మా ప్రయాణం

(అంశం:”అపశకునం”)

మా ప్రయాణం

రచన::బండి చందు

రవికి కొత్తగా రామాపురం ట్రాన్స్ఫర్ అయింది ,ఆ ఊరి స్కూలు కి టీచర్ గా ఆ రోజే జాయినింగ్, రవి స్కూల్ కి వెళ్లి అక్కడ ప్రిన్సిపల్ కలసి అందరినీ పరిచయం చేసుకున్నాడు . అక్కడ సురేష్ అనే అతను అందరికంటే ఎక్కువగా రవికి దగ్గరయ్యాడు .సురేష్ ఉండే ఇంటికి దగ్గర రవి కోసం కూడా ఇల్లు చూపెట్టాడు , ఆ ఇంట్లోనే రవి మకాం ఏర్పాటు చేసుకున్నాడు.
ఇద్దరు బ్రహ్మచారులే గాని కులాలు వేరు, ఇద్దరూ ఎవరికి వారు వంటలు చేసుకుని రోజు ఒకటే టైం కి స్కూల్ కి వెళ్ళే వారు వచ్చేవారు. అయితే ఆ ఊర్లో అన్నీ బాగానే ఉన్నా కూడా అందరు ఒకే విషయం చెప్తున్నారు రవికి సురేష్ ప్రిన్సిపాల్ తో సహా,
ఆ విషయం ఏంటంటే ఊర్లో రమణి అనే ఒక అమ్మాయి ఉంది అని రమణికి పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయారు, అని తర్వాత ఆ పిల్ల నానమ్మ తాతయ్య కూడా చనిపోయారు అని
రమణి మేనత్త రాజ్యం ఒక్కతే ఆమె కుటుంబం తో సహ ఆ రమణితో ఉండి పెంచి పెద్ద చేసిందని రమణిని ఎవరు బయటికి వెళ్లేముందు చూసినా కూడా వారికి మంచి జరగదు అని అపశకునం అని తనని ఎవరు చూడకూడదని ప్రచారం జరిగింది, రమణిని ఆ ఊరు స్కూలుకి చదువుకోడానికి వెళ్తే కూడా దురదృష్టవంతురాలు అపశకునం అని రానివ్వలేదని ఆ మాస్టారు పిల్లలు ఊరి జనం,అందరు, ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు మీద ఉన్న భూమి లో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతుంది అని రోజు పొలానికి బయలుదేరే ముందే సూరి గాడు వచ్చి సైకిల్ మీద అందరికీ చెప్పి వెళ్తాడు, అందరు లోపలికెళ్ళిపోతారు, అలా రమణిని ఇప్పటివరకు ఎవరూ చూసింది లేదు, సాయంత్రం కూడా అంతే ఇంటికి వచ్చేటప్పుడు కూడా దారిలో ఎవరు ఉండరు అని
ఆ విషయం అందరు చెప్పినప్పుడు అంతా అర్థమైనట్టే ఉన్నా ఏమీ అర్థం కాలేదు రవికి , అలా అతను ఆ ఊరికి వచ్చి ఒక పది రోజులు గడిచిపోయాయి,
ఒక రోజు స్కూల్ కి వెళ్లేటప్పుడు సురేష్ వచ్చి పిలిచాడు రవిని వెళ్దాం అని అప్పుడు రవి నేను ఈరోజు బట్టలు ఉతుక్కుంటున్నాను, నిన్న మోన్న పిండటం కుదరలేదు ,అలాగే వంట చేసుకుని, వస్తాను ఫస్ట్ పీరియడ్ కల్లా అని చెప్పాడు,
సురేష్ వెళ్ళిపోయాడు ,రవి బట్టలు పిండుకొని కూరగాయలు తరుగుతూ ,అన్నం పొయ్యి మీద నుండి తీసాడు,గంజి వార్చుదామని, పోయ్యి మీద నుండి గిన్నె తీసేటప్పుడు చేయి జారి గిన్నె కాళ్ల మీద పడి పోయి గట్టిగా అరిచాడు ,

ఆ అరుపుకి రోడ్డు మీద వెళ్లే ఇరవై ఏళ్ల అమ్మాయి లోపలికి పరిగెత్తుకొని వచ్చింది, అంత బాధలో ఉన్న రవి ఆ అమ్మాయి చూసి ఎంత అందంగా ఉంది ఎవరీ అమ్మాయి అనుకున్నాడు
ఆ అమ్మాయి రవిని చూసి అయ్యో కాలిందా మొత్తం ఎర్రగా అయిపోయింది రండి అని మెల్లిగా రవిని పట్టుకొని లేపి మంచంలో కూర్చోబెట్టి కాలిన గాయానికి కోల్గేట్ పెస్ట్ తీసుకొచ్చి పూసింది.

ఇంకా పెళ్లి కాలేదా మీకు,మీరు ఒక్కరే ఉంటారా జాగ్రత్తగా చూసుకోవాలి కదా పొయ్యి మీద నుండి వేడి వేడిగా ఏదైనా దించేప్పుడు అంటూ ఆ అమ్మాయి మాట్లాడుతుంది, ఆమె అందాన్ని చూసి మైమరచిపోయాడు రవి
ఇక పడుకోండి మీకేం కాదు అనీ పోయ్యి దగ్గరికి వెళ్లి గిన్నెలో ఉన్న అన్నాన్ని అలాగే ఉంచి కింద పడ్డది తీసి బయట పడేసింది, చేతులు కడుక్కొని ఇంక నేను వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరింది.

రవికి అంతా ఒక కల లాగ అనిపించింది, ఆ అమ్మాయి ఎవరు ,నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు ఈ ఊర్లో ,ఎంత అందంగా ఉంది అనుకోని నొప్పి తగ్గిన తర్వాత తెలుసుకోవాలని అనుకున్నాడు,
మధ్యాహ్నం సురేష్ వచ్చాడు ఏంటి స్కూలుకు రాలేదు అని తెలుసుకుందామని , సురేష్ కి జరిగిన విషయం చెప్పగానే అంత అందమైన అమ్మాయి ఎవరబ్బ అని ఆలోచించాడు, కాని ఎవరు తట్టలేదు ,
ఇద్దరు ఆ అమ్మాయి ని వెతకడం మొదలు పెట్టారు
కానీ ఎక్కడా కనిపించలేదు
వారం రోజుల తర్వాత అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఆదివారం పూట సాయంకాలం చెట్టు పక్కన కూర్చున్నాడు రవి , అప్పుడే సూరి గాడు సైకిల్ మీద వెళ్ళిపొండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు .
రవి గడ్డి చాటుకు ఉండటంవల్ల సూరి గాడికి కనిపించలేదు, రవి కూడా సూరి గాడు చెప్పిన మాటలు ఏమీ వినిపించలేదు, ఎందుకంటే తను పరధ్యానంలో వున్నాడు ,అమ్మాయి గురించి ఆలోచిస్తూ, కొద్దిసేపటికి గజ్జెల శబ్దం వినిపించింది రవికి ,ఆ గజ్జలు శబ్దమే ఆరోజు విన్నది అని అటు వైపు తిరిగి ఉన్న వాడు కాస్త రోడ్ వైపు తిరిగి చూశాడు ఆ అమ్మాయే , ఆమె దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళాడు రవి
ఏమండీ ఆగండి మీ పేరేంటి అని అడిగాడు తోందరపడుతూ, ఆ అమ్మాయి మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుంది అని అతని భయం ,
నా పేరు రమణి, అలాగే జనం పెట్టిన ఇంకో పేరు కూడా ఉంది అపశకునం అని, ఇంత అందంగా ఉన్నారు అపశకునం ఏంటి అని అడిగాడు రవి,
కొందరు స్వార్థపరుల దాహనికి బలి అయ్యాను, అయినా అవన్నీ నీకెందుకు నా మొహం చూస్తే మీకు మంచి జరగదు వెళ్ళిపొండి అని చెప్పింది ఆమె, లేదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నేను మిమ్మల్ని ప్రేమించాను అన్నాడు రవి

అవన్నీ మాటలు నేను నమ్మను , ఎందుకంటే నా మొహం చూడడానికి చాలామందికి భయం ,అంది రమణి నవ్వుతూ

నాకేమైనా పర్లేదు , ఈ మూఢ నమ్మకాలు అన్ని నమ్మను ,నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని రవి అనగానే
రమణి
సరే మీరు మా మేనత్త తో వచ్చి మాట్లాడండి చూద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది.

రవి వెంటనే పరిగెత్తుకెళ్లి సురేష్ దగ్గరికి విషయం చెప్పాడు ,సురేష్ భయపడి చాలా విధాల వద్దని చెప్పడానికి ట్రై చేశాడు ,కానీ రవి అస్సలు వినలేదు, ఇంక లాభం లేదు అనుకుని సురేష్ రవి తో కలిసి అమ్మాయి వాళ్ళ ఇంటికి బయలు దేరి వెళ్లారు,
అక్కడికి వెళ్లేసరికి గేట్ ,అది దాటితే ఒక బంగ్లా వెనకటి కాలంలో కట్టినదిలా ఉంది,వీరు లోపలికి వెళ్లగానే ఒకతను వచ్చి అడిగాడు ఎవరు కావాలి అని, రాజ్యం గారు కావాలి అని చెప్పారు,

లోపల నుండి ఆవిడ వచ్చింది ,మధ్యవయస్కురాలు పట్టు చీర కట్టుకుని ఒంటినిండా నగలు వేసుకొని వచ్చింది ఫోన్లో మాట్లాడుకుంటూ, కూర్చోమని సైగ చేసింది వీళ్ళకి ,కూర్చున్నారు ఫోన్ పెట్టేసి ఏం కావాలి మీకు అని అడిగింది ,
అప్పుడు రవి నేను రమణి ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు, ఆ మాటలు విన్నాక చూడండి మీకు తెలిసే ఉంటుంది అది మంచిది కాదు తన మొహం చూస్తేనే అరీష్టం ,పుట్టగానే తల్లిదండ్రులను మింగింది తరవాత మా అమ్మానాన్నలు చచ్చిపోయారు, అలాగే ఊళ్లో కూడా తన మొహం చూసిన ముగ్గురు నలుగురు హాస్పిటల్ పాలయ్యారు, అప్పటినుండి నేనే మనిషిని పెట్టి మరీ అది బయలుదేరే ముందు , వచ్చే ముందు చాటింపు చేయిస్తున్నాను, ఒకసారి బాగా ఆలోచించుకొని చెప్పండి అని చెప్పిందామె ,

అప్పుడు రవి స్థిరంగా లేదండి మీరు ఎన్ని చెప్పినా నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు,

మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నా నేను దానికి పెళ్లి చేయాలని అనుకోవటం లేదు, ఆమె ఖచ్చితంగా చెప్పింది .

అదే ఎందుకు చెయ్యరు అని అడిగాడు రవి

నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించి రాలేదు ఆ అమ్మాయి వెనకాల ఉన్న డబ్బు ని ప్రేమించి వచ్చావు కదా, ఒక శని దాన్నిని పెళ్లి చేసుకుంటా అంటున్నావ్ ,
ఏంటి నీకు బతుకు మీద ఆశ లేదా, ఎక్కడైనా వెళ్లి ఏవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో ఇలాంటి దురదృష్టవంతురాలిని చేసుకొని ఏం బాగుపడతావ్ అంది ఆవిడ ,

తర్వాత రాజ్యానికి రవికి మాటల యుద్ధము సాగింది, రాజ్యం భరించలేక పోలీసులకు పోన్ చేసి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యము చేస్తున్నారు అని చెప్పగానే వారు వచ్చి రవి ని తీసికొని వెళ్లి కొద్దిసేపటికి జామిను మీద విడుదల చేసారు,

అప్పటికి చాలా రాత్రి అయింది. ఆ విషయాలన్నీ తెలుసుకున్న రమణి ఆ రాత్రి పూట రవి కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది ,వచ్చి తలుపులు కొట్టగానే రవి తీసి ఆశ్చర్యపోయాడు రమణి ని చూసి ఏంటి ఇంత రాత్రి వేళ వచ్చావ్ అని అడిగాడు.

ఆ మాట విని రవి ని గట్టిగా పట్టుకుని ఏడవడం మొదలు పెట్టింది , మా మేనత్త నేను అపశకునం అని దురదృష్టవంతురాలిని అని ప్రచారం చేసింది.
నా ఆస్తి కోసం, నాకు చదువు సంధ్య రాకూడదని కంకణం కట్టుకుంది ,ఈ ఊరిలో ఇద్దరు ముగ్గురు నా మొహం చూసి హాస్పిటల్ పాలయ్యారు అన్నది కూడా ఆమె చేసింది ,మా మేనత్త నేను నలుగురితో మాట్లాడకుండా నలుగురు నా వైపు చూడకుండా నా గురించి ఆవిడ దుర్మార్గం గురించి ఎవరికి తెలియకుండ ఇలా నన్ను మూఢనమ్మకాలకు బలి చేసి ఒక దురదృష్టవంతురాలుగా ముద్ర వేసింది ,
తనకు జరిగిన అన్యాయం అంతా పూసగుచ్చినట్టు రవికి చెప్పగానే చాలా కోపం తో
సిఐ కి పోన్ చేసి జరిగిన విషయం చెప్పి తర్వాత రమణిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అన్ని విషయాలు రమణి ద్వారా వాళ్లకి అర్థమయ్యేటట్లు చెప్పించి ఆ రాత్రే పోలీస్ స్టేషన్ లోనే రమణిని పెళ్లి చేసుకున్నాడు రవి,

వాళ్ళ మేనత్త దుర్మార్గాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే అరెస్టు చేసారు, ఇలాంటి దురాచారాలు ఎవరు నమ్మకూడదని రమణి రవి ని ఉదాహరణగా చూపిస్తూ ఊరిలో మీటింగ్ ఏర్పాటు చేసారు.
సి. ఐ చరణ్ మాట్లాడుతూ మీరందరూ ఆమె చెప్పిన కట్టుకథలు నమ్మడం వల్ల ఒక అమాయకురాలి జీవితం బలైపోయింది ,తనని చదువుకొనివ్వకుండా చేశారు ,మీ మధ్యలో కలిసిమెలిసి తిరగకుండా చేశారు, తను మీ పిల్లలలాగే ఒక ఆడపిల్ల అని కూడా మర్చి పోయి తనని మీరు దూరం పెట్టారు, మీరు ఒకవేళ వాళ్ళ మేనత్త మాటలు నమ్మకుండా ఉంటే తన జీవితం వేరేగా ఉండేది,రవి ధైర్యం చేసి రమణిని అర్థం చేసుకోవడం వల్ల ఈ రోజు తన జీవితం బాగుపడింది.
వాళ్ళ మేనత్త స్వార్థం వల్ల రమణి జీవితాన్ని నాశనం చేయాలని చూసింది, అందుకే ఇప్పటికైనా మూఢనమ్మకాలను వదిలిపెట్టండి అని ఆ ఊరి ప్రజలకి అవగాహన కల్పించారు, అలా రమణి రవి ఒక్కటై సంతోషంగా జీవించారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!