ఇలా ఎందుకు జరగింది?

(అంశం:: “అర్థం అపార్థం”)

ఇలా ఎందుకు జరగింది?

రచన:: దోసపాటి వెంకటరామచంద్రరావు

ఆఫీసునుండి ఇంటికి బయలుదేరాడు రామారావు.
ఇంటికెళ్ళి చేయాల్సిందేముంది.తనకంటూ ఎదురుచూసేవాళ్ళెవరూ లేరుకదా.పోనీ బయట ఎక్కడైనా తిరిగే పరిస్తితులైతే ఈ కరోనా ధర్మమా అని
లేవు.మరేంచేయలేక ఇంటిముఖం పట్టాడు.
ఇంట్లో తనొక్కడే ఒంటరిగా బ్రతకాలి.ఈ పరిస్తితికి తానే బాధ్యుడా?ఇది తన స్వయంకృతాపరాధమా? అలా గతంలోకి వెళ్ళిపోయాయి అతని ఆలోచనలు.

***

రామారావు డిగ్రీ చదువు అవుతూనే గ్రూపు ఫోర్ పరీక్షలు రాసి తాహశిల్దారు ఆఫీసులో గుమస్తా ఉద్యోగం సంపాదించాడు.ఉద్యోగం రావడంతోనే ఇంట్లో పెళ్ళీ చేసుకోమని ఒత్తిడి.సరేనన్నాడు. పెళ్ళిబాజాలు మోగాయి.రామారావుకి భార్య అతని మేనత్తకూతురే.ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు ఆమెను. అసలు రామారావుకి హాబీలంటూ ఏమిలేవు. సినిమాలు చూడడు.పుస్తకాలు చదవడు.ఎదో డిగ్రివరకు చదుకోమన్నారని ఆ పుస్తాకాలతో కుస్తీ పట్టి పాఠాలను బట్టీపట్టి గట్టెక్కాడు.ఎలాంటి అభిరుచులు లేని అల్పజీవి.ఇక ఉద్యోగంలో చేరాక అదే అతనికి అలవాటైన ప్రదేశం.ఉదయం ఆఫిసులోకి అడుగుపెడితే మళ్ళా బయలుదేరేవరకు తలెత్తకుండా పనిచేసుకుపోయే కష్టజీవి.తోటి సహొద్యోగులతోకూడ సఖ్యత వుండదు.ఎవరైనా టీ తాగాడానికి పిలిచినా వెళ్ళడు.అది అతనితీరు.
ఇక అతనిభార్య సుశీల పెద్దగా చదువుకోలేదు.కాని ఆమెకు సంగీతంలో కొంచెం ప్రావీణ్యంవుంది.రామారావు మాత్రం ఎప్పుడూ ఏవిషయం ఆమెగురించి అడిగింది లేదు.పెళ్ళి పిల్లలు రొటీను జీవితం లోకి మారిపోయింది. సుశీల పిల్లల ఆలనా పాలనా అత్త మామలను కనిపెట్టుకోవడంతోనే సరిపోయేది.తీరిక దొరికినప్పుడు మాత్రం సంగీతసాధన చేసేది.అలా అత్తమామల ప్రొత్సాహంతో రేడియో ఆర్టిస్టుగా మారింది.అదే ఆమె జీవితానికికాస్తంత ఊరట. రామారావు లో ఎలాంటి మార్పులేదు.మరమనిషి. కొడుకు వైఖరిలో మార్పు లేకపోవడంతో సుశీల పట్ల తప్పుచేశామేమోనన్న అపరాధభావం ఎర్పడింది వాళ్ళలో.కొంతకాలానికి వాళ్ళు చనిపోవడంతో సుశీలకు పిల్లల మీదే తన దృష్టి పెట్టసాగింది. పిల్లలపై చదువుకోసమని భర్తతో శాయశక్తులా ప్రయత్నించింది మాట్లాడడానికి.అసలు ఆ అవకాశమే
ఇచ్చెవాడు కాదు.ఆఫిసునుంచిరావడం ఎదోఇంత తీనేసి ముసుగుతన్ని నిద్రపోవడం. ఒకరోజుమాత్రం సుశీల తెగించి భర్తతో మాటలయుద్దం చేసింది.రామారావులో ఎప్పుడూలేని అసహనం ఆరోజు బయటపడింది.అదెంతవరకు వచ్చిందంటే ఎవరిదారినవారు విడిపోయేలా చేసింది. అర్ధంచేసుకోకుండా ఒకరు అపార్ధంచేసుకొని ఒకరు విడిపోయారు.

***

అలా పాతిక సంవత్సరాలు గడిచిపోయాయి.రామారావు పదవివిరమణకు తగ్గరయ్యాడు.అ తాహశిల్దారు ఆఫిసులో సూపరెండెంటూ వరకు ఎదిగాడు.మర్నాడు
కొత్త తాశిల్ధారు బదలిపై వస్తున్నారని తెలిసింది. ఆయనికి స్వాగతం పలకడానికి ఎర్పాట్లు చేయమని మిగతా ఉద్యోగులకు పురమాయించాడు. కొత్తగా వస్తున్నది యువకుడని తెల్సింది. మర్నాడు కొత్త తాహశిల్దారు రాజేశ్ కుమార్ ఆఫీసులో చేరాడానికి రానే వచ్చాడు.అందరూ అతనికి స్వాగతం పలికారు.రాజేశ్ కుమార్ తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయాడు.సాయంత్రం ఆఫీసు సిబ్బందితో సమావేశం ఎర్పాటు చేసి అందరిని పరిచయం చేసుకున్నాడు.అందరికంటే సినీయర్ అయిన రామారావుని తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. మరుచటిరోజు రామారావు తాహశిల్దారింటికి వెళ్ళాడు. అక్కడ సుశీలను చూసి నిశ్చేస్టుడయ్యాడు.
రామారావు రావడంతో రాజేశ్ కుమార్ అతని కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వదించమన్నాడు. రామారావు కళ్ళనుండి ఆనందబాష్పాలు రాలేయి. తనని గుండెలకు హత్తుకొన్నాడు.”సశీలా !నన్ను క్షమించు.నీ పట్ల పిల్లలపట్ల అమానుషంగా ప్రవర్తించాను.నువ్వు వాళ్ళని ప్రయోజకుల్ని చేశావు. నేను నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను.అపార్ధంచేసుకున్నాను.”
“సరే నాన్నగారు .జరిగిదంతా మంచికే .రేపటినుండి మీరు మాతోనే వుంటారు.”అంటూ రాజేశ్ కుమార్ ఇద్దరిని కలిపాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!