అమ్మ మాట

అమ్మ మాట

రచన:: డి.స్రవంతి

శృతి…ఏం చేస్తున్నావు తమ్ముడుతో ఆడుకోమని చెప్పానా…. ఎటు వెళ్లావు. ఇక్కడే తమ్ముడు తో ఉన్నాను అమ్మ .

శృతి తన ఆరు నెలల తమ్ముడు తో..కన్నయ మనం బొమ్మలాట ఆడుదామా…అంటూ తన చిన్న చిన్న బొమ్మలతో వంట చేస్తానని గిన్నెలలో నీళ్ళు తీసుకువచ్చి వాటి తో ఆడుతూ ఉంది.

నీళ్ల తోటి ఆడవద్దని చెప్పానుగా శృతి ఎన్నిసార్లు చెప్పినా వినవా… నా మాట
అని తల్లి చెప్పినప్పుడు పక్కకు పెట్టేది…
మరలా అదే ఆట…

తన తమ్ముడిని ముద్దు చేస్తూ మనము ఆడుకుందాము అంటూ తమ్ముడిని ఎత్తుకొని అడుగులు వేస్తుండగా. శృతి..శృతి..అన్న తల్లి పిలుపు వినపడగానే ముందుకు నడుస్తూ నీళ్లపై కాలువేసి ఇద్దరు కింద పడ్డారు. ఇద్దరూ బోర్ మని ఏడ్వడంతో..
శృతి ..చెప్పితే వినవు కదా… అంటూ తల్లి వీపు వాయించింది.
ఏడుస్తూన కూతుర్ని గుండెలకు హత్తుకుని కొంచెం అయితే తమ్ముడికి దెబ్బతగిలేది కదా..చూడు వాడు ఎలా ఏడుస్తూ ఉన్నాడు …అని తల్లి చెప్పడంతో
అమ్మ చెప్పింది నిజమే నేను వినక పోవడం వలన తమ్ముడూ ఏడుస్తున్నాడు అని తనలో తాను పెద్దలు చెప్పిన మాట వినాలి
అని అనుకుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!