ఆఖరి పోరాటం

ఆఖరి పోరాటం

రచన: వేల్పూరి లక్ష్మి మీ నాగేశ్వరరావు

“అది విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం” నిండా ప్రయాణికులతో కళకళలాడిపోతోంది,  సాయంత్రం నుండి వచ్చిపోయే విమానాలతో చాలా హడావిడిగా ఉంది, ఒకపక్క ‘టికెట్ చెకింగ్, మరో పక్క లగేజ్  వేయింగ్, అంతా అయ్యాక ‘టోటల్ బాడీ స్కానింగ్’ అన్ని సదుపాయాలు చక్కగా అమర్చడం వలన ,ప్రయాణికులకు చాలా సౌకర్యంగా  తమతమ ‘బోర్డింగ్ పాస్ ‘లు తీసుకుని తమ విమానాల కోసం ఎంతో ఆత్రుతతో ఆనందంగా ఎదురు చూస్తూ తన గమ్యస్థానాలకు వెళ్ళవలసిన విమానాలు రాగానే, ఎంతో ఉత్సాహంగా విమానాలు ఎక్కుతున్నారు.
ఆ రోజు శనివారం రాత్రి 8:30 కు ,’శ్యామల ‘ఎంతో హడావిడి గా అన్ని సామాన్లు పట్టుకుని, తల్లి తండ్రి దిగ పెట్టడం వలన, సరిగ్గా ఫ్లైట్ టైం కి వచ్చి చేరింది. ‘ఎయిర్ ఇండియా  A-320’ విమానం ‘వైజాగ్ టు దుబాయ్’ బయలుదేరడానికి సిద్ధంగా ఉండడం  వలన  సరిగ్గా లాస్ట్ కాల్ సమయానికి ,శ్యామల ‘నిండు గర్భిణీ ‘వలన ఆపసోపాలు పడుతూ ఫ్లైట్ ఎక్కింది. అందరూ ఆశ్చర్యంగా తనని చూడడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, ఆమె పరిస్థితి చూసి ‘ ఎయిర్హోస్టెస్ లు ‘ఎంతో నెమ్మదిగా సాయం చేస్తూ, నిండు గర్భిణి అయిన శ్యామల ను
తన సీట్లో కూర్చోబెట్టారు, కానీ అర్థం కాని విషయం ఏమిటంటే? ఆస్తమాను కళ్ళల్లో నీళ్ళు తిరగడం, తన చీర కొంగుతో తుడుచుకుంటూ, చూసిన అక్కడ  ప్రయాణికులుఆశ్చర్యపోయారు,
శ్యామల పరిస్థితి చూసి ఎంతో సౌమ్యంగా అన్ని విధాల ఎయిర్ హోస్టెస్ లే సాయం చేయడం మొదలుపెట్టారు.
శ్యామల భర్త ‘రాజేష్ ‘ఎన్నో ప్రశంసలు పొందిన ‘ఆర్మీ ఆఫీసర్’ డిప్యూటేషన్ మీద” UAE బేస్ క్యాంపు కి “అక్కడ ప్రభుత్వపు   ఆర్మీకి ట్రైనింగ్ ఆఫీసర్ గా, వచ్చి రెండేళ్లయ్యింది, శ్యామల కూడా అక్కడే ఉంటూ డెలివరీ కోసం ‘ఇండియా ‘వచ్చింది. ఇంకా 10 రోజుల్లో లో డెలివరీ టైం ఉందనగా ఇంతలోనే ‘ఆర్మీ బేస్ క్యాంప్’ నుంచి’ దుబాయ్ ‘రావాల్సిందిగా కబురు వచ్చి ఉన్నపళంగా నిండు గర్భిణి అయిన శ్యామల కుటుంబీకులు వద్దంటున్నా, భర్త రాజేష్ కి ఏదో ఒంట్లో బాగాలేదు, అన్న అనుమానంతో కంగారుగా డెలివరీ దుబాయిలోని కూడా చేసుకోవచ్చు, ముందు నేను వెళ్ళాలి! అంటు ఆగమేఘాల మీద బయలుదేరింది శ్యామల.
. సరిగ్గా’ నాలుగున్నర గంటల’ ప్రయాణం కాస్త మనసులో టెన్షన్, ఆందోళన ,పరిపరివిధాల ఆలోచనల తో శ్యామల గాబరా పడుతుంది, ఇంతలో  విమాన ప్రయాణం లో అప్పుడప్పుడు వచ్చే ‘ ఎయిర్ బంప్స్ ‘వల్ల  విమాన ప్రయాణం ఒడుదొడుకులు కు లోనై, మరింతగా గాబరా పడుతూ కడుపులోని’ పాపో, బాబో ‘తెగ కదిలిపోతున్నారు, తన చేతితో శ్యామల నొప్పితో కడుపు రాసుకుంటూ మెలికలు తిరిగి పోతున్నాది, దాంతో కొంచెంకొంచెంగా వాంతులు చేసుకోవడం చూసిన పక్కన కూర్చున్న ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ‘చూడండి!  ఈ అమ్మాయి డెలివరీ టైంలో కూడా ‘విదేశీ ప్రయాణం’ పెట్టుకోవడం చాలా వింతగా ఉంది, ఆవిడ చేసుకున్న వాంతులు తెగ కంపు కొడుతున్నాయి,’ చ్చి  చ్చి వీళ్లకు అసలు బుద్ధి లేదు, ఎయిర్లైన్స్ వాళ్లు కూడా టిక్కెట్టు చూసుకుంటారు! గాని ఇలాంటి వాళ్ళని ఎక్కించ కుండా ఆపరు, దీంతో మన అందరికీ ఇబ్బంది కదా!  ఇలా దుబాయ్ లో పని చేయడానికి కి గర్భంతో వెళ్లాలా? సిగ్గు లేదా, డబ్బు కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు అంటూఅందరూ ఏకరువు పెడుతూ’తిడుతూ ఉంటే, ఎయిర్ హోస్టెస్ ‘ని కూడా తిట్టడం చూసిన శ్యామల ఒక పక్క నొప్పి తో ,మరోపక్క ‘మానవత్వం లేని కనీసం ఆడ వాళ్లకు సహాయం చేయనీ తోటి ప్రయాణికులను చూస్తూ, నమస్కారం పెడుతూ” నన్ను క్షమించండి ప్లీజ్ !అంటూ అనేసరికి, అందరూ ముక్కలు మూసుకుంటూ అసహ్యించుకున్నరే! తప్ప ఒక్కరు కూడా సాయం రాలేదు, ఇదంతా చూస్తున్న ఎయిర్ హోస్టెస్ తన  ‘పైలెట్  ‘కి చెప్పి ఎవరినైనా రెండు సీట్లు ఖాళీ చేయమని, అప్పుడు వాళ్ళని వేరే సీట్లు చూసుకోమని రిక్వెస్ట్ చేయమని చెప్పగానే! ‘పైలెట్ తన మైక్ లో ‘మాట్లాడుతూ “ప్లీజ్ పాసెంజర్స్, శ్యామల అనే ఒక ఆవిడ డెలివరీ సమయం రావడంతో చాలా ఇబ్బంది పడుతుంది, ఎవరైనా రెండు మూడు సీట్లు ఖాళీ చేసి  ఇవ్వగలిగితే ఆమెను మా ఎయిర్ హోస్టెస్ లు ఏదో ఒక లాగా  ఇంకా గంట ప్రయాణం ఉంది కాబట్టి, ఆమెను పడుకోబెట్టి సౌఖ్యంగా  డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తారు, ఆపైన దేవుని దయ ప్లీజ్ కోపరేట్ “!!అంటూ వచ్చిన ‘అనౌన్స్మెంట్ ‘ విని ఇద్దరు ఇద్దరు ముసలి దంపతులు తమ సీట్లను ఖాళీ చేసి ఇచ్చారు, వారికి ముందు భాగంలో సీట్లు ఇచ్చి శ్యామల విమానము చివరన ఉన్న రెండు సీట్లలో పడుకోబెట్టారు, చుట్టు ఇద్దరు ఎయిర్ హోస్టెస్ లు రెండు దుప్పట్లు పట్టుకొని శ్యామలకు కావలసిన వేడి నీళ్లు అవి తాగిస్తూ తమ వంతు కృషి చేస్తున్నారు
మరో అరగంటలో ‘దుబాయ్ ఎయిర్పోర్ట్’ వస్తుందనగా శ్యామలకు నొప్పులు మరీ ఎక్కువై పోయాయి, ఎయిర్ హోస్టెస్ లు ఎంతో చక్కగా శ్యామల దగ్గర ఉండి సేవలు చేస్తూ  ఉండగానే ఆమెకు’ నార్మల్ డెలివరీ’ అయిపోయి పాప పుట్టింది. బంగారం లాగా ఉన్న ఆ చిన్న పాపను శుభ్రం చేసి  తల్లి దగ్గర పడుకోబెట్టి, శ్యామల కు కావలసిన ”యాంటీబయాటిక్స్ ‘ శక్తికి కావలసిన మందులు, అవి ఇచ్చి ఎయిర్ హోస్టెస్ లు సంతోషంగా విమానంలోని అందరికీ వినిపించేలా చప్పట్లు కొడుతూ “”the lady with golden baby  and both are safe with good health!!” అని చెప్పగానే అసహ్యించుకున్న వాళ్ళు కూడా  నోరు మూసుకుని చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు. పైలెట్ కూడా మైకులో ‘కంగ్రాట్స్ శ్యామల!’ అండ్ బేబీ” అంటూ ఎనౌన్స్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.
ఇంతలో ‘దుబాయి ఎయిర్పోర్టులో’ ముందు సమాచారం అందుకున్న హాస్పిటల్ సిబ్బంది ‘అంబులెన్స్ లో శ్యామలను పాపను ఎక్కిస్తున్న సమయంలో, శ్యామల తన రెండు చేతులూ ఎత్తి పక్కన నిలబడిన ‘పైలెట్ కు, ఆ వెనకాల ఉన్న నలుగురు ఎయిర్హోస్టెస్ లకు’ నమస్కారాలు పెడుతూ, ఉండగా అంబులెన్స్ కదిలిపోయింది.
.     శ్యామల హాస్పిటల్లో చేరగానే ఆమెకు ప్రథమ చికిత్స అయిన వెంటనే భర్త పని చేస్తున్న ‘ఆర్మీ బేస్ క్యాంపుకు ‘ఫోన్ చేసి  తన వివరాలు తెలిపింది, ఒక రెండు గంటల పాటు ఎంతో ఆందోళనతో ఎదురుచూస్తున్న శ్యామలకు ఇద్దరు ఆర్మీ ఆఫీసర్స్ డాక్టర్ దగ్గరకు వెళ్లి పర్మిషన్ తీసుకుని శ్యామల దగ్గరకు వచ్చి” please come Madam, your husband is waiting”! అని చెప్పి శ్యామలని పాపని ఎంతో జాగ్రత్తగా ‘ ఆర్మీ ఆర్మీ బేస్ క్యాంపు హాస్పటల్’ దగ్గర  కు తీసుకువెళ్లారు.
.  భర్త ఉన్న రూమ్ లోకి ఎంతో ఆందోళన పడుతూ బెడ్ మీద  ‘జీవచ్ఛవంలా ‘పడి ఉన్నా తన భర్తను చూసి కళ్ళనీళ్ళు ధారలై పారుతుండగా “ఏమండీ? ఏమైందండీ !ఇలా ఉన్నారు, ఏంటండీ, మీరు అర్జెంటుగా పాపను చూడాలి! అన్న ఒక్క మాట తోనే డెలివరీ దుబాయిలో చేసుకుందామని వస్తున్న సమయంలోనే, విమానంలోనే పాప పుట్టింది, మీకు ఇష్టమైన కూతురుని, ఇదిగో మీ పక్కన పడుకోబెట్టాను, చూడండి,!! అంటూ కాళ్ళ వేళ్ళ పడుతూ ఏడుస్తున్న శ్యామల ను ,చూసి డాక్టర్లు నర్సులు కూడా ఆశ్చర్యపోతూ, ఇంత ప్రేమ ఉంటుందా!! తన కన్న బిడ్డ కోసం ఆఖరి క్షణాలు లెక్కపెట్టుకుంటూ రాజేష్ పోతున్న  ప్రాణాలను కూడా ఉగ్గబట్టు కొంటు, తన కన్న కూతురి తలమీద  ఒక చెయ్యి, పెట్టి రాస్తూ, మరొక చేయి భార్య తలమీద  పెట్టి  రాస్తూ, ఉండగానే ఎంతో ప్రశాంతమైన రాజేష్ ముఖ వదనం, సంతోషంగా తన చివరి కోరిక తీరినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఉండగానే’ రాజేష్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.’
ఆ తర్వాత శామల కు అక్కడ ఉన్న ‘ఆర్మీ ఆఫీసర్స్ ‘రాజేష్ కు ప్రమాదం ఎలా జరిగిందో? వివరించారు,” చూడమ్మా! రాజేష్ చాలా క్రమశిక్షణతో సైనికులకు ట్రైనింగ్ ఇస్తూ, ఆ భాగంలోని ఒక నిర్జన ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ ఎలా గుర్తించాలి? ఎలా ”diffuse” చేయాలి ?అన్న శిక్షణ ఇస్తున్న సమయంలో , అనుకోకుండా ఒక ల్యాండ్ మైన ప్రే లి, తీవ్ర గాయాలపాలై ,వారం రోజులుగా హాస్పిటల్ లో డాక్టర్లు ఎంత ప్రయత్నాలు చేసినా, రాజేష్ మనకు దక్కలేదు, ఆయన ‘చివరి కోరిక’ అదే, మీకు పుట్టబోయే ‘బిడ్డను కడసారిగా చూడాలని! అని అడిగిన వెంటనే మీకు కబురు పంపించాము! సారీ ,అమ్మ భర్త కోసం మీరు చేసిన సాహసం ఎంతో ప్రశంసనీయమైనది, ‘డెలివరీ ఏ క్షణాన వస్తుందో! కూడా తెలియని పరిస్థితుల్లో ‘ఇండియా నుంచి దుబాయ్’ వరకు విమానంలో ప్రయాణించి భర్త కోరికను తీర్చారు!! అని చెప్పగానే, శ్యామల తన కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ, అందరిలాగే ‘భర్త శవపేటిక ‘కు పాపతో సహా సెల్యూట్ చేయడం!!!! అంత ‘దుబాయ్ టీవీ కవరేజ్’ భారతదేశంలోనూ ప్రసారం అవుతుంటే, శ్యామల తో ప్రయాణించిన ప్రయాణికులు కూడా’ టీవీలో న్యూస్ చూస్తూ అయ్యో!! మనం ఎంత పాపాత్ములము, ఆరోజు ఆ అమ్మాయిని ఎంత తిట్టాము, మమ్మల్ని క్షమించండి అమ్మ! అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
రాజేష్ కి అటు దుబాయ్ గవర్నమెంట్ భారత్ గవర్నమెంట్ సంయుక్తంగా మంచి అవార్డులు ప్రకటించి, శ్యామలకు  భారతదేశంలోని ఆర్మీ క్యాంపు లో ‘గౌరవనీయమైన ప్రభుత్వ ఉద్యోగం’, ఒక ఇల్లు, పాపకి ఎంత చదివినా అన్ని ఫ్రీ గానే పొందేటట్లు అనుమతులు, ఇచ్చి తమ గౌరవాన్ని ప్రకటించుకున్నారు.
ఈ కథ మన భారతీయ మహిళల గౌరవాన్ని అన్ని ఖండాల్లో నూ ఇనుమడింప చేసిన శ్యామల ను వేనోళ్ళ  పొగిడారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!