చిన్న ఆశ
రచయిత ::అశ్విని ‘sanketh’
ఎందులకో, ఏమిటో నా మనసు విహంగమై విహరిస్తుంది నీ గొంతు వింటే…
నా మనసు పురి విప్పి నాట్యం చేస్తుంది నీ స్పర్శ తగిలితే…
పిల్ల తుమ్మెరగాలి తగిలి పులకించే లతలా పులకిస్తుంది నా మేను నీ చిలిపి చూపులకు…
వాన నీటి కోసం ఎదురు చూసే చకోర పక్షిలా నీ రాక కోసం ఎదురు చూస్తుంది నా మది గది తలుపులు తెరిచి…
ఎన్ని జన్మలు అయినా,ఎన్ని యుగాలు అయినా నీవస్తావని ఎదురు చూస్తూ ఉంటా చిన్న ఆశతో.