చిన్ననాటి ప్రేమ

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

చిన్ననాటి ప్రేమ

రచన: చెరుకు శైలజ

హాల్లో నీరజా గారు ఉన్నరాండి
ఎవరు మాట్లాడేది .
నేనే నీరజాను చెప్పండి.
అవతల నుండి ఎలాంటి సమాధానం లేదు మౌనం
ఎవరండి మాట్లాడిండి.. ఎవరు కావాలి? నీరజా గట్టిగా అడిగింది
హాయ్ నీరజాగారు  నేను అభిలాష్ను మాట్లాడుతున్నా
మీరు ఎవరో రాంగ్ నెంబర్ కి కాల్ చేసినట్లు ఉన్నారు.
సారీ లేదు నీరజాగారు నన్ను మీరు గుర్తు పట్టడం లేదు మనం ఊరులో చదువుకునేటప్పుడు చిన్నప్పటి స్నేహితులం అభిలాషు.
నీరజా ఒకసారి గా 40ఏండ్ల వెనుకకు వెళ్ళింది ఆలోచనలతో..
ఊరు బడిలో చదువుకున్నప్పుడు తన ప్రాణ స్నేహితురాళ్ళు ఉమ, రమ, సత్య అంతే వాళ్ళతోనే తను ఎక్కువ క్లోజ్ గా ఉండేది. మరి ఈ అభిలాష్ ఎవరు అని ఆలోచించగా అవును బాలురలో వినయ్, గణేష్,రమెష్ కాకుండా ఇంకా నాలుగు ఐదుగురు అబ్బాయిలు ఉండేవారు. అందులో అభిలాష్ ఆ  గుర్తుకు వచ్చాడు. చాల నీట్ గా బట్టలు వేసుకొని మంచిగా ఉండేవాడు. చదువులో అంతంత మాత్రమే ఉండేవాడు. వాళ్ళ ఊరులో బడి లేదని వాళ్ళ పెద్ద నాన్న ఉండే ఊరుకి చదువుకోవడానికి వచ్చాడు. వాళ్ళు రెడ్డిస్ భూములు జాగాలు బాగానే ఉండేవి. బడికి వచ్చేటప్పుడు రోజు చాక్లెట్స్ తెచ్చేవాడు. మా గర్ల్స్ ఆందిరికి ఇచ్చేవాడు నాకేతే   రెండు ఎక్కువ ఇచ్చెవాడు. ఏదో చదువులో డౌట్ ఉంటే నన్ను అడిగేవాడు.
నీరజా మీరు అందరు కలిసి సాయంత్రం హోం వర్క్ చేసుకుంటారు కదా. నేను కూడ మీతో కలిసి రాసుకో వచ్చా అని అడిగాడు. దానిదే ముంది వచ్చేయి అన్నాను. అలా  రోజు వచ్చే వాడు. మేము రాయడంలో మునిగి పోయే వాళ్ళం. అభిలాష్  మాత్రం రాయకుండా కూర్చునేవాడు.
ఒకరోజు నా స్నేహితురాలు  రమ నాతో.. నీరజా అభిలాష్ నుంచి రేపటి నుండి రావద్దు అని చెప్పవా!
ఎందుకు.
ఏం రాయకుండా నిన్ను చూస్తు కూర్చుంటాడు అంది.
సరే చెప్పుతాలే అన్నాను.
ఆ రోజు అందరు రాసుకోవడానికి కూర్చున్నాం. అభిలాష్ మెల్లగా వచ్చాడు. అభిలాష్ వచ్చవా నీవు మీ  దోస్తులతో కూడి రాసుకో ఇక్కడ  వద్దు అని చెప్పాను
ఎందుకు? నీరజా అంటు అమాయకంగా మొహం పెట్టాడు.
ఎందుకంటే నీవు మా గర్ల్స్ తో ఉండడం ఏమిటి
బాయ్స్ తో కూడి రాసుకో రమ కోపంగా అంది
సరే అయితే అంటు పుస్తకాలు పట్టుకోనీ వెళ్లి పోయాడు .
ఒకరోజు బడి నుండి వచ్చి ‌నేను నా దోస్తుల కోసం ఎదురుచూస్తు ఉంటే  అభిలాష్ వచ్చాడు.
ఏమిటి అభిలాష్ మీ  ఫ్రెండ్స్ దగ్గర కి వెళ్లలేదా అన్నాను
నీకు ఒక మాట చెప్పాలి అని వచ్చాను
ఏమిటి ?
నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దగ్గర  ఉంటే సంతోషం అనిపిస్తుంది
ఆ మాట కి నీరజా అలాగే చూస్తూ
అభిలాష్ ఏమిటి ? ఆ మాటలు ఎవరైనా పెద్దవారు ఆ మాటలు విన్నరంటే చంపేస్తారు.
నేను నిజమే చెప్పాను నీరజా నీ తోడు అన్నాడు
ఆపు నీ పిచ్చి మాటలు ఇంత చిన్నవాళ్ళం అప్పుడే ప్రేమ, దోమ అంటు పెద్ద మాటలు చెప్పకు. ఇంకోసారి నీవు ఇలాంటి మాటలు నాకు చెప్పావు అంటే మా ఇంట్లో చెప్పుతాను.
వద్దు నీరజా అంత పని చేయకు. నాకు భయం అవుతుంది.
అందుకే బుద్ధిగా చదువుకో.
మంచిగా చదువుకుంటే నా ప్రేమను ఓకే  చెప్తావా.
అప్పటికి చూద్దాం. వెళ్లు వెళ్లి నీ పెండ్సుతో కలిసి రాసుకొని చదువుకో అంది .
అలాగే నీరజా రోజు ఇగానే నాతో మాట్లాడుతావు కదా!
సరే మాట్లాడుతాను.
థాంక్యూ నీరజా అంటు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
ఈ విషయం నేను నా స్నేహితురాలకు చెప్పలేదు దానిని ఇంకా ఎక్కువ చేస్తరని, ఊరులో మా చదువు అయిపోయింది. ఎవరి చదువులకు వాళ్ళం వేరు వేరు చోటుగా విడిపోయాం .
ఒకనాడు అది నేను డిగ్రీ చదువుతున్నప్పుడు రమ పెళ్లికి మేము అందరం కలుసుకున్నం. అభిలాష్ కూడా వచ్చాడు.చాలా మారిపోయాడు అప్పటీ అమాయకత్వం లేదు. చాలా బాగా అందరితో మాట్లాడుతున్నాడు.
హాయ్ నీరజా ఎలా ఉన్నావు అంటు నన్ను పలకరించాడు.
నీ పెళ్లి భోజనం ఎప్పుడు అన్నాడు. అయినప్పుడు చెప్తాను అన్నాను.
ఇప్పటికి నా మీద నీకు ప్రేమ లేదా నీరజా  ఎప్పుడో చిన్నప్పటి మాటను గుర్తు పెట్టుకోని అదే విషయం అడగడం . నేనైతే ఇప్పటికి నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాటకి నేను అలాగే చూస్తూ ఉండిపోయాను.
అభిలాష్ మన కులాలు వేరు, ఇంట్లో ఒప్పుకోరు, ఆ విషయం వదిలివేయ్, ఇలా స్నేహితులుగా ఉందాం అంటు అక్కడ నుండి మెల్లగా లేచి నా స్నేహితురాళ్లు కూర్చునా చోటుకి వెళ్లిపోయాను. ఆ మాటతో తను వెళ్లిపోయెంతవరకు ఎందుకో నావైపు కూడా చూడలేదు. మాట్లాడలేదు.
మరలా ఇన్ని రోజుల తరువాత ఏమైంది నీరజా గారు మాట్లాడరు ఎక్కడ ఉంటున్నావు ‌అభిలాష్.
నేను నా జాబ్ టాన్సుపర్ మీద హైదరాబాద్ వచ్చాను.
ఇన్ని రోజులకి గుర్తుకు వచ్చానా ! నీరజా నీ నెంబర్ లేదు. పోయిన నెలలో ఊరు వెళ్లినప్పుడు రమ ఇచ్చింది.
అడ్రస్ చెప్పుతాను. మీ ఆవిడను తీసుకొని ఈ ఆదివారం రా అభిలాష్
తను ఊరులో లేదు.
సరే నీవే వచ్చి కలువు అడ్రస్స్ చెప్పి పెట్టేశాను.
ఆదివారం అభిలాష్ వచ్చాడు. ఎన్నో ఏండ్ల తరువాత అభిలాష్ నుంచి చూడడం అలా చూసేసరికి నాకు చిన్నప్పటి అభిలాష్ కండ్ల ముందు మెదిలాడు. మనిషి పెద్దరికంగా జుట్టు తెల్ల బడి సన్నగా అయిపోయాడు.
రా అంటు ఆహ్వానించి మొదట టీఫిన్, టీ ఇచ్చాను.
మీ ఆయన లేరా అన్నాడు
ఆయనకి ఏదో పని వుంటే వెళ్లారు పిల్లలు ఇద్దరు పాప, బాబు అమెరికాలో ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయాయి. మరి మీకు..
నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప పెళ్లి అయి అమెరికాలో ఉంది. ఇక చిన్న అమ్మాయి పెళ్లి చెయ్యాలి, తను ఒక అతనికి ప్రేమించింది. అతనే చేసుకుంటాను అని పట్టుబడుతుంది. అంటు టిఫిన్ తిని టీపాయ్ మీద పెట్టాడు.
నేను అలాగే చూశాను. మరి చేయడానికే ముందుకి తను ఇష్టపడిన సంబంధం, కులాల వలన ఆలోచిస్తున్నాను.  కులాలు ,మతాలు ఏమిటి ? అభిలాష్ గారు మన తరం మారింది. ఇది నేటితరం తను ఇష్టపడిన వాడితో చేస్తే సంతోషంగా ఉంటుంది.
ఈ మాట ఒక నాలభై సంవత్సరాల క్రితం చెప్పాలేకపోయావు నీరజా.
అది అప్పటికాలం  ఇద్దరం దైర్యం చేయలేకపోయాం. అయిన మనల్ని మంచి స్నేహితులు గా  ఇలా కలుసుకున్నం.
అవును నీరజా చాలా సంతోషంగా గా ఉంది.
వీడిపోయిన మన బంధం ఇలా చాలా రోజులైంది కలుసుకునే సరికి ఆనందంగా ఉంది.
నా రెండో కూతురు పెళ్లి కి మీ వారిని తీసుకుని తప్పక రావాలి అంటు లేచాడు.
అది ఏమిటి అభిలాష్.. భోజనం చేసి వెళ్ళాండి. మా ఆయన కూడా వస్తారు.
పని ఉంది. నేను ఇంకో ఆదివారం మా ఆవిడను తీసుకొని వస్తాను అంటు వెళ్లిపోయాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!