ప్రేమలేఖ

 ప్రేమలేఖ

రచయిత: కమల ముక్కు ( కమల’శ్రీ’)

రాసానెన్నో ప్రేమలేఖలు
నిన్నే మనసున తలచి…!!!

నా హృదయాన్నే కాగితం లా చేసి
నా మనసనే సిరాతో
ముత్యాల్లాంటి ప్రేమాక్షర
మాలికలను రచించాను…!!!

ఆ లేఖను నీకెలా అందివ్వాలో తెలీక
ఆశ్రయించా నా నయనాలను
నా లేఖలను తన చూపులతో పఠించి
నీ చెవులకు తాకేలా చేయమని…!!!

నా నయనాలను ఓసారి
వీక్షించి చూడు
అర్థమవదా నా మనసు
తెలుసుకోవా నా ప్రేమని…!!!

తెలుసుకుని ఆదరించి
చేరదీయవా నన్ను
హత్తుకోవా నీ హృదయానికి
తీర్చేయవా ఇన్నాళ్ల వేదనని…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!