నా బాట రాచబాట (కవితా సమీక్ష)

నా బాట రాచబాట (కవితా సమీక్ష)

సమీక్షకురాలు: విజయ మలవతు

కవితా శీర్షిక: నా బాట రాచబాట
రచన: సత్య కామఋషి

నా బాట రాచబాట అని కవి తన నిర్ణయాన్ని ఏ మాత్రం తడబడకుండా చెప్పిన తీరు శీర్షికలోనే అవగతం అవుతోంది….సత్య కామఋషి గారి నా బాట రాచబాట కవిత చదివిన తర్వాత నా మనస్సులో కదిలిన భావాల సమాహారం నా ఈ సమీక్ష.
నలుగురు ఎలాంటి దారిలో వెళ్లినా నా బాట నాదే ఎవరిని అనుసరించని మనస్తత్వం ఎవరితోడు లేకున్నా ముక్కుసూటిగా వెళ్లే దారి నాది అని మొదటగా చెప్పటం …
వెళ్ళేదారి ఎలాంటిదైనా నా అడుగు ఎప్పటికి తడబడదు అది ముళ్ల బాటైనా, చీకటితో నిండి నడక అసాధ్యం అయినా నా నడక పక్కదారి పట్టదు అంటూ చెప్పిన విధానం చాలా బాగుంది..నేటి జీవితానికి అద్దం పట్టేలా ఉన్న ఈ వాక్యాలు చిన్నవి అయినా అర్థం మెండు గా ఉంది …
కష్టమైనా నష్టమైనా చీకటి అనో పెట్టుకున్న నియమాలను ఎన్నటికి దాటబోనని చెప్పటం..
అందలాన్ని ఎక్కడానికైనా ఎవరికి తలవంచబోనని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పిన భావానికి ఖచ్చితంగా సలాం చెయ్యవచ్చు.
కర్తవ్యాన్ని మరువక మనస్సాక్షికి విరుద్ధంగా ఎలాంటి ముళ్లబాటలో పయనించను, ఎవరెంతవారైనా ఎవరికి దండాలు పెట్టనని తన స్వార్ధం కోసం బాట తప్పనని.. భాధ్యతలకు తలవంచి మంచి దారిలోనే పయనం సాగిస్తాను అని మనస్సాక్షికి నేను బందీని అనటం..
నాబాట ఎప్పటికి ఆదర్శవంతంగా వెలుగు చూపే దిక్కుగా మరొకరికి వెలుగు చూపే విధంగా ఉండేలా ఎప్పటికి నిలచి ఉంటాను అని నిక్కచ్చిగా చెప్పటం చాలా బాగుంది..ఇలాంటి భావాలు అందరిలో ఉంటే ఏ బలహీనతలకు తలవంచక ధైర్యంగా సాగే రాచబాట అవుతుందిగా…

*********************************

నా బాట రాచబాట
రచన: సత్య కామఋషి

నలుగురు అటు పోతున్నారనో
ఆ నలుగురు నడిచే దారి వేరనో..
ఏ నలుగురూ నా తోడులేరనో..
ఒక్కడినై మిగిలిన ఒంటరిననో.!

నేను పోయేదారి ముళ్ళదారనో
కటిక చీకటి కమ్ముకుందనో..
అడుగేసేందుకే చాలా కష్టమనో..
అసలు నడకే అసాధ్యమనో.,

కష్టమని..నష్టమని..దూరమని
చీకటని, చిత్తడని, సాఫీగా సాగలేనని..
వెనుక బడిపోతిననో..జాగౌననో..
గెలవలేననో..ఓటమికి నిలువలేననో

అభివృద్ది అందలాలనందుకొనగ
తేలికనియ, అడ్డదారుల పడి పోలేను..
అర్హతలేని ఎవరికో సాగిలపడలేను..
సలాములు కొడుతూ, గులాముగిరీల
ఊడిగాన్ని, ఎన్నటికీ నేను చేయబోను..

కర్తవ్యానికి బద్ధుడనై..నిజాయితీగా,
మనస్సాక్షికి విధేయుడనై..నీతిగా,
నా బాధ్యతలను విస్మరించక..సాగే,

నా బాట రాచబాట..అనితర సాధ్యం.!
నా అడుగు ప్రగతి బాట..ఆదర్శనీయం.!
అహంకారమని తలచిన పొరబాటు..
వెలకట్టలేని నా ఆత్మాభిమానమే అది..!

*********************************

You May Also Like

2 thoughts on “నా బాట రాచబాట (కవితా సమీక్ష)

  1. నా కవిత…. సమీక్షకు…
    నిజంగా చాలా సంతోషంగా ఉంది…
    ‘నా బాట రాచబాట” అంటూ నా భావాలకు అక్షర రూపమిస్తూ రాసుకున్న మామూలు రాతలు.
    నా అక్షరాలను వాటి లోతుల దాగిన భావాలను వడగట్టి…విశదీకరించి
    నా రాతకు అర్ధాల వన్నెలద్ది ఒక విలువను కట్టబెట్టిన ‘విజయ’ గారికి
    వారి పరిశీలనాత్మక కవితా హృదయానికి….నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ….శుభాభినందనలతో…
    సత్య కామఋషి🙏💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!