దూరం ఉంటే మంచిది

దూరం ఉంటే మంచిది

రచన: కమల ముక్కు

మాటల్లోని ప్రేమ
మనసులో ఉండదు/

మనసులో ఉండేదొకటి
బయటకు మాట్లాడేదొకటి/

ప్రేమగా మాట్లాడే మాట వెనుక
జీవితాలను నాశనం చేసే
విషపు ఆలోచనలు/

నవ్వుతూ మాట్లాడుతూనే
వెనుక గోతులు తవ్వే రకం/

తీపి మాటలు వెనుక
విషపుటాలోచనలు ఎన్నో/

నీ సంతోషాలను చూసి
ఓర్వలేని తనమో
నీ అభివృద్ధి ని చూసి
కుల్లుకోవడమో
నీ వెనుక ఉన్నది లేనట్టుగా
ప్రచారాలు/

గోరంతలు కొండంతలు చేసి
ప్రపంచానికి చూపించండం/

నీతోనే ఉండేవారిలో
నీవారనుకునే వారిలో
నీ సొంతం అనుకునే వారిలో
మంచివారని ముసుగు ధరించిన
ఇలాంటి వారు ఎందరో/

వారెవరో తెలుసుకుని
దూరంగా జరిగితేనే మంచిది
లేకుంటే జీవితం
సమస్యల వలయంలో
చిక్కటం ఖాయం/

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!