ఆమని సరాగాలు
రచన: విస్సాప్రగడ పద్మావతి
అందాల ధరణిలో అరవిరిసిన మందారం. తొళి కిపడే మకరందా ల సోయగం ఆమె సొంతం.
వినయంగా నడుచుకోవడం , అందరి మంచి చెడ్డలు చూస్తూ నలుగురికి తలమానికంగా నిలవడం ఆమె అభిరుచి. సేవాతత్పరతతో మెలుగుతూ డిగ్రీ వరకు చదువుకుంది.
ఇల్లు, కాలేజీ ,చదువు,సేవ తప్ప మరేదియూ ఎరుగని నిత్య సంతోషిని.
అందరితో సరదాగా మెలుగుతూ అందరికీ చేతనైనా సహాయం చేస్తూ , ఎల్లప్పుడూ మోముపై చిరునవ్వు ను వీడక కల్మషం లేని మనసుతో హాయిగా జీవనం సాగుతుండగా ఒక నాడు వాణి అనే తన స్నేహితురాలు ఒక వ్యక్తిని చూపి తనకి కాబోయే భర్త అని పరిచయం చేసింది.
అతను చూడ్డానికి ఎత్తు గా హుందా గానే ఉన్నాడు. మనసే కల్మషంతో నిండిపోయింది. ఫ్రెండ్ కి కాబోయే భర్త కదాని మాట కలిపింది. కాసేపు ముచ్చట్ల తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఒక వారం గడిచాక వాణి నిత్యని పిలిచి చేతిలో ఒక లేఖను ఉంచి చదవ మంది. లేఖ ఏమిటి అంటూ ఆశ్చర్యంతో అర్థంకాని పరిస్థితిలో ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదువ సాగింది నిత్య.
ఒక్కో లైను చదువుతుంటే స్వేదం ఏరులై పారుతొంది. ఏం మాట్లాడాలో ,ఎలా చెప్పాలో తనను తాను ఎలా నిరూపించుకోవాలో అర్థంకాని అయోమయ స్థితిలో పడిపోయింది నిత్య.
వెంటనే వాణి ఫ్రెండ్ అంటే నువ్వే. నువ్వు నా స్నేహితురాలు అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను నువ్వు నా ఫ్రెండు అయినందుకు అదృష్టం గా భావిస్తున్నాను. థాంక్యూ వెరీమచ్ మై ఫ్రెండ్ అంది
అయోమయం నుంచి తేరుకోలేని నిత్య అసలేం జరుగుతుందో అర్థం కాక నిశ్చ్చేష్టు రాలైంది.
వాణి అసలు ఏంటిది సందిగ్ధం వీడి అసలు విషయానికి రా.. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? నాకు వివరంగా చెప్పు అంది నిత్య.
ఉత్తరం లో ఏముంది చూడు.. నీ అందచందాలు వర్ణిస్తూ ,నీపై ఇష్టాన్ని చూపిస్తూ ,నీ ప్రేమకై ఎదురు చూస్తున్నాను అంటూ నీ కోసం ఉత్తరం రాశాడు. నిన్న మొన్నటి వరకు ఈ మాటలు నాకు చెప్తే అతను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అని మురిసిపోయి అతని ప్రేమలో మునిగి పోయాను. అవే మాటలు ఇప్పుడు నీకు చెప్తున్నాడు. రేపన్న రోజు నీకంటే అందమైన అమ్మాయి కనిపిస్తే దానికి చెప్తాడు అన్నమాట.
చూశావా మగవాడి తత్వం.. పెళ్లికి ముందే ఈ నిజం నాకు తెలియడం వల్ల నన్ను నేను రక్షించుకో గలిగాను. నా జీవితం వాడి నీడలో మగ్గి పోకుండా నన్ను కాపాడావు. నీ పరిచయం వల్లే వాడి నిజస్వరూపం బయటపడింది. నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు..కృతజ్ఞత మాత్రమే ఉంది.
నిజంగా నీ వల్లే నా జీవితం నిలబడింది అంటూ ఆనందంతో వాణి ,నిత్య ను ఆకాశానికెత్తింది.
తన స్నేహితురాలి మనసు గెలుచుకున్న oదుకు నిత్యం మోముపై చిరునవ్వు విరిసింది.
స్నేహితురాళ్లు ఇద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా మెలగ సాగారు..