జీవితం విలువ ఎంత?

జీవితం విలువ ఎంత?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పద్మజ

జీవితం లో అన్నివిధాలా ఓడిపోయిన నేను ఇంక బ్రతకడం దండగా అనుకోని చెరువు దగ్గరికి వెళ్ళాను. నన్ను అందరు పిచ్చివాడు అంటున్నారు సినిమా ఛాన్స్ కోసం ఎంత ప్రయత్నించినా అన్ని అవమానాలే ఈ జీవితంకి ఒక విలువే లేదు.
భగవంతుడా ఈ జీవితం నాకొద్దు నేను చెరువులో దూకాబోతున్న అంటూ దూకడానికి ముందుకు వెల్లాను. అప్పుడే ఆకాశవాణి “బాబు అగు అసలు నీకు జీవితానికి విలువ తెలుసా” అని అడిగింది. నేను “తెలియదు దేవుడా అందుకే సద్దామనుకుంటున్న” అన్నాను. అప్పుడు ఆకాశవాణి ఐతే ముందు నీకు ఒక మెరిసే రాయి ఇస్తున్న రకరకాల కొట్టు లకు వెళ్లి దీని విలువ తెలుసుకొని రా అమ్మకు అని చెప్పి రాయి ఇచ్చారు. నేను అ రాయి తీసుకొని ఏంటో ఈ దేవుడు ప్రశాంతంగా సద్దాం అంటే కొత్త టాస్క్ పెట్టినడు సర్లే అడిగివద్దం అని బయలు దేరా. కొద్ది దూరం నడవగానే  అరటికాయల బండిఎదురుపడింది. నేను “ఓ పెద్దాయన ఇదిగో ఈ రాయి తీసుకొని ఎన్ని అరటిపండ్లు ఇస్తావో చెప్పు” అని అడిగాను. అరటిపండ్లు అమ్మేఆయనరాయి తీసుకొని అటూఇటూ తిప్పి ఎం రాయి ఇది నేను ఎం చేసుకుంటా బాబు పోనీలే ఆడిగావ్ కదా 2 డజన్ల అరటిపండ్లు ఇస్తా అనన్నాడు. నేను ఆ రాయి తీసుకొని వద్దులే తాత అని చెప్పి నా దగ్గర ఉన్న 2 రూపాయలు ఇచ్చి ఒక అరటిపండు కొనుక్కొని తింటూ ముందుకు పోయా. అప్పుడు ఒక కూరగాయల కొట్టు కనిపిచింది ఓ బాబు ఇటురా అని కూరగాయల కొట్టు అబ్బాయిని పిలిచా. కూరగాయల కొట్టు అబ్బాయి ఎం అన్న పిలిచావు ఎం ఇమ్మంటావ్ అన్నాడు. నేను ఇదిగో ఈ రాయి తీసుకొని ఎన్ని కూరగాయలు ఇస్తావో చెప్పు అడిగా
కూరగాయలకొట్టు అబ్బాయి రాయిని తిప్పి తిప్పి చూసి లోపలకి పోయి వాళ్ళ అమ్మని ఆడిగొచ్చి అన్న 10కేజీ ల  కూరగాయలు తీసుకో అన్నాడు.
నేను అ రాయిని చేతి లో లాక్కొని వద్దులే తమ్ముడు అని బయలుదేరా కొంత దూరం వెళ్ళాక బంగారం కొట్టు కనిపించింది. లోపలికి వెళ్ళి నేను సర్ ఈ రాయి విలువెంతో చెప్తారా అని అడిగా బంగారం కొట్టు యజమాని దాన్ని పరీక్షగా చూసి ఇది నీకు ఎక్కడ దొరికింది అని అడిగాడు నేను “ఇది మామ దేవుడయ్యా దగ్గర ఎప్పటినుంచో ఉంది ఈ రోజు నాకు ఇచ్చాడు” అన్నాను. అప్పుడు సెట్ నువ్వు 15 నిమిషాలు అగు పరీక్ష చేసి చెప్తా అన్నాడు.నేను సరే అన్నాను. 10నిమిషాల తర్వాత సేటు వచ్చి ఇది చాలా విలువైన రాయి దీనికి ఒక కోటి రూపాయలు ఇస్తా నాకు అమ్ము అన్నాడు. నేను మనసులో అమ్మో కోటి రూపాయలా నా సినిమా నేనె తీసుకోవచ్చు అమ్మేస్తా అనుకోని మళ్ళీ వెంటనే దేవుడు గుర్తొచ్చి ఇది అమ్మేది కాదులే సేటు అని చేతిలోకి రాయి లాక్కొని అక్కడి నుంచి బయలుదేరా. అప్పుడు సేటు కావాలంటే ఇంకో 2 కోట్లు ఇస్తా అగుబాబు అన్నాడు. నేను ఎంత ఇచ్చిన అమ్మేది కాదులే సేటు అని బయలుదేరా. చాలా దూరం నడిచాక ఒక పెద్ద వజ్రాల దుకాణం కనిపించింది. లోపలికి వెళ్లి అ షాప్ యజమాని తో అయ్యా నా దగ్గర రాయి ఉంది దాని విలువ చెప్తారా అని అడిగాను. ఆ వజ్రాల వ్యాపారి సరే బాబు టెస్ట్ చేసి చెప్తా వేయిట్ చేయి ఈ కూల్డ్రింక్ తాగు అని లోపలి కి వెళ్ళాడు. సుమారు 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చి బాబు  ఇది రాయి కాదు వజ్రం దేనికి నేను వెలకట్టలేను నా ఆస్తి మొత్తం 50 కోట్లు ఇది ఇచ్చిన సరిపోదు అంన్నాడు. నేను అచ్యర్యపోతు నిజంగా అంత విలువైనది సర్ అన్నాను. సరే సర్ నేను ఈ వజ్రం ఇచ్చిన సామి ని కలవాలి అని ఆ వజ్రం తీసుకొని పరిగెత్తికుంటా చెరువు దగ్గరకి వచ్చా, దేవుడా అని పిలిచా, దేవుడు ఇప్పుడు చెప్పు దీని విలువ అన్నాడు.
నేను అరటికాయ ఆయన 2 డజన్ల అరటిపండ్లు
కూరగాయల ఆయన 10 కేజీ ల కూరగాయలు
బంగారం ఆయన 3 కోట్లు వజ్రం ఆయన 50 కోట్లు పైన ఐన తక్కువే అన్నాడు అని చెప్పా. దేవుడు జీవితం విలువ అంతే నాయన  నీ విలువ తెలియని వాళ్లకు నువ్వు ఒక సున్నా ఎంతో సాన పెడితే రాయి వజ్రం ఐతుంది. నువ్వు కష్టపడు నీ విలువ పెరుగుతుంది. జీవితం విలువ నువ్వు చూసే దృష్టి ని బట్టి ఉంటుంది. విలువైన జీవితాన్ని ఆత్మహత్య ల పేరుతో నాశనం చేసుకోకు అని అదృశ్యం అయ్యారు. నేను దేవుడా ఇప్పుడు నాకు బాగా అర్థం ఐనది జీవితం విలువ కష్టపడుతా నా టాలెంట్ కి సాన పెడుతా నా ప్రాణం కాపాడినందుకు థాంక్స్ దేవుడా అని సంతోషంగా ఇంటికి వెళ్ళాను. ఇది సురేష్ కథ ఇప్పుడు యువత మీకు జీవితం విలువ తెలిసిందా. ఆత్మహత్యలు చేసుకొని వెలకట్టలేని జీవితాన్ని వృధా చేసుకోకండి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!