అందమైన ప్రపంచం

అందమైన ప్రపంచం

రచన: పద్మజ రామకృష్ణ.పి

అందరు ఆడపిల్లలు లాగే తన వివాహ బంధం గురించి ఎన్నో కలలు కనింది దివ్య… మంచి భర్త రావాలి. నా మనసు తెలిసి నడిచే వాడు కావాలి. ఎలాంటి వ్యాసనాలు ఉండకూడదు. ముఖ్యంగా మద్యం. సిగరెట్ లాంటివి అసలు ఉండకూడదు. తన మనసులో భార్యగా నాకు తప్ప ఎవ్వరికీ చోటు ఉండకూడదు. ఆస్తులు అవసరం లేదు కాని మంచి గుణగణాలు మాత్రమే ఉంటే చాలు.. ఇలా ఎన్నో ఆశల సౌధాలు కట్టుకుంది  దివ్య…

కలలు కన్న రోజులు రానే వచ్చాయి… ఇరుపెద్దలు చక్కగా సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు…

తనకు భర్త పట్ల ఉన్న సందేహాలు వ్యక్తం చెయ్యాలి అని తలచిన దివ్య భర్తతో మాటలు కలిపింది…

మొదటిగా దివ్య భర్తని అడిగింది.. మీకు మందు తాగే అలవాటు ఉందా.?అని..

అబ్బే అలాంటి అలవాటు అసలు లేదు. కాకపోతే మా ఆఫీస్ తరపున ఎప్పుడైనా పార్టీ జరిగితే.. అది కూడా రెండు.మూడు నెలలకు ఓ సారి లైట్ చిప్ అంతే. అది కూడా నలుగురిలో బాగోదు అని టచ్ చేస్తా. అన్నాడు దివ్య భర్త…

అయితే అలవాటు ఉందా.? అని ఆశ్చర్యపోయింది దివ్య..

లేదు తల్లో. నాకు ఆ వాసన అసలు పడదు.. పొరపాటుగా మందు చిప్ చేయవలసి వస్తే ఇంటికి రాగానే బ్రెష్ చేస్తా. అన్నాడు కంగారుగా దివ్య భర్త…

సరే అది వదిలెయ్యండి. నాకు మీరు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. నేను కూడా మీతో ఎప్పుడూ అబద్ధాలు చెప్పను. నాకు లైఫ్ పట్ల క్లారిటీ గా ఉండడం అంటే చాలా ఇష్టం అంది.దివ్య…

నాక్కూడా అన్నాడు మరల దివ్య భర్త…

వాళ్ళ సంసారం ఇలా సంతోషంగా సాగిపోతుంది..
ఓ రోజు.న్యూయర్ సెలబ్రేషన్స్ అంటూ ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళాడు.దివ్య భర్త. దివ్యని…

అక్కడ మాటల మధ్యలో భర్త ఫ్రెండ్ భార్య చెప్పిన మాటలకు దివ్యకి గుండె జారిపోయింది…

పార్టీ నుండి ఇంటికి వచ్చేసాక కూడా అవే మాటలు దివ్య చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి..

మీ వారు మందు పూర్తిగా మానేసారా.? ఫుల్ డ్రింక్కర్ కదా అందుకే అడిగా.. అయినా ఆ పిల్ల అలా మోసం చేసింది కాబట్టి ఇలా అయిపోయాడు. నిన్నే ఇంతలా చూస్తున్నాడు అంటే మనసిచ్చిన ఆ పిల్ల భార్యగా వస్తే ఇంకెంతగా చూసేవాడో కదా.అని దివ్య చెవిలో బాబ్ పేల్చిన మాటలు….

అవును నిజమే దివ్య భర్తకు బంధం పట్ల నిజాయితీ లేదు.. దివ్యని మభ్యపెడుతూ ఆఫీస్ మీటింగ్స్ అని చెప్పి తాగుతూ. మద్యం అలవాటు కు బానిసై పదేపదే అబద్ధాలు చెబుతూ. మానలేని మద్యం మత్తులో ప్రేమించిన మనిషి దక్కలేదని. ఆ అక్కసుతో భార్య పై మాటల యుద్ధం చేస్తూ.ప్రేమించిన మనిషికి మనసులో గుడి కట్టి పూజిస్తూ.. భార్యకు మాత్రం అవకాశం దొరికిన ప్రతిసారి అవమానాలను బహుమతిగా అందచేస్తున్నాడు…

గుండెలపై తాళి ఎగతాళి గా మారిందా.? ఆయన కట్టిన తాళి నా హృదయాన్ని తాకుతుంటే. ఆయన హృదయ స్పందన మాత్రం నేను కాదు. తన మనసు గుడిలో దేవతగా ఆరాధించే ఆమె ఎంతటి అదృష్టాన్ని దక్కించుకుంది.. నా ఆశల సౌధం బీటలు పడ్డాయి.. అని లోలోపలే కుళ్ళికుళ్ళి ఏడ్చింది.దివ్య…

కొన్ని నిద్ర లేని రాత్రులు. మరి కొన్ని తిండి తినని రోజులు గడిచాయి దివ్యకు…

రాను రానూ భర్తకు తనపై ఉన్న నిర్లక్ష్యం తో విసుగు చెంది. తనువు చాలించే ప్రయత్నం చేసింది. దివ్య…

ఎన్ని జరిగినా.ఏమి జరిగినా స్పందన లేదు భర్త లో… కానరాని ప్రేయసి ఆరాధన లో మునిగితేలుతున్నాడు దివ్య భర్త… నారాత ఇంతే అని సరిపెట్టుకోవాలా.?లేక. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది దివ్య….

మనసుతో ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంది దివ్య…

ప్రతి ఆడపిల్ల కలలు అందంగా పండాలని ఏమి లేదు. ఏది ఉండకూడదు అని నేను కలలు కన్నానో అవి ఎప్పటికీ జరగని పగటి కలలే అని చేరిపేస్తున్నాను… మనసా వాచా కర్మణా వారే నా ప్రియమైన బంధము. నా భర్త… ఏ విషయం అయితే నన్ను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తుందో ఆ విషయాన్ని అసలు తలవనూ.. చివరి మజిలీ వరకు నాకు తోడూ.నీడా వారే.అందుకే.నా ఆశల సౌధానికి. మౌన భాషను పరిచయం చేస్తా..అనుకుంటూ.
భర్త మనసులో స్థానం లేదు అని తెలిసినా తన సర్వం భర్త తప్ప.ఏ ఆలోచన లేకుండా. కొండంత ప్రేమను భర్త పట్ల చూపుతుంది దివ్య… భర్త మాత్రం.దేవతగా పూజించి మరో ఆడదానికి హృదయంలో కోవెల కట్టాడు…

భర్తను దేవుడిగా ఆరాధిస్తూ.ఎప్పటికీ మార్పు రాని భర్త ప్రవర్తనను భరిస్తూ.భార్య అనే స్థానానికి ఆదర్శంగా నిలిచింది దివ్య.

భర్తకు భార్య కాకుండా ఎన్నో అందమైన ప్రపంచాలు ఉండొచ్చు..కాని.భార్యకు మాత్రం భర్త మాత్రమే అందమైన ప్రపంచం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!