హరివిల్లు

(అంశం:”అగమ్యగోచరం”) 

హరివిల్లు

రచన :: మక్కువ. అరుణకుమారి

గమనమే తప్ప గమ్యమెరుగని
జీవన గమనాన ఓ వేకువ పల్లవించింది.
ఉరకలు వేసే ఉత్సాహపు వెల్లువయ్యింది.
యదలోయల్లో సడిసేయక నిదురించే
కలల విహంగాలను తట్టి లేపింది.
ఆశలు చిరురెక్కలు తొడిగి
గగన విహారాలు చేయించింది
వికసిత కలల కుసుమాలకు
పంచవన్నెల సొబగులద్దంది.
“కళ*లద్దుకున్న కలల కాన్వాసుపై
సప్తవర్ణాల హరివిల్లులు విరిపించింది
విరిసిత ఆ చిత్రాన్ని యదముంగిట్లో పరచుకునేలోపు
కరిమబ్బుల్లో దోగాడుతూ
అందని తీరాలకు ఎగబాకుతూ
అగమ్యగోచరమై వేదనలపాల్జేస్తుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!