అప్రమత్తం

అప్రమత్తం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

అప్రమత్తంగా ఉండాల్సిన చోట
ఆనందంలో మునగ కూడదు
సంతోషించాల్సిన సమయాన
సందేహంలో మునగ కూడదు

హరీష్ కొంచెం స్పీడ్ తగ్గించు వెనుక నుంచీ హారిక అరుస్తోంది. కాదు.. ఈ సినిమా గురించి నీకు తెలియదు. స్ట్రాటింగ్ మిస్ అయితే, ఇంకా ఏమి అర్దం కాదు, అంటూ వేగంగా ముందుకు దూకించాడు వాహనాన్ని. మరు క్షణంలో మేము మరో లోకంలో విహారిస్తున్నాము. అనంత లోకంలో విహారం. అంతు లేని ఆనందానికి పయనం ఒక్కసారిగా నా కళ్ళ ముందు నా పిల్లలు కదలాడారు. కళ్ళల్లో నీరు ఉబికి వచ్చింది. వారి వద్దకు చేరలేని నా శరీరం అంతులేనిదిలే వారిపై నా మమకారం హెల్మెట్ వాడమంటే వినరు. హడావిడి ప్రయాణాలు. ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏమిటో! అంటూ ఒక పెద్దాయన అంటున్నారు. రక్తపు మడుగులో రెండు శరీరాలు, రోడ్డు మీద తెగి పడిన అవయవాలు కడుపు కోతేగా తల్లిదండ్రులకు
అనాధలుగా మిగిలే పసి పిల్లలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!