ఉన్నఊరు కన్నతల్లిని మించినది లేదు

ఉన్నఊరు కన్నతల్లిని మించినది లేదు

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

     ఏమండోయ్ ఎక్కడున్నారు అంటూ పిలిచింది భర్త పార్వతీశాన్ని సుభద్రమ్మ.
అబ్బ అంత గావుకేక ఎందుకే వంటింట్లో ఏమైనా పడిసేవా అంటూ కళ్ళజోడు సవరించుకొంటూ లేవలేక సోఫా లోంచి లేచారు చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి భార్య ఉన్న వంటిట్లో కి వచ్చారు.

     వచ్చారా బాబు అని స్వరం తగ్గించి మీరన్నది అక్షర సత్యం. చచ్చి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మిథునం సినిమాలో భార్య లక్ష్మితో చెప్పిందవుతుంది అన్నారు ఇప్పుడు అదే జరుగుతోంది. హాయిగా మన ఊళ్ళో పాలు, పాడి పంట, గుడి, గోపురం పచ్చటి ప్రకృతి ముఖ్యంగా నాకు పక్కింటి పార్వతమ్మ,
మీనాక్షమ్మ ,పనిమనుషులు వెంకి,అప్పిగాడు ఎంతకాలక్షేపం. మీ కేమో పంతులు గారు అంటూ నాయుడు గారు, వెంకయ్య పూజారి ఆచారి గారు వచ్చి సలహాలు అడగటం ఏమిటో వెర్రిదాన్ని అమెరికా లో కొడుకు కోడలు, పిల్లలు అంటూ వాడు పిలవగానే మిమ్మల్ని భాధ పెట్టి తీసుకొచ్చాను.

    మీరంటూనే ఉన్నారు గరికపాటి వారు చెప్పినట్లు కూతుళ్ళని, కొడుకులని కన్నాము గాబట్టి వారికి చదువులు, పెళ్ళిళ్ళు చేసి, మనవలు పుట్టేవరకే మన భాధ్యత,మనవళ్ళు  వాళ్ళ చదువు సంధ్యలు అంటూ బంధనాలు పెంచుకుంటే జీవితం వంటింటితో నీకు. ఇంటి కాపాలతో నాకు అయిపోతుంది అన్నారు అది నిజమే అవుతోంది అంటూ ఆగకుండా భార్య చెప్పే దానికి అడ్డుకట్ట వేసి నే చెప్పేది వింటావా అన్నారు భార్య సుభద్రమ్మ తో పార్వతీశం గారు. వెంటనే మౌనం వహించింది.

     నీకు మొదట్లోనే నే చెప్పాను నాలుగుసార్లు పురుడని, కొడుకు కాపురం చూద్దామని, పిల్లల చదువులని రమ్మంటే వచ్చాక కూడా నీకు తెలియలేదా .కొడుకు, కోడలు ఉద్యోగాలకోసం, పిల్లలిద్దరు హైస్కూలు చదువులు వాళ్ళు మనమాట వినరు. ఏమైనా అంటే జనరేషన్ గాప్ అంటారు. రోగం వస్తే డాక్టర్ అపాయింట్ మెంట్ కి పడిగాపులు, చిన్న జబ్బుకి లక్షలు లక్షల ఖర్చులు. మనఉళ్ళో అయితే మీరు రావద్దు మాష్టారూ అని కాళ్ళకి దండం బెట్టి ఇంటికే వచ్చే డాక్టర్ రాఘవుడు
ఇక్కడ ఐదు రోజులు జైలు రెండు రోజులు బైలు మన పరిస్థితి. ఎలాగూ ఐదునెలలు గడిచాయి ఓపిక పడితే ఈ నెల గడిపి నొప్పించక తానొవ్వక అన్నట్లు మనఊరు వెళ్ళిపోదాం. ఈ సారి ఏదోవంక పెట్టి రావద్దు. వయస్సు మీదపడింది మనం పోతే శరీరం కట్టెపుల్లే ఇది ఎవరు దహనం చేస్తే ఏమిటి వింటున్నావా అని అంటే వింటున్నాను భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు చెప్పారు. ఇక నేను మీ మాటే వింటాను అని సుభద్రమ్మ వంటిట్లోకి వెళ్ళి పోయారు..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!