అంతుచిక్కని ప్రశ్నలేనా?

అంతుచిక్కని ప్రశ్నలేనా?

రచన: జయ

అలసిసొలసి రోధిస్తున్న మదికి
ఎన్నేళ్ళు అని కన్నీటితో పన్నిటి స్నానాలు చేయించగలను.
ఎన్నాళ్లు తడి ఆరని కన్నులకు నా సహనాన్ని బాసటగా గా నిలపగలను.
ఎప్పటికి భారమైన గుండె అడిగే ప్రేమ అనే తోడును ఇవ్వగలను.
అది అందని జాబిలి రూపమని అని చెప్పనా!
ఎలా వచ్చి చేరిందో కానీ
ఆశ అనే పాశాన్ని వేసి,మరువలేని బంధం తో బంధించి.
సుడి గాలిలా వచ్చి సుడి గుండంలో నెట్టిపోయింది అని చెప్పనా!

భరించలేని బాధ లోకాన్ని మొత్తమ్ చీకటిగా మలిచి నను జయిస్తే
మళ్ళీ నేనె గెలిచాను అని విర్రవీగుతుంటే..
ఎన్ని సార్లు ఓడిపోవాలి.
ఎన్నిసార్లు చచ్చిపోవాలి.
మనిషికి ఒక్కసారే గా మరణం.
మరి మనస్సు?
తెలియని,తేలని ,ముడివీడని చిక్కు ప్రశ్నలేనా ప్రతిసారి.!
ఒంటరి శిల లా ఉన్న నన్ను
శిల్పం గా మలిచి మొహాల చితిపేర్చిపోయావే!
ఎలా భరించాలి మళ్ళీ మళ్ళీ అదే గాయం
పదే పదే గుచ్చి గుచ్చి వేధిస్తుంటే
దహనం అవుతున్న మది తో పాటు దేహాన్ని కూడా దహించేయలని ఉంది.
కానీ చచ్చే అంత పిరికిదాన్ని కాదే!
అలా అని అన్ని భరించి భరించి ఓర్పు,సహనం సన్నగిల్లింది.
ఎన్ని సార్లు పడిలేచే కెరటం లా ఎగేసి ఎగేసి పడను.
పడిలేస్తున్న ప్రతిసారి తేనె పూసిన చురకత్తుల లాంటి మాటలు హృదయాన్ని తూట్లు పోడుస్తుంటే.
ఓదార్చే మనసు లేక ఓపిక పడుతూనే ఉన్నా.
ఒకసారి నన్ను మీ విషపు ఖైదు నుంచి వదిలి చూడండి నేను ఏమిటో మీకు తెలుస్తుంది అని అడగాలని ఉంది.!
ఒకసారి నా ప్రేమను స్వీకరించి చూడండి అసలైన ప్రేమంటే ఏమిటో,ఎలా ఉంటుందో రుచి చూపించాలని ఉంది.!
మీరు చిటికెడు అంత ప్రేమ ఇవ్వండి. మీకు ఆకాశమంత ప్రేమను తిరిగి ఇస్తా అని చెప్పాలని ఉంది.!
చూసి చూసి వెతికి వెతికి అలిసిన మనస్సుకు శాంతి ఎప్పుడో విశ్రాంతి ఎప్పుడో ఓపిక ఉన్నన్నాళ్లు వేచిచూడాల్సిందేనా.!

You May Also Like

One thought on “అంతుచిక్కని ప్రశ్నలేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!