుకొని ఎమున్నవే పిల్ల,నిన్ను ఇలా చూస్తుంటే కొరుక్కుని తినేయాలని ఉంది.
ఆహా అవునా కన్నా!
నువ్వు నన్ను తింటూ కూర్చుంటే ఆఫీస్ కి  ఎవరు వెళ్తారు చెప్పమ్మా.!
అబ్బా పిల్ల నా మూడ్ చెడగొట్టకే ఈ రోజు సెలవు తీసుకో పిల్ల అంటూ తనని లత లా అల్లుకుపోతారు. ఇద్దరు అలసిన దేహాలతో ఎప్పుడు స్పృహలోకి వచ్చారో తెలియదు.
టైం చూసుకొంటే ఒంటిగంట అయ్యింది జగతి ఓయ్ కన్నా టైం చూడు ఎంత అయ్యిందో.
నీ చిలిపి ఆకలికి నన్ను కోరుక్కొని తిన్నావ్.ఇప్పుడు కడుపుకి వేసే ఆకలి మాట ఏమిటి ఇప్పుడు వంట చెయ్యాలా ఓరి దేవుడా.
అదే రా బాబు నీతో వచ్చిన చిక్కు. తలలో జాజులు చూసే సరికి ఊపిరి అడనివ్వవు మన్మథుడు వై మధన సామ్రాజ్యాన్ని ఏలేస్తావు.
ఇప్పుడు చూడు ఏమి తెలియని అమాయకుడు లా బొజ్జున్నాడు.
లే స్వామి.! అబా ఏమిటే నీ గోల నాకు నిద్రవస్తుంది కాసేపు భోజ్జోని .
అవునా మరి ఆకలి సంగతి ఏమిటి? లే బయటకు వెళ్ళి ఏదోఒకటి తినేసి కాసేపు అలా తిరిగివద్దం.
ఇప్పుడా బయటకా నేను రాలేను ఏదో ఒకటి చేసేయి. నువ్వు రెడీ చేసి నన్ను పిలవు వచ్చి తింటా.! మొఖం చూడు రెడీ చేస్తే వచ్చి తింటాడు అంట.
మంచంపై నుంచి దిగి చీర సరిచేసుకుంటున్న జగతిని ఎందుకే కష్ట పడుతున్నావు నేను హెల్ప్ చేస్తా కదా, ఏంటి నువ్వా ఉదయం నుంచి నువ్వు చేసిన హెల్ప్ చాలు కన్నా నీకో నమస్కారం నువ్వు నీ నిద్రదేవిని ఆహ్వానించుకో.! హా..హా.. అవునా
నీ పిచ్చి నవ్వు నువ్వు పోరా..పో..
అని ఫ్రెష్ అయ్యి కిచెన్ లో వంట చెయ్యడానికి సిద్ధం అవుతున్న జగతి కి కిచెన్ అంతా నీట్ గా డైనింగ్ టేబుల్ మీదా వంటలు అన్ని సిద్ధం చేసి ఉండటం చూసి ఓయ్ ఇలా రా ఒకసారి ఏమైందే అలా  అరుస్తున్నావ్ అంటూ వచ్చి ఏంటి నీ గోల.!  ఇలా చూడు కన్నా వంట ఎవరో  చేసిపెట్టారు.
హా.హా. అవునా ఎవరై ఉంటారు అబా..
అంటు నవుతున్న అనిరుద్ ని చూసి. ఓయ్ నువ్వేనా ఈ పని చేసింది.నేనా నేను ఎందుకు చేస్తానే. ఓయ్ వేషాలు వెయ్యకు నిజం చెప్పు కొట్టబోతున్న జగతిని గట్టిగా హత్తుకొని,అవునే నేనే చేసానే ఏ చెయ్యకూడదా.! అది కాదు రా నేను ఉండగా నువ్వు చెయ్యడం ఏమిటి.
అవునా అయితే నువ్వే నేను ,నీలో సగం నేను అంటావ్ కదా! ఆ మాటలు అన్ని ఉరికేనే చెబుతావా నిజం కాదా.! ఓయ్ ఉరికేనే కాదు నిజంగా నువ్వు అంటే నాకు ప్రాణం నీలో సగం నేను,నాలో సగం నువ్వు.
కదా అలాంటప్పుడు నీలో సగం అయిన నేను ,నాలో సగం నాతో చిలిపి యుద్ధం చేసి అలిసిపోయి భోజ్జుంటే ఆమాత్రం చెయ్యకూడదా మేడమ్ చెప్పండి న్యాయం జగతి ని చూసి కన్ను కొడతాడు అది చూసి జగతి నా చిలిపికృష్ణడివి రా అని గట్టిగా హత్తుకొని ముద్దుపెట్టుకొంటుంది. ఏంటి మేడమ్ మళ్ళీ కావాలా చెప్పు నేను రెడీ. సిగ్గు లేదు రా నీకు.
హా. హా. అస్సలు లేదు.
పోరా..పో.
సరే దా లంచ్ చేద్దాము.! నేనా నాకు వద్దు పిల్ల ఆకలి లేదు, ఇప్పుడు దాకా వంట చేసి అలసిపోయా. నువ్వు తిను నేను తరువాత తింటా.
అది ఏమి కుదరదు తినాలి.
అబా నన్ను వదిలేయి అంటూ లోపలికి వెళ్ళి పోతాడు. తన వెనుక భోజనం పెట్టుకొని వెళ్లిన జగతిని చూసి ఎంటే తిన్నవా.
లేదు నీకు తినిపించి నేను తింటాను.
అని తినిపిస్తున్నా జగతి చేతిలో ప్లేట్ తీసుకొని జగతి కి కూడా తినిపిస్తాడు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తుఅలా ఉండి పోతారు చాలా సేపు, జగతి ఫోన్ రింగ్ అవ్వడంతో ఇద్దరు ఈ లోకం వస్తారు. జగతి లేచి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు శాంతి అంటూ
ఒక ఐదు నిముషాలు మాట్లాడి సరే చెబుతా.
ఉంటాను శాంతి అని ఫోన్ పెట్టిసి మళ్ళీ అనిరుధ్ దగ్గరకు వచ్చి.
కన్నా..
హా చెప్పు.
కన్నా..
హా చెప్పు పిల్ల.
అది కాదు,ఏది కాదు. ఏమి చెప్పాలి అనుకుంటునవ్ చెప్పు.
అది మా ఫ్రెండ్ శాంతి ఉంది కదా , వాళ్లకి సాఫ్ట్వేరేకంపెనీ ఉంది దానిలో మెనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది అంట. నువ్వు చేస్తావ్ ఏమో అని అడగమంది.
ఓహ్ అవునా.!
నువ్వు ఏమన్నావ్.
నేను ఏమంటాను నీకు చెబుతా అన్నాను.
నాతో ఏమిచెబుతావ్,నేను ఏమంటానో నీకు తెలియదా.
తెలుసు కానీ.
హ్మ్మ్ కానీ.
అది కాదు రా కన్నా,ఇప్పుడు అంటే ఇద్దరమే రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అంటే నీవు కూడా జాబ్ చేస్తే తప్పా, వాళ్లకి ఒక లైఫ్ ఇవ్వలేము.
మనం అంటే ఎలాగూ అనాథలం, మనల్ని చూసుకొనే వాళ్ళు లేక ,డబ్బు లేక ఎలా బాధ పడ్డమో తెలుసు కదా.
అయితే ఇప్పుడు ఏమంటావ్.
నేను అనేది ఒకటే ఆ సినిమా పిచ్చి ,ఆ డైరెక్షన్ పిచ్చి వదిలి నువ్వు జాబ్ చేసుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది.
మనమిద్దరం కనుక నా జీతం సరిపోతుంది. పైగా ఇంటి కోసం అప్పుకూడా చేసాము.వాటి ని తీర్చడానికి నువ్వు కూడా జాబ్ చెయ్యక తప్పదు.
అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఏమంటున్నావ్ నేను ఎమీ చేతకాని వాడిలా కనిపిస్తున్నా కదా.
అలానే ఉండు ఏదో రోజు నేను అనుకున్నది సాధిస్తాను.
ఎప్పటికి కన్నా,! మనలాంటి వాళ్లకి ఆ సినిమా ఛాన్స్ ఇస్తారా. ఇవ్వరు కాబట్టి నా మాట విని ఈ జాబ్ చెయ్యరా ప్లీస్ విను మాట.
నేను విననే నా ప్రాణం ఉన్నత వరకు నా లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటా.
నాకు ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వడం మనెయ్యి.
ఓహ్ నావి చెత్త సలహాల, సరే రేపు పిల్లలు పుడితే ఎలా పెంచుతావ్,ఇలాంటి ఉచిత సలహాలు,చెప్పిపెంచేస్తావ.ఇప్పుడే
నేను బయటకి వెళ్లి జాబ్ చేస్తే నే గాని తినడానికి లేదు గాని చేబుతున్నాడు అని తిట్టుకుంటున్న జగతిని చూసి అవును నేను నీకు లోకువ అయ్యిపోయానే ఉద్యోగం లేక సరే నేను అనుకున్నది సాదించే వరకు నీకు కనిపించాను బ్యే ఆపట్టి వరకు నువ్వు నేను ఎవరికి వారే యమునా తీరే అంటూ వెళ్లిపోతాడు.
ఇప్పటికి వెళ్లి పది రోజులు అవుతుంది. తనని తలుచుకొంటూ. తన మీద బెంగతో పిచ్చిపట్టింది రా నాకు నీ ప్రేమ పిచ్చి. నన్ను పిచ్చిదానిలా తయారుచేసావు కదరా నీ ప్రేమ తో.
నిను తలచే ప్రతినిముషం నీ తలుపుల జడి వానలో తడిచి ముద్దవుతున్నా.. ఏ మంత్రం వేసావో, ఏ మత్తు జల్లవో ఏమో కాని నువ్వు తప్ప వేరే లోకం లేదు నాకు.నన్నే నే మరచి నీ లో ఉన్న నన్నే  వెతుకుతున్న ఏ తీరాన ఉన్నవో,ఏ నాటికి నా దారి చేరవో ఎక్కడ ఉన్నావ్ రా .!  నను విడిచిపెట్టి .
అయినా అంత కోపం ఏంటి రా నీకు మొరటోడువు రా.! జాలి ,దయ,ప్రేమ ఏమి లేవా నీకు.
అవును లే ఉంటే ఇలా వదిలేసి ఎందుకు వెళ్తావ్.
నాదే తప్పు నీ గురించి తెలిసి కూడా నిన్ను అడగటం. దయచేసి వచ్చేయి కన్నా ఇంటికి.ఇంక ఎపుడు నిన్ను ఏమి అనను నువ్వు ఏమి చెయ్యాలి ఆనుకుంటున్నావో అదే చేసుకో అని ఏడుస్తున్న జగతికి కాల్ చేస్తాడు అనిరుధ్ నాకు ఒక సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది అంటూ. సాయంత్రం ఇంటికి వచ్చేస్తున్నా అని ఆంతే మళ్ళీ జగతి నవ్వుతూ తన కోసం ఇష్టమైనవి చేసి ఎదురుచూస్తూ ఉంటుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!