జీవనపయనమోక సమరం

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

జీవనపయనమోక సమరం

రచన: అయితగాని జనార్దన్

వెన్నెల కెరటమై
ఏ వెలుగుల తీరానికో…
కన్నుల కాంతివై
ఏ ఊహా స్వప్నానికో…
మనసంతా మౌనమై
ఏ పరవశ పాశానికో…
ఊహాలన్నీ ఉప్పెనై…
ఏ మిధున రాగానికో…
కాలమంతా ఘనీభవించి
ఏ స్నిగ్ద స్థోస్త్రానికో…
దిక్కుమాలిన పయనం
ఏ దిక్కుతోచని మార్గానికో…
తీరమెరుగని కెరటం
ఏ పుణ్యమెరుగని పునర్జన్మకో…
వడి రేగిన సుడిగాలి
ఏ పవన కవ్వింపుకో…
శూన్య జాబితాల సుఖనిద్ర..
మౌనరాగాల మగత ముద్ర…
తీరమెరుగని తీయని మహారుద్ర…
సాగిపో నేస్తం… సమరం కొత్తకాదు…
జీవనపయనమోక సమరం…

You May Also Like

One thought on “జీవనపయనమోక సమరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!