ప్రేమ్ ప్రయాణం

ప్రేమ్ ప్రయాణం

రచయిత ::బొడ్డు హారిక

రాజమండ్రిలో రమేష్ గారు ఉండేవారు, ఈయన తోపుడు బండిపై వీధుల్లోకి వెళ్ళి చొప్పులు అమ్ముతూ ఇంటిని గడిపేవాడు.

ఇంతకీ చెప్పడం మరిచానండోయ్……………..రమేష్ గారి ధర్మపత్ని పేరు రాధ , రమేష్ కీ రాధకీ 1990లోనే పెళ్ళి జరిగిందండి…

రమేష్ గారు వాళ్ళు రాజమండ్రిలో V.T College రోడ్డు దగ్గర వీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. రమేష్ చాలా కష్టం మీద ఇల్లు గడిపేవాడు.

రాధ ఉదయమే రమేష్ కీ భోజనం తయారు చేసి బాక్స్ పెట్టి పంపించేది,అలా రాధ రమేష్ కీ కడుపు నింపుతూ తను ఒకోసారి గంజిని తాగేది, ఇలా అతి కష్టం మీద ఇల్లు గడిపేవారు, ఇలా ఉన్న వాళ్ళు ఏ మాత్రం నిరాశ చేంద కుండా జీవితాన్ని ఉన్నంతలోనే సంతోషంగా జీవించాలని, రమేష్ రాధను రోజు సాయంత్రం గౌతమి గార్డుకు వెళ్ళి గోదావరి తీరంలో కూర్చుని చల్లని గాలిని పీల్చుతూ, అక్కడ ఉన్న చాట్ తింటూ ఉండేవారు, ప్రతీ ఆదివారం సినిమాకి వెళ్ళేవారు, ఇలా వారు వారికి ఉన్నంతలో సంతోషంగా ఉంటున్నారు.

చూస్తూ ఉండగానే వాళ్ళ పెళ్ళి జరిగి 2 సంవత్సరాలు అయింది, అప్పుడు రాధ 9 నెలల నిండు గర్భిణి సాయంత్రం 5 గంటలు అయింది, రమేష్ ఇంకా ఇంటికి రాలేదు, రాధకీ నొప్పులు మొదలవు – తున్నాయి, రాధ వాళ్ళు ఇంటి పక్కనే ఉన్న జానకిని పిలిచింది, జానకి వెంటనే ఫోన్ తీసుకుని రమేష్ కు డయల్ చేసింది, రమేష్ ఫోన్ రింగ్ అవుతుంది, ఓ ప్రక్క రాధ నొప్పితో భాద, చివరికి రమేష్ ఫోన్ లిఫ్ చేసి హలో అన్నాడు, వెంటనే జానకి రమేష్ గారు రాధకు నొప్పులు మొదలయ్యాయి అండి, మీరు త్వరగా రండి అంటూ ఫోన్ కట్ చేసి ఎదురింటిలో ఉన్న లక్ష్మీని పిలిచింది,

సమయం 5:30 అయింది, లక్ష్మీ, జానకి రాధకు ధైర్యం చెప్పుతున్నారు, ఈలోగా కంగారుగా రమేష్ వచ్చి జానకి లక్ష్మీ సహాయంతో గవర్నమెంటు హస్పటల్ కీ తీసుకుని వెళ్ళారు, వెళ్ళగానే రమేష్ కంగారుగా డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ లోపడికీ తీసుకు వెళ్ళాడు, డాక్టర్ రాగానే డాక్టరు గారు నా భార్య నా ప్రాణము డాక్టర్ గారు నా భార్య బిడ్డ జాగ్రత్త డాక్టరు గారు అంటాడు, ఆ మాటలకు డాక్టరు గారు ఎవరి భార్య వారికే ప్రాణమయ్యా అని అలాగే జాగ్రత్తగా చూస్తాను అంటారు.

తరువాత డాక్టరు గారు లోపలకు వెళ్ళిపోయారు, రమేష్ బయట కంగారుగా తిరుగు తున్నారు, అప్పుడు జానకి, లక్ష్మీ ఏమీ అవదులే అన్నయ్య గారు అని సర్ది చెప్పుతారు.

తరువాత సమయం కరెక్ట్ గా 6:30 రూమ్ లోంచి పసిపిల్ల వాడు గొంతు వినిపించింది, వెంటనే నర్సు బయటకు వచ్చి మీకు అబ్బాయి పుట్టాడు అంటుంది, అది వినగానే రమేష్ చాలా సంతోషంగా నర్సు చేతులను పట్టుకుని ధన్యవాదాలు నర్సమ్మ అంటూ ఊగిపోయాడు, అక్కడున్న లక్ష్మీ, జానకి లకు కూడా నాకు అబ్బాయి పుట్టాడు అని చెప్పుతున్నపుడు డాక్టరు గారు బయటకు వస్తారు. డాక్టరు గారు రాగానే రమేష్ ధన్యవాదాలు డాక్టరు గారు అంటూ చేతులు ఉపుతూ ఉంటాడు, ఇంతలో డాక్టరు గారు రమేష్ గారు నేను చెప్పుతున్నది ఒకసారి వినండి అంటూ రమేష్ చేతులను పట్టుకుని గుండె నిబ్బరం చేసుకుని వినండి అంటూ అనగానే రమేష్ ఏంటి డాక్టర్ ఏదైన సమస్య అని అడుగుతాడు, అలా అనగానే డాక్టరు గారు ఏమీ లేదు జాగ్రత్తగా వినండి అంటూ బాబు బాగానే ఉన్నాడు అనగానే నా భార్యకు ఏమైనా సమస్య అని అడుగుతాడు, వెంటనే డాక్టరు గారు హ లేదు లేదండి ఆవిడ బాగానే ఉన్నారు. మరి బాబుకా అంటూ వణుకుతున్న గొంతుతో అడుగుతాడు, అప్పుడు డాక్టరు గారు జాగ్రత్తగా అంటూ బాబు బాగానే ఉన్నాడు కానీ చేతులు లేకుండా పుట్టాడు అనగానే రమేష్ గారు ఒకసారిగా కూర్చుండి పోయారు, తరువాత ఒకసారి చూడోచ్చ డాక్టరు గారు అని అడుగుతాడు, హ చూడండి అంటారు.

రమేష్ బాబు ఉండే రూమ్ దగ్గరకు దడ దడ మంటున్న గుండెతో, కనుల నుండి కోలాయిలా నీరు కారుచుండగా బెదురుతూ అడుగులు వేస్తూ వెలుతున్నాడు. రూమ్ లోకి వెళ్ళగానే రాధ మత్తులో ఉండడం వలన పడుకుని ఉంది, రాధ పక్కన ఉన్న బాబును చూసాడు రమేష్, చూడగానే రమేష్ కన్నీటిని ఆపుకోలేక పోయాడు. అలా కన్నీరు కార్చుతూనే రాధ దగ్గరకు వెళ్ళి బాబును ఎత్తుకున్నాడు, ఈలోగా రాధకు మెలుకువ వచ్చింది, ఎదురుగా రమేష్ బాబును ఎత్తుకుని ఉండడం చూసి చాలా సంతోషంగా ఏమండి మన బాబును ఒకసారి చూపించండి అని అడుగుతుంది, అలా అనగానే రమేష్ ఇదిగో చూడు అంటూ బాబును రాధ దగ్గరకు పక్కన వేశాడు, తరువాత రాధ బాబును చూసింది. చూడగానే చేతులు లేకుండా చూసి ఏమండి నా కొడుకుకి ఏమైంది, చెప్పండి చెప్పండి అంటూ తన పరిస్థితిని మర్చిపోయి, పైకి లేచిపోయింది. లేచి డాక్టరు గారు డాక్టరు గారు అని అరిచింది, డాక్టర్ రాగానే నా బిడ్డను ఒకసారి చూడండి డాక్టర్ అంటూ ఏడుస్తుంది, అప్పుడు డాక్టరు గారు అమ్మ మనం ఏమీ చేయలేం అనగానే బోరున ఏడవడం మొదలు పెట్టింది.

రమేష్ రాధను చూస్తూ రాధ ఇలా ఐతే మనం బిడ్డను చూసుకోవడం కష్టం అవుతుంది. నేను ప్రతీ రోజు బయటకు వెళితేనే గాని మనకు గడువదు, బాబు ఈ విధంగా ఉంటే చూడడం ఇబ్బందిగా ఉంటుంది, అంటూనే మాట తడబడుతూ వణుకుతూ రాధతో రాధ బాబును ఆనాధశరణాలయములో చేర్పిద్దాం అంటూ ఎంతో కష్టంతో చెప్పుతాడు, అప్పుడు రాధ ఒప్పుకోదు కష్టం వచ్చినా జాగ్రత్తగా చూసుకుంటా అంటూ ఏడుస్తుంది.

అప్పుడు రమేష్ రాధ మనం మన జీవితాలను గడపడానికే చాల కష్టంగా ఉంటుంది ఇప్పుడు బాబు మన దగ్గర ఉంటే చాలా ఇబ్బంది పడతాడు, ఆనాధశరణాలయంలో అయితే జాగ్రత్తగా చూసుకుంటారు అంటాడు.

రాధ అవునండి మన దగ్గర ఉండి బాధలు పడడం కంటే బిడ్డ సంతోషంగా ఉండడమే మంచిదని చెప్పుతునే ఏడుస్తుంది.

అప్పుడు సమయం:- 8 గంటలు

రమేష్ బాబుని తీసుకుని గోదావరి గట్టు దగ్గర ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘం [ అనాధశరణాలయం ]
దగ్గరకు తీసుకుని వచ్చి బయట వదిలేసి పక్కనే ఒక మూల ఎవరికి కనపడకుండా నిలుచోని చూస్తున్నాడు. ఇంతలో బాబు ఏడవడం మొదలు పెట్టాడు, అనాధశరణాలయం లోపల నుంచి ఒక పెద్దాయన వచ్చి చూసారు, బాబును చూడగానే ఎత్తుకుని లోపల ఉన్న వారిని పిలిచారు.

వాళ్ళు రాగానే బాబును ఎవరో వదిలేశారు, అని వాళ్ళతో చెప్పి బాబును అక్కడున్న ఆయా లతకు ఇచ్చి లోపలకు తీసుకు వెళ్ళమన్నాడు. లత ఆ బాబుని తీసుకుని లోపలికి వెళ్ళింది. అప్పటి నుండి లత ఆ బాబుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది.

అది 1993 వ సంవత్సరం

అనాధశరణాలయంలోకి బాబు వచ్చి ఆరు నెలలు అయిపోయింది, బాబుకి ప్రేమ్ అని పేరు పెట్టారు. ప్రేమ్ ని లత చక్కగా చూసుకునేది.

అది 1998వ సంవత్సరం

ప్రేమ్ కు 5 సంవత్సరాలు వయస్సు, లత ప్రేమ్ ని చాలా జాగ్రత్తగా చూసుకునేది. స్కూలులో చేర్పించింది,ప్రేమ్
తనకు చేతులు లేవని బాధ పడకుండా ప్రతి పాఠాలను చక్కగా చదువుకుంటూ ఉండేవాడు,

అది 2008వ సంవత్సరం

పదవ తరగతి చదువుతున్నాడు, తనతో ఉన్న విద్యార్థులు నీకు చేతులు లేవు కదా ఎలా పరీక్షలు రాస్తావు, ఇంకా ప్రతి చిన్న విషయానికి తనను ఏడిపిస్తూ ఉండేవారు.

అలా ప్రేమ్ చాలా బాధ పడుతూ ఉండేవాడు, ఇలా ఒక రోజు స్కూలు అయిపోయింది, లత ఇంకా రాలేదు, తన తరగతిలో విద్యార్థులు అన్న మాటలు గుర్తుకు వచ్చి ఏడుస్తూ రోడ్డు మధ్యలో నిలుచున్నాడు, ఎదురుగా లారి వస్తుంది, ఎవ్వరూ పిలిచిన పలకడం లేదు , లత వస్తుంది, ప్రేమ్ ని చూసి అరుస్తూ వస్తుంది, ప్రేమ్ పట్టించు కోలేదు,ఈలోగా ప్రేమ్ వాళ్ళ టీచర్ తనను పక్కకు లాగింది, రెప్ప పాటు కాలంలో ప్రమాదం తప్పిపోయింది, లత ప్రేమ్ ని పట్టుకుని ఏడుస్తుంది, టీచర్ ప్రేమ్ ని ఎందుకు ఇలా చేసావు, అని అడుగుతుంది.

ప్రేమ్ ఆ ప్రశ్నకు సమాధానంగా నేను చేతులు లేకుండా ఏమీ చేయగలను టీచర్ అంటూ ఏడుస్తాడు.

అప్పుడు టీచర్

ప్రేమ్ నువ్వు చేతితో మాత్రమే రాయలేవు, అంతే కానీ ఏ ప్రశ్నకు అయినా సమాధానం చెప్పగవు, ఇప్పుడు పరీక్షలు దగ్గర పడుతున్నాయి, జాగ్రత్తగా చదువు, తరువాత కాలితో రాయడం నేర్చుకో అంటూ నువ్వు దేనినైనా సాదించగలవు ఏమైనా సహాయం కావాలంటే నన్ను అడుగు అని ప్రోత్సాహం కలిగిస్తుంది.

అప్పుడు ప్రేమ్

అలాగే టీచర్ గారు అంటూ కన్నీళ్లను తుడుచుకుంటాడు.

తరువాత చదువు మీద బాగా శ్రద్ధ పెట్టి చదివాడు, టీచర్ సహాయంతో వేరోకరితో పరీక్ష రాయడానికి అనుమతి దొరికింది, ప్రేమ్ అన్ని పరీక్షలు బాగా రాసి స్కూలు ఫస్ట్ వచ్చాడు. అప్పుడు ప్రేమ్ ని ఎగతాళి చేసిన ప్రతి ఒక్కరు సిగ్గుతో తలదించు కున్నారు.

తరువాత ప్రేమ్ సెలవులలో కాలితో రాయడం నేర్చుకున్నాడు, మొదట్లో కష్టంగా ఉన్నా నిరాశకు పోకుండా పట్టుదలతో నేర్చుకున్నాడు.

అలాగే ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేసాడు.

తరువాత ఎమ్.కామ్ చేసాడు. కాలితో రాయడమే కాకుండా తనలాంటి వారికి కూడా నేర్పిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు, ఇలా లెక్కలలో ప్రావీణ్యతను సాధించాడు.

తరువాత 2016 నెట్ పరీక్ష రాసి దాని ద్వారా స్కాలర్షిప్ ను కూడా పొంది పి.హెచ్.డి పూర్తి చేసి మంచి లెక్చరర్ గా గుర్తింపు పొందాడు.

ఈ విధంగా ప్రేమ్ తన జీవితాన్ని మరొకరికి ఉదాహరణగా మలచు కున్నాడు.

ఈ విధంగా కొంత మంది తల్లిదండ్రులు పిల్లలు అవిటివాళ్ళుగా పుట్టడం వలన వదిలేస్తూన్నారు.

కొంతమంది తమ స్తోమత బాగోక పిల్లలు భవిష్యత్తును ఆలోచించి వదిలేస్తుంటే, మరికొందరు వారికి సేవలు ఎక్కడ చేయాలో అని వదిలించుకుంటున్నారు.

ఇలా చేయడం వలన వారిని ప్రోత్సహించే వారు లేక కొంతమంది వారు చేయని తప్పుకు వారి జీవితాన్ని ముగించేస్తున్నారు, మన ప్రేమ్ జీవితం కూడా ముగిసిపోవసిందే కానీ టీచర్ ప్రోత్సాహంతో ఎదిగాడు.

ఈ కథ ద్వారా అంగవైకల్యం అడ్డు కాదని ప్రేమ్ జీవితాన్ని ప్రేరణగా తీసుకుని అంబరాన్నంటాలని కోరుతున్నాను.

ఈ కథ ద్వారా కొంత మంది అయినా అంగవైకల్యం ఉన్న వారిని నిరాశ పరచక వారికీ సహాయాన్ని అందించాలని కోరుతున్నాను.

***

You May Also Like

3 thoughts on “ప్రేమ్ ప్రయాణం

  1. Beautiful story
    Aathma staryam mundhu angavaikalyam adduraadu
    Suuuper msg
    Congratulations madem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!