నా జన్మభూమి
రచన: సావిత్రి కోవూరు
సిరి సంపదలతోడా, పాడిపంటలతోడా పరవశించే భూమి నా జన్మభూమి,
సర్వకళల తోడ, సకలసంపదలతోడా కళకళలాడేటి నా జన్మభూమి
వేద వేదాంగాలు వెలుగొందు, ఇలలోన ప్రభలతో విలసిల్లు నా జన్మభూమి,
సర్వ విద్యలతోడ విజ్ఞానాలు వికసించే నా జన్మభూమి,
ముత్యాలు, రత్నాలు, వజ్రవైడూర్యాలు రాసులుగా పోసి విక్రయించిన నేల నా జన్మభూమి
కోరినవన్నిచ్చి కన్నబిడ్డల వలె చూచు, రాముడేలిన భూమి నా జన్మభూమి
పుణ్య క్షేత్రాలెన్నెన్నో పురుడు పోసుకోని, పుణ్య నదులెన్నెన్నో పరుగులెత్తేనిచ్చట నా జన్మభూమి
యజ్ఞాలు యాగాలు ఒనరించిన నేల,గానాలు, నృత్యాలు అలరించినవిచ్చట, నా జన్మభూమి
చిత్రములు, శిల్ప సంపదలెల్ల కనువిందు చేయు కమనీయ దృశ్యాల నా జన్మభూమి
నదులు, జలపాతాలు నాట్య మాడునిచట, సిరులతో వెలుగొందె నా జన్మభూమి
తెల్లవారి కళ్ళు పడి తెల్లబోయింది, వర్తకము పేరుతో వనరులన్నీ దోచి
మనను బానిసలు చేసి మనుగడ లేకుండ భాగ్యాలు దోచిరి నాజన్మ భూమిలో
మహనీయులెందరో మహాత్ముని మాటపై అహింస మార్గాన ఉద్యమాలు నడిపి చెరసాలల్లోన మగ్గి,
సత్యాగ్రహాలు చేసి సంగ్రామాలు నడిపి ఊపిరాడకుండా చేసి దుష్టుల పారద్రోలె నా జన్మభూమి
తరిమి తరిమి కొట్టి స్వేచ్ఛను తెచ్చిరి, దాని విలువను తెలిసి, ఆ త్యాగమూర్తుల తలచి,
స్వాతంత్రం దినోత్సవము ఆగస్టు పదహైదు నాడు మనము,
జాతీయ గీతంతో మువ్వన్నెల జెండా ఎగుర వేద్దాం అందరము సంబరాలు చేసుకుందాం సంబురంగా.
***