పేద…ధనిక

పేద…ధనిక

రచయిత :: సరిత రవిప్రకాష్

ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. వారి కుటుంబం చాలా పేద కుటుంబం.అదే ఊరిలో ఒక శ్రీమంతుల అమ్మాయి ఉండేది.ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అబ్బాయి. ఐతే ఒకరోజు ఆ అమ్మాయికి ఈ విషయం చెబుతాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని,అప్పుడు ఆ అమ్మాయి చెబుతుంది, నీ ఒక్క నెల జీతం నా ఒక్కరోజు షాపింగ్ కే సరిపోదు , అలాంటిది నేను ఎలా నీతో జీవితం గడుపుతానని అనుకున్నావు. నీవే ఆలోచించి చూడు, నేను ఎప్పటికి నిన్ను ప్రేమించడం సాధ్యం కాదు. ప్లీజ్ నన్ను మరిచిపో..నీకే మంచిది.నీకు సరిసమానమైన పిల్లని నీ లెవెల్ కు సరిపోయే పిల్లను చూసి పెళ్లిచేసుకో,అని చెప్పి వెళ్ళిపోతుంది.అయితే ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని మరిచిపోవడం సాధ్యం కాలేదు..అలా 10 సంవత్సరాలు గడిచాయి .ఒకరోజు షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆ అబ్బాయి, అమ్మాయి ఒకరికి ఒకరు ఎదురు పడతారు .అప్పుడు ఆ అమ్మాయి ఇలా అంటుంది. Hey you ….ఎలా ఉన్నావు. నాకు పెళ్ళి అయ్యింది తెలుసా 2 Laks per month. మా ఆయనకు నెలకు 2 లక్షల జీతం. నీవు ఊహించడం కూడా సాధ్యం కాదు. మా ఆయన చూడడానికి కూడా చాలా (Smart)అందంగా ఉంటాడు. అని చెప్పింది. ఆ మాటలు విని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.కొద్ధి సమయం తరవాత ఆమె భర్త అక్కడికి వచ్చాడు. ఆవ్యక్తిని చూసి ఆయనకు నమస్కరించి Sir మీరేంటి ఇక్కడ అన్నాడు.అంతేకాదు భార్యను చూపించి meet my wife అని పరిచయం చేసాడు.భార్యకు ఆయన గురించి ఇలా చెప్పాడు. నేను సార్ దగ్గర పని చేస్తాను. ఆయన ఆస్తి ఎంతో తెలుసా? 200 కోట్లు, అంటే 2 crores . నీకు ఇంకో విషయం తెలుసా మా సార్ ఒక అమ్మాయిని చాలా గాడంగా ప్రేమించాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం మా సార్ ను ప్రేమించలేదు. అందుకే ఆయన ఇంత వరకు పెళ్ళే చేసుకోలేదు. నిజంగా మా సార్
లాంటి మంచి మనిషిని చేజార్చుకున్న ఆ అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలో కదా….
ఈ కాలంలో ఇంతగా ప్రేమించే మనిషి ఎవరు వుంటారు. అని చెబుతాడు..

జీవితం అంటే కేవలం ఒక్క రోజు, ఒక్కక్షణం, ఒక్క సంవత్సరం,కాదు…

సందర్భం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ మనల్ని ప్రేమించే వారిని మనం గౌరవించడం నేర్చుకోవాలి…….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!