గమనించుకో ఒకసారి

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

గమనించుకో ఒకసారి

రచన: లక్ష్మీ అక్షర

ఏ మానవాళి ఏమై పోయావు మానవత్వం లేకుండా చేసుకుంటూ మనసును స్వార్ధపు ఆలోచనలు
అంటించుతూ చేతులకూ సహాయం అనే ఆయుధం ఇవ్వకుండా పక్కవారిని తోస్తూ ఆలోచనలకు అసూయ నేర్పుతూ ఆనందాలను చూసే కళ్ళకు కుళ్ళును చూపిస్తూ
నిన్ను నీకే లేకుండా చేసుకుంటూ నీకంటూ ఒక మనసు లేకుండా ఎందుకు చేసుకుంటున్నవు నువ్వు మారితే మారావునన్ను ఎందుకు మారుస్తున్నావు నిన్ను నిన్నుగా చూపేది నీలో అంత రంగంలో దాగున్న
నీ ప్రతిబింబాన్ని నేను నన్ను మార్చకు
నన్ను మార్చే ప్రయత్నం చేస్తూ నీకు నువ్వు అలుసు అవుతూ
నీకు నీవే లేకుండా మాయం అవ్వకు
మానవ!!!
మనసూ పెట్టీ ఆలోచించి
ఒకరి సంతోషానీకీ కారణం నువ్వై
నీ మనసుకు ఆనందాన్ని ఇవ్వు
నీలో ఉన్న నాకు
ప్రశాంతతని ఇవ్వు!!!
ఒక మనసున్న మనిషిగా ఉన్న నీకు
నా చిన్న మనవి ఇది…

You May Also Like

3 thoughts on “గమనించుకో ఒకసారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!