(అంశం:”బానిససంకెళ్లు”)
నువ్వే మా ప్రపంచం
రచన: చింతా రాంబాబు
ఉదయం లేవగానే
నిన్నే చూస్తున్నాము
నీతోనే మాట్లాడుతున్నాము
నీతోనే పొట్లాడుతున్నాము
నిన్నే శ్వాసగా తీసుకుంటున్నాము
నీవు చెంత లేని క్షణం
పోతుంది మా ప్రాణం
నీతో అంతలా పెనవేసుకుంది మా అనుబంధం
మనుషులం ప్రక్క ప్రక్కనే ఉన్నా..
మనసులు ఊహల్లోనే ఉంటూ..
దేహాలు శిలలా మారాయి
అనుబంధాలకు దూరంగా
నీవే మా ప్రపంచం అన్నట్లు గా
మారాయి మా జీవితాలు
రాత్రి పడుకునే సమయం లో
చేతికి అందుబాటులో లో
ఉంటూ…
వయస్సు తో నిమిత్తం లేకుండా
అందరం ఈ చరవాణికి బానిసలమయ్యాం
ఈ బానిస సంకెళ్ళ నుండి
విముక్తి పొందాలి మనందరం
వాడకం పరిమితం చెయ్యాలి
మార్పు రావటానికి
నీవంతుగా నీవు కృషి చేయాలి.