మధ్యతరగతి బ్రతుకులు

(అంశం:”అగమ్యగోచరం”)  

మధ్యతరగతి బ్రతుకులు

రచన :: శ్రీదేవి అన్నదాసు

రెక్కాడితేనే గానీ డొక్కాడని బ్రతుకులు
రెక్కలు వచ్చి ఎగురుతున్నాయి నిత్యావసర వస్తువులు
అందుకోలేక అవస్థలు పడుతున్న మధ్యతరగతి బ్రతుకులు
ఎన్ని తిప్పలు పడి కష్ట పడుతున్నా తప్పని ఉపవాసాలు
ఇవి చాలవన్నట్లు బాదుతున్న ఇంటి బాడుగలు
పెరిగి పెరిగి షాకిస్తున్న కరెంటు బిల్లులు

ఇంకెట్టా సాగెను బిడ్డల చదువులు
అనారోగ్యమొస్తే ఇక సంగతి అథోగతి పాలు
అర్థం కావడం లేదు చేసామా మేమైనా పాపాలు
వాటికి అనుభవించవలసినవా ఈ శాపాలు
మునుముందు ఇంకేమి ఎదురౌనో బాధలు
అర్థం కాని అగమ్యగోచరపు జీవితాలు

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!