ఆశ-నిరాశ

అంశం: చీకటి వెలుగులు

ఆశ-నిరాశ

రచన: ఐశ్వర్య రెడ్డి గంట

చీకటి వెలుగుల జీవితం
అంతులేని సమస్యల వలయం
అణుచుకోలేని ఆశల సమరం
రేపటి వెలుగు కోసం నిరాశ నిస్పృహ లతో పోరాటం..
చుట్టూ చీకట్లు అలముకున్న వేళ
మినుకు మినుకు మంటూ వెలిగే ఆశాదీపం,
ఎంత చేరుకోవాలని అనుకున్నా
అందకుండా పరిగెడుతున్న నా వెలుగు కిరణం,
నిరాశా నిస్పృహల్లో అలసిన నేను
ఎంతో చేరాలని చూస్తున్నా
అందుకోలేని తరుణం,
విజయాన్ని చేరేది ఎన్నడోనని వగచి వగచి ఓర్పుతో వేచి ఉన్నా,
మళ్లీ  ఉత్సాహంతో ఊపందుకొని పరిగెడుతున్న ,
వెలుగురేఖ కనిపించి నన్ను కవ్వించింది
నాలో ఆశలు చిగురించి
సంతోషంతో రెట్టింపు వేగంతో వెళ్లి వెలుగును అందుకున్న
పట్టుకుని ఆర్తీగా హత్తుకున్న
చీకటి తర్వాత వెలుగు తప్పదని తెలుసుకున్న
వెలుగు తర్వాత చీకటిని తీసుకోవడానికి సిద్ధంగున్నా..

You May Also Like

One thought on “ఆశ-నిరాశ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!