ఓ కర్షకా..!
రచయిత ::విజయ మలవతు
పండించిన ధాన్యాన్ని
కన్నబిడ్డలా చూసుకునే రైతన్న
ధాన్యం బస్తానే
కోటి వరాల మూటనుకుంటాడే…!
నేలతల్లినే నమ్ముకున్న ఒకే ఒక జీవి నువ్వే..
ఆధునిక బంధాలకు లొంగనివాడివే నీవని
మరీ వింతగా చూస్తున్నా
చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచేనే నీ పేరు..!
ఎంత ఊడిగం చేస్తున్నా ఓర్పుకి
నిబద్ధతకి కట్టుబడి ఉంటావే…
నీ శ్రమకు ఫలితం దక్కకున్నా
నిరంతర శ్రమజీవి నీవేగా రైతన్న..!
ప్రతి గింజపై నీ పేరు లేకుండినా
అన్ని గింజలు నీకే అన్నంత
తాపత్రయం ముందు అన్ని దిగదుడుపే…!
సంకరజాతి గింజలకై మొగ్గు చూపని
నీ నిర్ణయం తప్పనిపించినా…!
ఆ దేవ దేవుని పై వేసిన భారం
ఆ తీర్పే నీ గమ్యం అనుకున్నా..
ప్రకృతి విలయతాండవం చేసినా..
ఒడ్డున చేర్చే తోవ కానరాకున్నా
నీ పంట కల్లలై జారీ సాగరమవుతున్న
నీ కన్నులో ఆశ తరగదే ఓ కర్షకా…