ఓ అమ్మాయి

ఓ అమ్మాయి

రచన::ఐశ్వర్య రెడ్డి గంట

జనవరి ఒకటో తారీకు
ఆ రోజు దివ్య వాళ్ళ అమ్మతో అమ్మ నేను స్కూల్ కి వెళ్తాను
మా ఫ్రెండ్స్ అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చివస్తాను అమ్మ ప్లీజ్ అంది

సరే జాగ్రత్తగా వెళ్లి రా అని చెప్పింది దివ్య తల్లి
చాలా సంతోషంగా బయలుదేరి గ్రీటింగ్ కార్డ్ లు అందరికి ఇవ్వాలని దారిలో కొన్ని కోని చేతిలో పట్టుకొని వెళ్ళింది స్కూల్కి

అక్కడికి వెళ్లేసరికి కొంతమంది పిల్లలు అటు ఇటు తిరుగుతూ కనిపించారు,  కనిపించిన పిల్లలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక్కో గ్రీటింగ్ కార్డు ఒక్కొక్కరికి ఇచ్చింది, వాళ్ళు ఇచ్చినవి తీసుకుంది . కొద్ది సేపు పిల్లలు ఆటపాటలతో సంతోషముగా సమయం గడిపారు

అప్పుడే ఒక అబ్బాయి రంజిత్ చాలా సేపటి నుంచి దివ్యని చూస్తూ తనకు ఎలా గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలా అని ఆలోచిస్తూన్నాడు.ఎందుకంటే రంజిత్ దివ్య ను ప్రేమిస్తున్నాడు
అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చి రంజిత్

దివ్య దగ్గరకు వెళ్లి మన ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడే వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లారు, గ్రీటింగ్స చెప్పడానికి మన స్కూల్ దగ్గర నేలను వాళ్ళ ఇల్లు నేను వాళ్లందర్నీ తీసుకొని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు    ,,,,నా గ్రీటింగ్ కార్డ్స్ కూడా పట్టుకోవా, నేను వాళ్లని తీసుకొస్తాను.
అందరం కలిసి క్లాస్ లో కూర్చొని ఎంజాయ్ చేద్దాము, అని చెప్పి దివ్య కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన దగ్గర   ఉన్న  గ్రీటింగ్ కార్డ్స్ అన్ని దివ్య చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు .

దివ్య తోమ్మిదో తరగతి చదువుతుంది ఆ తరగతి పిల్లలు కొంతమంది కనిపిస్తే వాళ్లతో పాటు
కాసేపు అక్కడ కూర్చొని ………ఇంకా అందరూ
వెళ్ళిపోతుంటే

దివ్య కూడా ఇంటికి వెళ్లడానికి చూస్తూంది కానీ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చిన రంజిత్ మాత్రం ఇంకా రాలేదు,,

సరే అని అవి కూడా తీసుకొని దివ్య వాళ్ళ
ఇంటికి వెళ్ళిపోయింది.

దివ్య ఇంటికి వెళ్లగానే వాళ్ళ అమ్మ అన్నం పెట్టింది
దివ్య అన్నం తింటుంటే వాళ్ళ చెల్లెలు పది ఏళ్ల హరిక అక్క అక్క నీ దగ్గర చాలా గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి ,,,,

ఇవన్నీ నీకే నా అక్క,
అమ్మొ! ???నిజంగా నువ్వు చాలా గ్రేట్ అక్క నీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారో ,,,,,, నాకు ఎవరు లేరు నాకసలు కార్డ్ లు రాలేదు నీవన్ని నేను తీసుకుంటాను అని
దివ్య మంచి ఆకలి మీద ఉండి హరిక చెప్పిందేమి పెద్దగా పట్టించుకోలేదు, ఎప్పుడు ఏదోకటి వాగటం దానికి అలవాటే కదా అనుకుంది

అన్ని గ్రీటింగ్ కార్డ్స్ ముందేసుకుని చూడడం మొదలు పెట్టింది,,,అన్ని గ్రీటింగ్ కార్డ్స్ కలిపి
దాదాపు ఒక   వంద  పైనే ఉంటాయి
టు ……దివ్య…..దివ్య…..దివ్య అని ఇచ్చిన వారి పేరు దగ్గర రంజిత్ పేరు ఉంది ఆ అమ్మాయికి 100 గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చాడు రంజిత్ అన్నమాట !!!!!!!!ఒక ఎనిమిది వేరేపేర్లతో ఉన్నాయి
ఇంట్లోనే   ఉన్న వాళ్ళ నాన్నగారు ఆ విషయం విని ఆ గ్రీటింగ్ కార్డ్స్ అన్ని చెక్ చేసి కోపంతో ఆ అమ్మాయిని కొట్టడం మొదలు పెట్టాడు——

దివ్య నాకేం తెలియదు డాడీ పట్టుకోమని చెప్పితే పట్టుకున్నాను    అతను మా క్లాస్ అబ్బాయే తెలిసిన అబ్బాయి కదా అని తీసుకున్నాను అంతే తప్ప నా తప్పేం లేదు అని అంది వాళ్ళ డాడీ తో ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ….. .వాళ్ల డాడీ మాత్రం
నీకు తెలియకుండానే తీసుకున్నావా ఇన్ని గ్రీటింగ్ కార్డ్స్,
నీ తప్పేం లేకపోతే అతనెలా ఇస్తాడు అంటూ చాలా కొట్టాడు  ఆ అమ్మాయి బాగా ఏడ్చి ఏడ్చి అలాగే కూర్చుండిపోయింది

సాయంత్రం వరకు వాళ్ళ అమ్మానాన్న దివ్య నీ నానా మాటలు తిట్టి
ఇలా చేస్తే చదువు  మాన్పించేసి నీకు పెళ్లి చేసేస్తాం తొందర్లోనే ………. తోమ్మిదో తరగతి లోనే ఇలా చేస్తున్నావ్, ఒక్కొక్క రు ఎలా వున్నారు, ఎంత బాగా చదువు తున్నారు
నువ్వేందుకు ఇలా తయారయ్యావు . అనేసి ఏవో ఏవో మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు!!!!!!!!!!!!!

చాలా ఏడ్చింది  దివ్య మనసు బాగా గాయపడింది

అందరూ పడుకున్న తర్వాత రాత్రి పూట ఆ అమ్మాయి ఉరేసుకుని చనిపోయింది…… తన మనసులో ఒకటే ఆలోచన నా తల్లిదండ్రులకు

నా మీద ఉన్న నమ్మకం ఇంతేనా వాళ్ల రక్తాన్ని వాళ్లు నమ్మకపోతే నేను ఎక్కడికి పోయేది ఎవరు ఎన్ని చెప్పినా గుండె గూటిలో దాచుకునే తల్లిదండ్రులే ఇలా నన్ను మాటలతో ఏకరువు పెడితే నేను ఎటు వెళ్ళేది
నేను ఇంకా ఈ లోకంలో బతకడం వేస్ట్ అనుకొని నిర్ణయం తీసేసుకుంది

ఆ దేవుడి దగ్గరికి వెళ్లి పోయింది
ఈ కథ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నాను
అంటే…….ప్లీజ్ మీ పిల్లల మనస్తత్వాన్ని మొదట మీరు అంచనావేయండి ………….మీరు ఒక నిర్ణయానికి రండి …..

అంతేగాని ఎవరో చేసిన తప్పులకు మీ పిల్లలను బలి చేయకండి …… వాళ్ల భవిష్యత్తును బాల్యంలోనే తుoచే చేయకండి
అసలు వాటికి అర్థం కూడా తెలియని వయసులో మీ వచ్చీరాని అనుమానాలతో వాళ్ళని బాధ పెట్టకండి .
ఈ అనుభవాలు వాళ్ళ వయస్సు పెరిగిన తర్వాత కూడా ,వాళ్ల భవిష్యత్తు మీద మనసు మీద ఎంతోప్రభావాన్ని చూపుతుంది

పిల్లలను యుక్త వయస్సు రాకముందు నుండే అన్ని విషయాల పై అవగాహన కల్పించండి
పిల్లల మీద నమ్మకం ఉంచండి అలా అని అతి నమ్మకం వద్దు,అతిగా అనుమానించడం వద్దు
తల్లితండ్రులు పిల్లలను అర్థం చేసుకోపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు
పిల్లలను స్వేచ్ఛగా ఉండనీవ్వండి కాని ఇతరుల స్వేచ్ఛ కు అడ్డు తగలనీవ్వకండి
వారికి వారి హద్దు లను తెలియ జేస్తూ పెంచండి.
యువతను బంగారు బాటలేసి నడిపించే బలం
తల్లి తండ్రుల చేతుల్లో ఉంది యువత బాగుంటే దేశం బాగుంటుంది…

యువతే దేశ భవిష్యత్తు కు ఊపిరి.

****

You May Also Like

3 thoughts on “ఓ అమ్మాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!