అనుజ్ఞ
రచన:నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం తో పాటు ఇంట్లో అందరూ పరుగులు పెట్టే రోజులు . ఆ ఇంటికి పెళ్లి అయి వచ్చి పదేళ్లు కావస్తోంది అంతా పెద్ద వాళ్ళ ఇష్టం ప్రకారమే మామగారు బ్యాంక్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యారు అత్తగారు లెక్చరర్ చేసి రిటైర్ అయ్యింది. ఆడపిల్లకు సర్వీస్ లో ఉండగా పెళ్లి చేశారు బెంగుళూర్ లో ఇద్దరు పిల్లలతో సుఖంగా ఉంది సాఫ్టు వేరే భర్త అపార్ట్ మెంట్ కారు హోదా అన్ని ఉన్నాయి అమే సంగీతం బాగా పడుతుంది రేడియో టీవీ ప్రోగ్రామ్స్ చేస్తుంది ఇంటి దగ్గర పిల్లలకి క్లాసులు చెపుతుంది.ఇంకా అంతా కంటే ఏమి కావాలి మా కోడలికి ఉద్యోగం వద్దు అన్నారు తెలుగులో. పీజీ చేసింది అప్పుడప్పుడు రేడియో టాక్స్ ఇస్తుంది,ఆడపిల్ల బాగా సెటిల్ అయ్యింది విదేశీ పెళ్లి ఇష్టం లేదు అందుకే స్వదేశీ సంబంధం చేశారు
బంధువులు మాత్రం పిల్ల అందంగా ఉంది మంచి విదేశీ సంబంధం చేస్తే ఇప్పుడు సంగీతానికి అక్కడ బాగా డిమాండ్ ఉంది తెలుగు భాషకు పట్టం కడుతున్నారు.పెద్దలు అంతా మన భాషను
పిల్లలకు సహితం నేర్పించాలి.పెద్దలు ఇంట్లో తెలుగు మాట్లాడటం నేర్పాలి అని పట్టుదలతో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అందులో ఇప్పుడు అన్ని జూమ్ లు వెబ్ లు వచ్చాయి
ప్రపంచ మంతా సెల్ఫోన్ లో అరచేతి లో ఇమిడి అరచేతి వైకుంఠం గా మిగిలింది .మీరు పిల్లని దూరం పంపడం ఇష్టం లేక బెంగుళూర్ ఇచ్చారు..అనీ.అందరూ అన్నారు కారణం వారి పిల్లలు కెనడా లో ఉన్నారు వారికి చేస్తే మంచిదని ఆడపిల్ల మంచిగా ఉంటే విదేశంలో అత్త మామ కూడా వెళ్ళి ఉండి రావచ్చని వారి ఉద్దేశ్యము ఎవరు దగ్గరి వారు చెయ్యమన్నా వాళ్ళు చెయ్యక ఫ్రెండ్ కొడుకని కూతుర్ని ఇండియాలో చేశారు.
తెలివైన పిల్ల ఇండియా లో ఉండిపోయింది దాని తెలివికి కళకు బాగా డబ్బు వస్తుంది పెళ్లికి వచ్చిన వాళ్ళ దీవెనలు ఇలా ఉన్నాయి.
పెళ్లికి వచ్చిన వాళ్ళు విందు తీసుకుని ,దీవించి వెళ్లారు ఎది ఒక వంకర మాట వేస్తారు పెళ్లి వారు బాధ పడేలా ఎదో. అలా కూతురు పెళ్లి చెయ్యడం వాళ్ళు.సెటిల్ అవడం జరిగి పోయింది. ఇద్దరు పిల్లలు హై స్కూల్ చదువు అవుతోంది
ఎదో పండగకు పబ్బానికి వచ్చే తీరిక కూడా లేదు ఇప్పుడు .విలున్న ప్పూడు ఫోన్ చేస్తుంది ఇంకా పుట్టిల్లు ఏమిటి. నీ.అంతా అయ్యాను అని నవ్వుతుంది తల్లి ప్రాణం కనుక పండగలకు కొంత డబ్బు పంపుతుంది కోడలు అనుజ్ఞ ఏమీ మాట్లాడ దు అంతా మి ఇష్టం అంటుంది అల్లుడిని సంగతి చూస్తే దేముడు ఏమి అడగడు ఇచ్చిన మీ అమ్మాయికి ఇవ్వాండి అంటాడు మంచి కుటుంబము ఇలా ఆలోచనలు సాగిపోతున్న రుక్మిణీ. కాఫీ తాగండి అంటూ అనుజ్ఞ వచ్చి పిలిచి కప్పు చేతిలో పెట్టింది ఏమాటకామాటే చెప్పాలి పిల్ల.బుద్ది మంతురాలు. టైమ్ కి ఏర్పాటు చేస్తుంది.నేను సహాయం చేస్తానంటే ఎందుకండీ ఇంతవరకు.ఉద్యోగం చేశారు ఇప్పుడైనా మనమలితో ఆడుకోండి అంటుంది. నా.పద్దతిలో నేను వండు తాను నాకు వంట వచ్చును కదా మీరు హైరానా పడకండి మనింటికి నిత్యము వచ్చి మన బాగోగులు చూసేది వీల్లేకదే అందుకని.మనం వాళ్ళని చూడాలి దశమి కి కొత్త చీర సంక్రాంతి ఒక్ కొత్త చీర పెడుతుంది ఇంక మధ్యలో.పాత చీర లు సరే సరి మనం సంపాదించు కుంటున్నము కదా వాళ్ళని సంతోష పెట్టాలి దానికి ఇద్దురు మగ పిల్లలు స్కూల్ లో చదివిస్తుంది వాళ్ళ ఫీస్లు పుస్తకాలకు కొంత సహాయం చేస్తుంది .
.బట్టలుతికి వచ్చి కాసేపు కూర్చుని వీధి విషయాలు చెపుతుంది.అదోరకంగా మంచిదే అపని ఎక్కువ అనదు ఒకేసారి కోడలికి కూరలు తరిగి ఇస్తుంది ఎప్పుడైనా కురాలివ్వ నా అంటే వద్దు అమ్మ నాకు రొంత్ కూర పెట్టు చాలు మా వాళ్ళకి గొడ్డు కారాలు కావాలి అంటుంది నిజమే కదా మాఇంట్లో అసలు కారం ఉండదు. అంతా చప్పిడి నూనే తక్కువ మరి వాళ్ళ అలవాటు అంతే.
అనుజ్ఞ కూడా అత్తింటి వంటలకు అత్తగారు.పెత్తనానికి అలవాటు పడింది భర్త సాయి ఎవరిని ఏమి అనడు చిన్నన్నవ్వు చిరునవ్వు అతని ఆభరణము ఎంతో మంచి వాడు ఎంతైనా తల్లి లెక్చరర్.పెంపకము . ఎవరి మనసు నొప్పించ కుండా మాట్లాడుతాడు.
పరిశీలిస్తే ఇంటికి అంతా రుక్మిణీ ఆలోచనతోనే జరిపిస్తుంది.మగ వాళ్ళు పెద్ద కలుగ జేసీ కోరు అంతా ఆమెకి సలాం అంటారు.పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు బాధ్యతలు చూస్తున్నప్పుడు
అనవ సరంగా గొడవలు పెట్టు కొ కూడదు రక్త సంబంధీకుల ను చెంద నాడుకుని పై వాళ్ళని గొప్పగా చెప్పడం అనవసరం.అందరూ మాట కలివిడిగా ఉండటం ఇష్టం అందుకే అనుజ్ఞ ఊరు కుంటుంది. అత్తగారు లెక్చరర్ ఎదో ఒకటి చెపుతూనే ఉంటుంది. అమే తరుపు వారు అప్పుడప్పుడు వచ్చి వెడుతుంటారు .పండుగలకు పిలుస్తారు .ఆరోజంతా హడావిడి చేస్తూ అందరిని అలరించిన మాటలు చెపుతూ రుక్మిణీ సంతోషంగా గడుపుతుంది. ఆరోజు ఐదు ఆరువేల ఖర్చు అయినా ఏమి అనదు.అడు ఆవిడకు ఇష్టము మనిషి ఇపుడు యంత్రంలా మారి డబ్బు డబ్బు అంటూ ఇంటి కి వస్తె కాఫీ ఇవ్వడానికి కూడా ఆలోచనే.ఎవరింటికి ఎవరు తిండి లేక రారు అని తెలుసుకోవాలి .ఆహారం అందరికీ పంచడం లో ఆనందం ఉంది అని చెపుతుంది.
సాయి మటుకు నవ్వుతూ మా అమ్మ కాలేజ్ కి వెడితే మామ్మకి నేను మందులు వేసి చూసేవాడిని సెలవలు వస్తె నాకు బామ్మ సేవ వంట దగ్గరకు రానవ్వలేదు.పని అంతా అనుజ్ఞ.చేస్తుంది
ఉదయాన్నే పనిమనిషి కాంతం వచ్చి ముగ్గు వేసి బట్టలు నాన పెట్టకోనీ తడి .బట్టపెట్టి వెళ్లి పోతుంది మళ్లీ పదింటికి వచ్చి టిఫిన్ కాఫీ తాగి బట్ట లుతికీ ఆరవేసి అన్నము కూరలు ఉంటే పట్టుక్డుతుంది పిల్లలున్న ఇల్లు పట్టెడు మెతుకులు మిగిలేల.వండు అని కోడలికి చెపుతుంది చేసిన చెయ్యి కొంచెం రాదు ఎవ్వువే చేయిస్తుంది రెండుచేతులతో సంపాదన మనుషులకి కక్కుర్తి పిశిన గొట్టుదనం లేదు అందుకే రోజు కాంతని కి టిఫిన్ పెడుతుంది ఇడ్లీ అయితే రేకు రేకు లా నాలుగు ఇడ్లీ ఇస్తుంది పెసరట్టు దొసే చపాతీ 2 లేక 3పెడుతుంది పురి అయితే 5లేక6పెడుతుంది.భోజనం టిఫిన్ ఖరీదైన ఈ రోజుల్లో రుక్మిణీ పనిమనిషి లా కాక ఇంటి మనిషిలా చూస్తుంది. కోడలు అనుజ్ఞ కూడా అత్తగారు ఆజ్ఞ దాటాదు.నేటి
Iరోజుల్లో మరి మన పనివాల్లే మనకు ఆప్తులు.ఉదయం లేచిన దగ్గరి నుంచి వాళ్ళు రాక పోతే రోజు గడవదుకొన్నాళ్ళకి .కాలేజ్ లో చేరడం చదువు బిజీ వల్ల ఇంట్లో.అత్తగారికి సేవ సహాయం కోసం ఒక హెల్పెర్ని పెట్టింది.అత్తగారికి సేవ చేస్తూ ఉంటుంది .ఆవిడకి టైమ్ కి మందులు వెయ్యడం మధ్య్యాణం టిఫిన్ జ్యూస్ ఇవ్వడం వంటివి చేస్తుంది. మధ్యాహ్నం టీవీ పెట్టుకుని
కథలు చెప్పుకుంటూ కాలం గడుపుతారు కాలేజ్ నుంచి ఇంటికి వస్తూనే వంట చేసేదే ఈ లోగా అంత ఇల్లు చేరే వారు
ఆ ఇంట్లో పెందరాలే.రాత్రి ఎనిమిది కి భోజనం చేసి రాత్రి పాలు తాగి పడుకునే అలవాటు అందరికీ ఉంది అందరూ కలసి భోజనం చేస్తారు.ఆక లి ఉన్నా సరే లేక పోయినా సరే 7_1/2 కి అన్నీ వండి నవి టేబుల్ మీద సర్దేసి భిజనానికి పిలిచేది అందరూ.వచ్చి బోజనాలు చేసి వెళ్ళు సామాను హెల్పరు చేత సర్దించి వచ్చి ఈటీవీ న్యూస్ టైమ్ కి టీవీ దగ్గరికి రావలసిందే .ఇది రూల్స్.న్యూస్.తరువాత అత్తగారు తను సీరియల్స్ గేమ్ షో లు తప్పక చూసేవాళ్ళు పిల్ల లు మాత్రం చదువు కోవడానికి.వె ళ్లి పోయె వారు. మామగారు బ్యాంక్ వర్క్ చూసుకునే వారు
ఆ పని లేక పోతే తల్లితో కబుర్లు చెపుతూ టీవీ చూసే వారు. ఎది ఏమైనా మా అత్తగారు చాలా తెలివి గల వారు అనుకుంది అనుజ్ఞ. రుక్మిణీ మాత్రం కోడలిని నువ్వు ఇంట్లో ఉంటావు కదాని పనులు పెంచ కూడదు నేను కాలేజ్ కి వెళ్ళాలి కాదని హెల్పెర్ని పెట్టాను.నా మన్మల్ని నేను చూసుకుంటాను ఇంటిపనులు నువ్వు చూసుకో అంటున్నది పిల్లల్ని చక్కగా కాడలు,పద్యాలు చెపుతూ చాలా పద్దతి గా పెంచు తుంది అందుకే అనుజ్ఞ అత్తగారికి పిల్లల బాధ్యత వదిలి ఇంటి భాద్యతలు పెట్టుకుంది ఇంటి ప్రేమలు లేక ఈ నాడు.ఎంతో.మంది వీధి మనుషులను నమ్మి వెరు కాపురాలు పెడుతున్నారు లేదా వృద్ధ ఆశ్రమాల్లో పెడుతున్నారు.
ముఖ్యం గా ఒక్క విషయము ఎందుకంటే బయటి నుంచి వచ్చిన మనిషిని కోడలుగా తెచ్చుకున్న ప్పడు ఆమెను జాగ్రత్తగా ఆమెకు అనుకూలంగా ఇల్లు ఉంచాలి. అనుజ్ఞ పెళ్లి అప్పుడు బంధువులు అత్తగారు ఉద్యోగి కోడల్ని వద్దు అని ముందే చెప్పింది. దీనికి ఇంటిపనులు తప్ప ఇంకేమీ కుదరవు ఆడపిల్ల రెండు పిజిలూ చేయించారు .మంచి న్యూస్ రీడర్ గా ఉంది అన్ని మనెయ్య మన్నా రు . అందుకు పెద్దవాళ్ళు వప్పుకున్న రు తల్లి తండ్రులు మించి వెల్ విషేర్స్ ఉండరు కదా అందుకే.అనుజ్ఞ వప్పుకుందు పెళ్లి కి వచ్చిన పెద్దలు ఇంత చదువు కున్న పిల్ల ఇంటిపట్టున ఉంటుందా అని ప్రశ్న వేశారు. మగ పెళ్ళి వారు తరుపు వారు మా రుక్మిణికి కోడలు వచ్చింది ఇంకా అంతా సుఖమే అత్తగారు ఇంకా సుఖ పదటమే అనేవారు . ఆ చదువుకున్నా పిల్ల ఇది చెప్పినట్లు ఇంటి పట్టున ఉంటుందా..ఏమిటి అని వ్యంగంగా.అన్నారు.
ఏమిటి పెళ్లి కి పిలిస్తే వచ్చి అక్కడే రక రకాల విమర్శలు. చదువుకున్న మనుషులు కూడా ఇలా ప్రవర్తి స్తే ఎలా . తను లెక్చరర్ చేసింది అమ్మాయిల గురించి బాగా తెలుసు. ఏ పిల్లలు ఎలా ఉంటారు అని తెలుసు చదువు మనిషి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి కానీ .అత్త ఇంట గొడవలకి కాదు. చాలా చక్కని సమాధానం అందరికీ విచిత్రంగా అనిపించింది
చాలా తెలివి అయిన అనుజ్ఞ అత్తగారు .ఎలా చెపితే అలా విని అత్తింటి విషయాలు అవగాహన చేసుకుంది ఈనాడు కూడా పెళ్లి అనగానే బంధువులు ఎన్నో ప్రశ్నలు వేస్తారు ఎలా వంకలు పెళ్లి తరువాత అంటూ అయోమయం లో పెడతారు వాళ్లకి తెలిసినట్టు వాళ్ళ మీకు వాళ్ళ గురించి అన్ని తెలుసు కున్నారా.పిల్ల చదువు కున్నదీ పెళ్లి కొడుకు దొరికాడు కదా అని ముందే అన్ని ఇవ్వకండి ఆస్తులు అవి నాలుగేళ్లు చూసి మంచి చెడూ తెలుసుకుని పెట్టండి పెళ్లి నాడే సారి చీర పెట్టేసి దులుపు కో కండి ఏడాదికి పురిటి వస్తుంది ఇద్దరు బిడ్డలు పుట్టక అన్ని ఇచ్చి పంపండి అత్తగారు అసలే లెక్చరర్ .ఆవిడకి మాట చెల్లాలిలేక పోతే ఊరుకోదు అంటూ కుదిరిన పెళ్లికి వంకలు పెట్టీ అయోమయం లో పెట్టే బంధువులు ఎందరో ఉన్నారు బంధువుల మాటలు విని నవ్వుకుంది ఏమిటో ఈ పిల్లకి ఇలా పెళ్లి చేస్తున్నారు..అవసరమా హాయిగా మంచి ఉద్యోగంలో.పెడితే మంచిది .పెళ్లి అప్పుడే చేస్తున్నారని ఇంకొకళ్ళు. తల్లి తండ్రుల పెత్తనం ఇలా ఉంటుంది హాయిగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇంకా మంచిది
అని మరొకరు ఇలా మనుషుల. ఈ ర్థ్య బయట పెడుతున్నారు. ఉద్యోగస్తుల కోడలు అవుతూ న్నావు నీ ఆడబడు చు గొప్ప సంగీత విద్వాంసురాలు అంటూ.వెటకారం గా కొందరు మాట్లాడారు భయ పెట్టారు అనుజ్ఞ మాత్రం మనుషుల.స్వభావం అర్థం చేసుకుంది..
నా ఇల్లు నా మనుషులు వారికి తగినట్టు జీవించడం లో తప్పేమిటి అన్నది.. పెళ్లి కావడం ఆత్తి ఇంట పది యేళ్లు గడిచింది ఇద్దురు పిల్లల తల్లి అయ్యింది ఏ ఇబ్బందీ లేదు తను అడగ కుండానే అన్ని తెచ్చి ఇంట్లో పెడతారు మరి అత్తగారు తన భర్త శ్యామ్ నీ చక్కగా పెంచింది .అదే పద్ధతిలో మనునల్ని పెంచు తుంది
కుటుంబాల్లో గొడవలు తేవాలని చాలా మంది ప్రయత్నిస్తారు కొందరు పెళ్లికి వచ్చి పెళ్ళిలోనే గొడవ పెడతారు
టిఫిన్ బాగాలేదు వంట బాగాలేదు మా ఇంట్లో ఎంతో బాగా చేస్తాము.
మీరు ఏమి బాగా అరెంజి మెంట్ లు బాగా చెయ్యలేదు.అంటూ విమర్శిస్తుంటారు.
వీలయితే రెండు జీవితాల్ని కలపాలి కానీ అక్కర్లేని గొడవలు తేకుడదు అని ఎప్పుడు అనుజ్ఞ తల్లి చెప్పింది
నిజమే వీళ్ళ మాటలు కాదు
ఎవరి అనుభవం. వాళ్ళు తెలుసు కోవాలి.అనుకుంది
జీవితం లో పెళ్లి ఒక మలుపు మనకు మంచి చెప్పే వాళ్ళు తక్కువ విమర్శించే వారు ఎక్కువ.ఒక్ ఆడపిల్ల జీవితం
అత్తింటి లో ఉండాలంటే ఎన్నో
అడ్డంకులు అవి భార్య భర్త మధ్య కాక ఎదురింటి పక్కింటి వారు వేరే బంధువులు తోడి కోడళ్ళ వల్ల వస్తాయి
కొందరు ఇళ్లలో వంట వాళ్ళు పని వాళ్ళు పెత్తనం చేస్తారు.
ఎన్ని రకాల సమస్య లేదుర్కొని.ఆడపిల్ల అత్తింటి మెలగ డానికి ఎన్నో అవాంతరాలు.ఎగురుకోవాలి.
అనుజ్ఞ లాగ ఎందరో చదువుకున్న ఆడపిల్లలు
నేటికీ రేపటికి ఎప్పటికీ ఆనాటి ముత్తమ్మల తరం నుంచి భావి తరాల వరకు ఎదుర్కొంటున్న.సమస్యలు ఒక్కటే కానీ వాని రూపాలు వేరు. అనుజ్ఞ కథ నిలా ముగించి పేజీలు లెక్క పెట్టే
పిన్ వేసి కవెర్ లో పెట్టీ గమే చేసి అడ్రెస్స్ రాసి టేబుల్ పై పెట్టింది .సహనము శాంతము సౌశీల్యం నెమ్మది తనం వల్లే ఆడపిల్లకు కుటుంబం నిల బెడు తోంధ్ అంటే అతిశయోక్తి కాదు కదా.మీరు ఆలోచించండి.
***
