ఊబిలో చిక్కకండి

(అంశం:”అపశకునం”)

ఊబిలో చిక్కకండి

రచన :: జీ వీ నాయుడు

శ్రీదేవి భూదేవి కవల పిల్లలు.. తల్లిదండ్రులు పేదరికం లో ఉన్నా కుమార్తెలు ఇద్దర్నీ రసాయన శాస్త్రం లో ఎం ఎస్సి చేయించారు. ఓకే కళాశాలలోనే వీరి చదువులు కొనసాగాయి. ఇద్దరు సైన్స్ విద్యార్థినులే అయినా శ్రీదేవి కి విపరీతమైన భక్తి, మూఢనమ్మకాల పిచ్చి.
కళాశాలకు వెళ్ళాలి అన్నా, కనీసం స్నానానికి వెళ్ళాలి అన్నా శుభశకునం కావాలి శ్రీదేవి కి. ఇది సాక్షాత్తు వాళ్ళ అమ్మమ్మ నుంచి వచ్చింది.. భూదేవి కి ఇవి ఏవీ పట్టవు. తనకు చదువే మహాలోకం.
ఇద్దరు ఉత్తీర్ణత సాధించిన నాటి నుంచి ఉద్యోగ అన్వేషణ లో ఉన్నారు. రెండు సంవత్సరాలనుండి ఎన్నో పోటీ పరీక్షలు రాశారు. కాని ఒక్కటీ వారి దరి చేరలేదు. శ్రీదేవి మొక్కని దేవుడు లేడు, ఎక్కని దేవాలయం లేదు.
భూదేవి మాత్రం పుస్తకాల పురుగై చదువుతూనే ఉంటుంది. ఇక లాభం లేదనుకుని ప్రవేటు ఉద్యోగం అయినా మంచిదే అని అన్వేషణ చేపట్టారు.. ఒక రోజు దినపత్రిక లో ఉద్యోగ ప్రకటన పడింది. ఆదివారం ఇంటర్యూ ఉంది. ఆ రోజు అమావాస్య. మనం వెళ్ళవద్దు.. వెళ్లినా మనకు రాదు అంటూ శ్రీదేవి ఆదిలోనే హంసపాదు చందంగా ఇంటర్యూ కు డుమ్మా కొట్టించింది.. అంతా ఈ మూఢనమ్మకాల ఊభిలో చిక్కి కొట్టుమిట్టాడుతున్నారు.
మరో రోజు ఇంకో ప్రకటన దర్శన మిచ్చింది. ఆ రోజు మంగళవారం వద్దు అని బ్రేక్ వేసింది శ్రీదేవి.. భూదేవి కి ఈ పనులు ఏవీ నచ్చట్లేదు.
మరో రోజు రసాయన కర్మాగారంలో మంచి ఉద్యోగం, మంచి జీతం తో ప్రకటన పత్రిక లో వచ్చింది.
బుధవారం ఇంటర్యూ హైదరాబాద్ లో. విజయవాడ కు సమీపంలో ని గన్నవరం లో నివాసం ఉంటున్న శ్రీదేవి భూదేవి ఇంటర్యూ కు హాజరు అయ్యేందుకు సిద్ధం అయ్యారు. వేకువ జామున లేవగానే పిల్లి కనిపించింది ఇంట్లోనే శ్రీదేవి కి. అంతే అబ్బా ఆపశకునం జరిగింది.. అని ఇంటర్యూ వద్దు ఏమీ వద్దు అని కూర్చొంది శ్రీదేవి.. ” నాకు అవసరం లేదు. నువ్వు వచ్చినా, రాకున్నా నేను వెళ్లి తీరు తాను ” అంటూ ఒంటరిగా బయలు దేరింది భూదేవి.. ఇంటర్యూ కు హాజరు అయింది. అన్ని ప్రశ్నలకు చక్కగా బదు లిచ్చింది. ఉద్యోగం వచ్చింది. లక్ష రూపాయలు జీతం.. మూఢనమ్మకాలు నమ్ముకున్న యువతి ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.. మూఢనమ్మకాలు ఊబిలో చిక్కకండి అంటుంది భూదేవి.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!