దట్టమైన అడవి  

దట్టమైన అడవి  

రచన: సుజాత 

దట్టమైన అడవి  అంతా చిమ్మని చీకటి ఎటువైపు చూసినా చీకటిగానే ఉంది నా కళ్ళు అసలు కనిపించడం లేదు.ఎవొ వింతైన శబ్దాలు పక్షుల అరుపులు జంతువుల గాండ్రింపులు  ఎవరో నన్ను వెనుక నుండి  తరుము తున్నట్టుగ కాళ్ల శబ్దాలు  విపరీతమైన గాలి  అంతా అయోమయంగా ఉంది చాల భయం వెస్తుంది.

ఎదైన పట్టుకుని నిలబడదాం అన్న ఎమి కనిపించడం
లేదు ఆ అడుగుల శబ్ధం  దగ్గరగా వినిపిస్తున్నాయి
కాళ్ళుచేతులు వనుకుతున్నాయి.గుండె అదురుతుంది.నేను ఎక్కడ ఉన్నాను నన్ను ఎందుకు తరుము తున్నారు ఏమీ  అర్థం కావడం లేదు నేను అలా పరిగెడుతూనే ఉన్నాను  అలా ఎంతదూరం పరిగెడుతున్నానో నాకే  తెలియడం లేదు కాళ్ళు పీకుతున్నాయ్  వొళ్లంతా చెమటలు  పట్టెేస్తున్నాయి.

ఎవరొో నా గొంతు పట్టుకున్నట్టుగా అయింది. అరవబోయాను కానీ గొంతు పెగలలేదు  విడిపించుకోడానికి పెనుగులాడుతున్నాను అతని బలం ముందు నా బలం ఎంత  దేవుడా నాకు ఇదెేమి  పరీక్ష  ధైర్యం కూడగట్టుకొని  ఎవరు మీరు నన్నెందుకు
తరుముతున్నారు.అని అరిచాను  అయినా సమాధానం లేదు  రెండు నిమిషాల తర్వాత  ఆహా ఆహాహా అని  గట్టిగా నవ్వు వినబడింది  ఇంక నా  ప్రాణం మీద ఆశ వదులుకున్నాను.

ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు మీకేం కావాలన్నా ఇస్తాను నన్ను వదలండి ప్లీజ్ దీనంగా అడిగాను ఎదొ తెలియని భాషలో మాట్లాడుతున్నారు నన్ను గట్టిగా పట్టుకుని లాక్కెళ్తున్నారు  అల్లంత దూరాన మిణుకు మిణుకు మంటూ వెలుతురు కనబడింది అక్కడెవరున్నారు నన్నెందుకు లాక్కెళ్తున్నారు నాకేవరు శత్రువులున్నారు.నన్ను అక్కడికి  తీసుకు వెళ్లి చెట్టు కట్టెశారు.కొద్దిగా మసకగా కన్పిస్తున్నారు

నల్లగా  దృడంగా ఉన్నారు ఒంటినిండా నూనె మెడలో రంగురంగుల పూసల దండలు చేతులలో భళ్ళుకాలు  ఒంటిపై జానేడు పంచే నల్లజాతి మనుషుల్లా ఉన్నారు కాగడాలతో కొంతమంది వాళ్ళ భాషలో అరుస్తూ  ఇటువైపే వస్తున్నారు.ఆ కాగడాల వెలుతురులో అందరు స్పష్టంగా కనబడుతున్నారు.ఆడవాళ్లు  విచిత్రమైన వేషధారణలో ఉన్నారు శరీరానికి జాకెట్లు లేవు ఆ చీరతోనే చక్కగా చుట్టుకున్నారు. మేడలో రింగుల్లా తెల్లటి కడియాలు చేతుల నిండా అవెే తెల్లటి కడియాలు మోచేతుల వరకూ  ఉన్నాయి .

వింత శబ్దాలు చేస్తున్నారు అందులో ఒక అమ్మాయి అబ్బాయి ముందుకొచ్చారు  వాళ్ల పెళ్లి దుస్తుల్లో వున్నారు  బాసింగాలకు బదులు చెట్ల నారతోనెే బాసింగాలు కట్టుకున్నారు ఒంటినిండా పెళ్లి కూతురికి పసుపు పట్టించారు సంతోషంగా అందరూ డ్యాన్సలు చేస్తున్నారు.అదొక వింత ప్రపంచంలా వుంది  ఏవో మంత్రాలలాగా విన్పిస్తున్నాయి అందరూ పూలు జల్లుతున్నారు పిచ్చిపిచ్చిగా డ్యాన్స్ లు చేస్తున్నారు   ఓ వింతైన మనిషి బాగ తాగి తూలుకుంటూ దగ్గరగా వచ్చాడు నాకు చాలా భయం వేసింది అతని వెనకాలే ఓ ఆడమనిషి కూడా వచ్చింది వల్ల భాషలోనే ఆమెతో ఏదో అంటున్నాడు  ఏం కూన నన్ను మనువు  ఆడుతావ అంటూ నాపై పైకి వస్తున్నాడు

ఆడమనిషి అతన్ని దూరంగా నెట్టుతూ తీసుకు   వెళ్తుంది  అయినా వినకుండా నాపై పైకి వస్తున్నాడు నేనేంటి  మనువు  అనడమేంటి నేను వీళ్ల చేతుల్లోకి ఎలా చిక్కుకున్నాను  అనుకుంది మనసులో నన్ను చేసుకో అంటూ బెదిరిస్తున్నాడు  నేను చేసుకోను నన్ను వదలండి నన్నెందుకు తీసుకొచ్చారు రంటూ అరుస్తున్నాను అయినా నా మాట ఎవరూ వినడం లేదు నాకంతా అయోమయంగా వుంది ఆ ఆడమనిషి అతన్ని బలవంతంగా తీసుకువెళ్ళింది.

మనోజ్  నీ వెక్కడున్నావు నన్నెందుకు  ఒంటరిగా విడిచిపెట్టి  వెళ్లావు ఏడ్చాను నా ఏడుపు ఎవరు పట్టించుకోవడం లేదు ఏడవడానికి  ఓపిక కూడా లేదు  చాలా ఆకలిగా వుంది.వాళ్లందరూ విందు భోజనం తింటున్నారు  వాళ్ళు తినడం చూస్తుంటే నాకు  వాంతి వచ్చినట్టుగా ఉంది.ఒకావిడ మట్టిపాత్రలో నాకు అన్నం పట్టుకొచ్చింది వాళ్లు  పచ్చిమాంసమే తింటున్నారు.

ఆది చూస్తుంటే  నాకు  ఓకారంగా అనిపిస్తోంది  అదే నాకు తెచ్చిపెట్టారు  నేను తినను అన్నాను  నా పిల్లలు నా భర్త ఏం కావాలి  నన్నెందుకు బంధించారు ఇక్కడ నేను ఎన్ని రోజులుండాలి అంతా   భయంగా ఉంది  నా కుటుంబాన్ని తలుచుకుంటే చాలా ఏడుపు వస్తుంది.

తిను కూన  తినకుంటే ఆకలిగ ఉంటది కూన
వచ్చీరాని తెలుగులో మాట్లాడిoది నేను తినను ప్లీజ్ నన్ను వదిలిపెట్టవా నీకు పుణ్యం వుంటుంది మీకు దండం పెడతానమ్మ  అంటూ బతిమిలాడింది  సరే సరే అంటూ చేత్తో  సైగ చేసింది.మళ్ళి  అతను  నా వైపు వస్తూ నా గొంతు నా పట్టుకున్నాడు ఊపిరి ఆడక లబోదిబోమంటూ మొత్తుకున్నాను ఏమండీ మనోజ్ మనోజ్ అంటూ  అరుస్తున్నాను  కళ్లు తెరిచి చూశాను అందరూ నా చుట్టూ ఉన్నారు    ఏమైంది ఏమైంది అని మనోజ్ కంగారుగా అడుగుతున్నాడు  ఏంటి నేనిక్కడున్నాను అయోమయంగా అడిగింది లావణ్య  ఎక్కడ ఉండటమేంటి నీ బెడ్మీదనే ఉన్నావు ఒక్కటే కలవరిస్తూన్నావు ఎంత పిలిచినా పలకడం లేదు అన్నాడు మనోజ్ పిల్లలు  అవునా ఇదంతా కళనా అంది లావణ్య ఆశ్చర్యంగా  మేమంతా చాలా హడలిపోయాము మమ్మి అన్నారు.పిల్లలు ఇద్దరిని
దగ్గరగా తీసుకుని గుండెకు అదుముకుంది.ప్రేమగా
లావణ్య.అమ్మయ్య ఇదంతా కళనెే అనుకుంది మనసులో  నన్ను ఎంత అయోమయం చేసింది అనుకుంది నవ్వుతూ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!