ఒక అమ్మాయి కథ

(అంశం:”అపశకునం”) 

ఒక అమ్మాయి కథ

రచన :: ఎన్.ధన లక్ష్మి

ఒసేయ్ పాపిష్టి దాన పని మీద బయటకు వెళ్ళాలి అనుకుంటే నువ్వు ఎదురు వచ్చావు.ఇంకా ఆ పని అయినట్టే లోపలే ఉండి చావచ్చు కదా.నిన్ను ఎవరు బయటకు రామన్నరు.. అపశకున పక్షి! మొన్నటికి మొన్న కూడా ఇలాగే నీ ముష్టి మొహం వేసుకొని తగలబడ్డవు నేను వెళ్ళినా పెళ్ళి కాస్త పెటాకులు అయ్యింది…”
”  ఏవండీ నేనే తనని తోటలోకి వెళ్లి మొక్కలకు నీళ్లు పట్టమన్నాను తనని ఏమి అనకండి..అయిన ఆ పెళ్ళి ఆగింది మంచన్న పడ్డ ఆ పెళ్ళి కూతురు తాతయ్య చనిపోవడం వల్ల కదా దానికి మన అమ్మాయీని ఎందుకు నిందిస్తున్నారు మీరు ”
” ఏంటి కామాక్షి నోరు లేస్తుంది??
నీ బిడ్డ రాబట్టే ఆ పెళ్ళి చెడింది..నీకు ఎన్ని సార్లు చెప్పాను నేను వెళ్లిపోయిన తరువాత ఈ పాపిష్టి దానికి ఏవైనా పనులు చెప్పుమని చెప్పాను నువ్వు మారవు”  అని తిట్టుకుంటూ లోపలకి వెళ్ళిపోయాడు కృష్ణశాస్త్రి..
తిట్టి వెళ్ళిన తన తండ్రి వైపు చూస్తూ ఏడుస్తూ లోపలకి వెళ్ళిపోయింది ఉష .
దేవుని ఫోటోను చూస్తూ కన్నీళ్లతో
” ఒక్కప్పుడు నేను ఎప్పుడూ బయిటకు వెళ్ళిన సరే నువ్వే నాకు ఎదురు రావాలి అన్న ఆ నాన్న గారే ఇప్పుడు నన్ను దరిద్రం అంటున్నారు.అంటే నుదుటి మీద బొట్టు , కాలికి మెట్టులు ,మెడలో తాళి ,చేతికి గాజులు ఉంటేనే అమ్మాయీ కి విలువ.ఇవేమీ నాకు పుట్టుకతో రాలేదు కదా  మధ్యలో వచ్చాయి మధ్యలోనే పోతాయి కదా అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఎందుకు స్వామి నా జీవితo నాకు కాకుండా చేసావు….నేను ఏమి పాపం చేశాను అని…
బాగా చదవి టీచర్ అవ్వాలి అనుకున్న…
వయసుకు  వచ్చాను అని నా నుంచి పుస్తకాలను దూరం చేశారు.పర్లేదు లే మా అమ్మ నాన్న నా మంచి కోసమే అన్నీ చేసి ఉంటారు అని సరిపెట్టుకున్న.
పెయింటింగ్స్ వేస్తూ ఉంటే అవి చేయకూడదు అని ఆడపిల్ల వంటావార్పు నేర్చుకోవాలని ఇలాంటివి మనకు తగవు అని నా నుంచి అవి కూడా దూరం చేసారు.సర్లే నాకు ఇంతే రాసి పెట్టీ ఉంది అనుకోని సరి పెట్టుకున్నా..
వయసుతో సంబంధం లేకుండా నన్ను నా కన్న పది ఏళ్లు పెద్ద అయిన మేన మామతో వివాహం జరిపించారు.మా వాళ్ళు నా మంచి కే చేసి ఉంటారు లే అనుకున్న.
వచ్చిన నా భర్త అయిన నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటే తనకి నా శరీరంతో తప్ప  నా మనసుకు విలువ ఇవ్వరు అని నాకు పెళ్ళి అయిన రోజే తెలిసింది.ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.
తాగి వచ్చి నన్ను కొట్టేవారు ఇవ్వని అమ్మ నాన్న కు తెలిసిన భర్త కదే కొట్టింది సర్ధుకుపోమని చెప్పారు.ఎన్నో ఓర్చుకున్న సిగరెట్లు తో నా శరీరం మొత్తం కాల్చేవాడు.ఆఖరికి ఆయన తాగుడు వల్లే  పెళ్లి అయిన ఐదు నెలలకే నేను విధవను అయ్యాను.
ఒక్కప్పుడు నాన్న గారే నన్ను మహాలక్ష్మి లాగ ఉన్నావు .నాకు ఎదురు రామని చెప్పేవారు.ఇప్పుడు అదే నోటితో నన్ను పాపిష్టి దాన ఎందుకు ఎదురు వస్తున్నావు అంటున్నారు…ఆఖరికి ఇష్టమైన తిండిని కూడా తినడానికి వీలులేదు…
ఎందుకంటే తినే ఆహారం మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది అని అంటారు.వయసులో ఉన్న కదా ఏదైనా తప్పు చేస్తాను అని అంటారు ఏడుస్తు అలాగే కటిక నేల పై నిద్ర పోయింది ఉష…
” అరేయ్ చరణ్ అంతా దూరం అది మారుమూల గ్రామం అందులో ఆచారాలు పాటించే గ్రామానికి వెళ్ళడం అవసరంమా..
అమ్మ నేను చదువకున్నది నా చదువు పది మందికి ఉపయోగ పడాలి అని .అక్కడ నా వల్ల ఒకరు చదువ కున్న.నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని బై చెప్పి గ్రామానికి బయలుదేరారు…
చరణ్  ఆ ఊరిలో స్కూల్లో చేరాడు.ఆ ఊరి సర్పంచిని ఒప్పించి ఆసక్తి కలిగిన పెద్దవారికి ఉష
వాళ్ళ  అవరణలో ఇంటి పాఠాలు చెప్పసాగారు
ఉష కూడా తన రూం కిటికీ నుండి చరణ్ చెప్పె పాఠాలను వింటు ఉండేది. చరణ్ ఉష పాఠాలను శ్రద్ధగా వినడం గమనించా డు
ఆ ఇంటికి వచ్చిన   కొద్దీ రోజులు లోనే  కృష్ణా శాస్త్రి గురించి అర్థం అవ్వడానికి ఎక్కువ రోజులు టైమ్ పట్టలేదు చరణ్ కి.
ఆ ఇల్లు కూడా సర్పంచి ది కాబట్టి  పాఠాలు చెప్పడానికి అనుమతి ఇచ్చారు లేదు అంటే ఇచ్చే వారు కాదు .
ఉష కోసం బుక్స్ నీ , పెన్స్ అన్నీ తెచ్చి ఉష కు ఎవరికి తెలీకుండా ఇచ్చేవాడు.ఉష మొదట నిరాకరించిన తనకు చదువుకోవాలని ఉన్న ఆశ వల్ల అవి తీసుకొని రాయడం చేసేది.చరణ్ అప్పుడపుడు ఉష కోసం కథల బుక్స్ తెచ్చి ఇచ్చేవాడు.తనకి అవి ఉపోయోగ పడతాయి అని.ఆ కథల ద్వారా తనలో ధైర్యాన్ని ,బ్రతుకు మీద ఆశ కలిగించాలి అని చరణ్ పాటు పడేవాడు
నా జీవితంలో  ఇన్ని రోజులకు చీకటి తప్ప ఇంకో లోకం తెలియని నాకు తిరిగి చదువు రూపంలో వెలుగు రా పోతున్నది అని ఉష అనందిచేది…
ఆ ఏడు పదో తరగతి పరీక్షలు తేదీలను ప్రకటించారు.చరణ్ ఎలాగ అయిన ఉష చేత ఆ పరీక్షలు రాయించాలి అని కృష్ణ శాస్త్రి నీ కలిసి మాట్లాడాలి అని ఒప్పుకుంటే రో లేదో  సందేహంగా వచ్చాడు చరణ్…
చరణ్ మాట్లాడినా తరువాత శాస్త్రి గారు ఒప్పుకున్నాడు.తన ముందరే ఉష నీ పిలిపించి పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చారు…
ఉష కూడా తన కల నెరవేరుతుంది దానికి వాళ్ళ నాన్న గారు ఒప్పుకున్నారు అని సంతోషపడి చరణ్ కాలికి నమస్కరించి తన కృత జ్ఞతను తెలియ చేసింది.
చరణ్ కూడా ఎంతో ఆనందించారు తన వల్ల ఒక్కరి కల నెరవేరుతుంది అని తన అప్లికేషను వేయడానికి టౌన్ కి వెళ్ళాడు.అక్కడ వాళ్ళ అమ్మతో ఈ విషయం చెప్పి ఒక్క వారం రోజులు ఉండి తిరిగి గ్రామానికి వెళ్ళాడు
ఇంకో కో ద్ది రోజుల్లో పరీక్ష రాయటానికి హల్ టికెట్ వస్తుంది . ఈ విషయం చెప్పాలి అని ఎంతో ఆత్రుతగా వెళ్ళిన చరణ్ కు ఉష బావి నుంచి నీరు తెస్తూ పాము కాటుకు గురి అయి చనిపోయింది అని తెలిసి బాధ పడ్డాడు ఊరి ప్రజల ద్వారా తెలుసుకొని బాధ పడ్డాడు
శాస్త్రి గారిని పలకరించి పరామర్శ చేసి తిరిగి వెళ్తూ
ఉష దగ్గర బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ కావాలి అని అడగడంతో  కామాక్షీ తెచ్చి ఇచ్చారు.వాటిని తన సంచిలో పెట్టుకొని వెళ్లి ఇంటికి వెళ్లి ఆ బుక్స్ తీసి అల్మరలో పెట్టాలి అని చూసిన తనకి తన పెయింటింగ్ కనపడ్తే బుక్స్ అన్నిటినీ విదిలించి చూసాడు.ఒక్క పెయింటింగ్ లో శాస్త్రి గారు ఉషా న్నీ  కొట్టినట్టు. ఇంకో దానిలో చేతి పై వాత పెట్టీ నట్టు  ఇలా ఉన్నాయి.
బుక్ చివరిలో ఉష రాసినవి చదవి షాక్ గురి అయి వెంటనే అక్కడ ఉన్న పోలీసు వాళ్లను,ఊరి పెద్దలను తీసుకొని శాస్త్రి గారి ఇంటికి వెళ్ళారు. చెప్పండి శాస్త్రి గారు మీ అమ్మాయీ ఎలా చనిపోయింది…
నేను చెప్పాను కదండీ ఇంకా ఎన్ని సార్లు అలా అడుగుతారు.పాము కాటుకు గురై చనిపోయింది అని..
చరణ్ ఉత్తరం తీసి చదవడం స్టార్ట్ చేసాడు…
పూజ్యులైన గురువు గారికి…
”   మీకు ఈ ఉత్తరం చేరే సమయానికి నేను బహుశా ఈ లోకం ఉండకపోవచ్చు.మా నాన్న గారు మీ ముందు నేను పరీక్ష రాయడానికి ఒప్పుకొని తరువాత నన్ను అనరాని మాటలూ అని నన్ను మూడు రోజులు చిత్రవధ చేసారు.మీ కాళ్లను తాకను అని నా చేతిలపై వేడి నూనె నీ పోశారు అమ్మ కూడా అడ్డు చెప్పలేదు ఆఖరికి నా మూడు రోజుల పాటు ఆహారం ఇవ్వలేదు ,కనిషం నీళ్లు కూడా ఇవ్వలేదు ఎందుకంటే నేను మడి  ఆచారం న్ని తప్పను అని.
నాన్న గారు అమ్మతో మాట్లాడి నా వల్ల వారి పరువూ పోతూంది అని నన్ను చంపాలి అని నేనే తినే ఆహారం లో విషయం కలపడం నేను చూసాను.అప్పుడే ఈ ఉత్తరం మీకు చేరాలని రాశాను.
నేను బ్రతికి ఉండడం అపశకునం అంటా..
నాకు తెలిసే నేను విషం కల్పిన ఆహారం తిని ఈ లోకాన్ని వదిలి పేట్టి వెళ్ళిపోతాను నాకు ఇంకా ఈ లోకం బతకాలి అని ఆశ లేదు గురువుగారు
ఎంతో  సాధించాలి అనుకున్న నాకు మీ రూపంలో ఆశ జ్యోతి కనపడింది ఇలా మా అమ్మ నాన్న గారి చేతిలోనే వారి మూఢ నమ్మకాలకు బలి అవుతున్న…
అది విన్న ప్రతి ఒకరి కంట్లో నీటి చెమ్మ…
శాస్త్రి , కామాక్షీ  వారి మొహాల్లో కొంచం అయిన బాధ లేదు .వారిని పోలీస్ లు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే
మీ అమ్మాయిని చంపినందుకు బాధగ లేదా అని చరణ్ అడిగాడు
“ఎందుకు బాధ అది మా వంశ పరువూ తీయడం కాకుండా విధవ అయి ఉండి  పరాయి మనిషి అయిన నీతో మాట్లాడి ,చెడు తిరుగుళ్ళ తిరిగి చెడి పోయింది అని ఉష నీ తిట్టు సాగాడు
మా ఇద్దరి మద్య ఉన్నది గురు శిష్యుల బంధం.మీకు మీ అమ్మాయికి మీకు ఏమి బంధం ఉందో అలాంటిది మా మధ్య ఉంది.
నిత్యం దేవుడికి పూజలు చేస్తున్న మీకు  ఏది మంచో , ఏది చెడో తెలియకపోవడం సిగ్గుచేటు…
తను రాక ఉంటే కనీసం ఉష బతికి ఉండేది అని బాధ పడి …ఆ ఊరిని వదిలి పెట్టి  వెళ్ళిపోయాడు చరణ్….

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!