ఐకమత్యం

ఐకమత్యం

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయానికి ముందే లేచి ఇంటి పనులు చెయ్యడం అలవాటు కామాక్షి కి ఇంకా శీత కాలం అయితే మరి ఆనందము కార్తీక మాసం వచ్చిందంటే వాపి కుపా తట కాది చెరువు,గోదావరి స్నానాలు చెయ్యడం చిన్న ప్పటి నుంచి అలవాటు

వెన్నెల్లో తెల్లవారుజామున లేచి పదిమంది ఆడపిల్లలు వారికి తోడు ఎవరో ఒకరి ఇంటి నుంచి ఇద్దరు లేక ముగ్గురు పెద్ద  మగ వాళ్ళు కూడా సాయం ఉండేవారు

ఎదో ఈ ఊళ్ళో గోదావరి ఉంది అదికూడా మరి దూరం కాకుండా ఉన్నది కనుక ఆడ మగ అంతా ఇష్టం గా పర్వం రోజుల్లో అయినా వెళ్ళేవారు

ఒక విధంగా ఆ ఊరిలో అన్ని.కుటుంబాలు ఏదోఒక దగ్గరి సంబంధం ఉంది కనుక ఆడపిల్లల్ని ఎంతో గారంగా అభిమానంగా చూసేవారు ఎవరూ వంకలు పెట్టే వారు కాదు ఒకరి కొక రు సాయం చేసే వారు

కూడా పెద్ద వాళ్ళు కూడా ఉంటారు కనుక కొంచెం భయం భక్తి తో ఉండేవారు

ఆడపిల్లలు కూడా ఇత్తడి చెంబులు పట్టుకు వెళ్ళేవారు
వెన్నెల్లో ఇసుక మెరిసేది చెంబులు గిరాటు వేసి ఎవరూ ముందు పరుగెత్తి వెళ్లి చెంబు తీస్తారు ఇదో ఆట ఇలా అలసట తెలియ కుండా ముందుకు వెళ్ళేవారు

పెద్ద వాళ్ళు నెమ్మది గా కబుర్లు చెప్పు కుంటు వెళ్ళేవారు తెల్లవార గట్ల మూడు ఇంటికి బయలు దేరి ఒకరిని ఒకరు పిలుచుకుంటూ బేటరీ లైట్స్
పట్టుకుని పిల్లల్ని కూడా పెట్టుకుని వెళ్ళిన మగాళ్లు అంతా కలిసి ఇంటికి ఎనిమిది గంటలకి చేరేవారు.దారిలో వచ్చే ట ప్పుడూ రావి చెట్టుకు
నీళ్ళు పోసి మంచి భర్త రావాలని, మగ పిల్లాడు అయితే మంచి భార్య రావాలి అని కోరుకోండి అని పెద్దలు చెప్పేవారు . అలా కార్తీక మాసం ఇలా ఆనందంగా గడిచేదీ పాడ్యమి నాగుల చవితి  ఏకా దశి ద్వాదశి త్రయోదశి ,చతుర్దశి ,పూర్ణిమ ఇలా పర్వం రోజుల్లో గోదావరి స్నానాలు ఎంతో ఆసక్తి పుణ్యము . అమావాస్య పాడ్యమి పోలి స్వర్గం కథ గోదారి దగ్గర దీపాలు పెట్టీ గంగ పూజ చెయ్యడం ఇవన్నీ ఎంతో ఆసక్తి కరంగా ఉండేవి

దీనికి తోడు ప్రతి ఆదివారం తప్పనిసరిగా వన భోజనాలు అందులో పెద్దలు అంతా కలిసి
శ్రీ రమా సత్యనారాయణ వ్రతము శ్రీ వేంకటేశ్వర స్వామి దీపారాధన దత్త వ్రతము హనుమాన్ చాలీసా పారాయణ వంటి భక్తి కార్య క్రమాలు పిల్లలకి ఆటలు పాటలు పోటీలు పెద్ద వాళ్ళకి
కూడా కొన్ని పోటీలు పద్యాలు భక్తి మీద ప్రశ్నలు వంటివి నిర్వహించి ఘనంగా చేసేవారు.

ఊళ్ళో లక్ష పత్రీ బిల్వ దళాలను పూజలు విష్ణు పూజలు తులసి దళముల పూజలు  నోములు ఇలా అన్ని భక్తి కార్య క్రమాలు సామూహికంగా ఐ కమాత్యంతో చేసేవారు
వనభోజనాలు లో కొందరికిపెళ్లి మాటలు చూపులు కూడా ఏరా మీ పిల్లని మా అబ్బాయికి చేసుకుంటాము అడిగేవారు

లేదా మీ అబ్బాయికి ఫలా నా వారి పిల్లను చెయ్యండి అని సలహా చెప్పేవారు అలా ఆనందం గడిచింది.

కార్తీక మాసం అంటేనే ఆనంద మాసము మన కార్తీకం ఐకమత్య మాసము.

పెళ్ళిళ్ళు పేరంటాలు అని కొందరు పిలిచే వారు

కంద బచ్చలి  పనస పొట్టు కూర అరటి కాయ ఆవ పెట్టిన కూర చింత కాయ పప్పు ఉసిరి పచ్చడి.తియ్య గుమ్మడి పులుసు పులిహోర దద్దోజనం లడ్డూలు బూర్ లు
పాయసం బజ్జీలు ఇలా ఎన్నో ఐకె మత్య వంటకాలు ఈ మాసంలో తినాలి

సరే ఇప్పుడు ఆ పిల్లలు అంతా విదేశాలకు వెళ్లి పోయారు లేదా సిటీలో ఉన్నారు అయినా కార్తీకం గ్రామాలే కాక ఏ ఊళ్ళో ఉన్నా ఎన్నో అందాలు చల్ల గాలికి ప్రత్యేక ఆనందాలు

సిటీలో ఉన్న మీనాక్షి కూతురు విదేశాల్లో కొడుకు కూడా పూజలు చేసి సామూహిక భోజనాలకు పెడుతున్నామని
చెప్పారు ఐకమత్యం వేరే చోట మరీ ఎక్కువ ఆస్సోసియేషన్స్ వారు ఘనంగా చేస్తున్నారు

పాడ్యమినాడు మీనాక్షీ కూతురు రమ్య అయితే వాళ్ళ ఇంట్లో బాల్కనీలో ఇత్తడి పాత్ర పెద్దది పెట్టే అందుకే నీళ్ళు పోసి దీపాలు పెట్టే పొలిని స్వర్గానికి పంపుతుంది

కెనడాలో కోడలు చిత్ర గాజు బౌల్ పెద్దది తీసుకుని దీపాలు వదులుతుంది

ఎంత పెద్ద చదువు చదివినా మన సంస్కృతి సంప్రదాయాలు వదలడం లేదు
నాకు తెలిసిన తెలుగు టీచర్ కొడుకు సాఫ్టు వేర్ ఇంజనీర్ అతను ఇప్పుడు కూడా వార అంతరంలో చక్కగా వేదం నేర్చుకుంటాడు అక్కడ దేవాలయం నేర్పిస్తారు అని చెప్పాడు .కార్తీకం విదేశాల్లో కూడా అంతా కలిసి ఘనంగాబే చేస్తున్నారు

వాళ్ళ ఆవిడ సంగీత విద్వాంసురాలు ఆమె పిల్లలకి శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు ఎంతో బా నేర్పిస్తూ ఉంటుంది

ఏ దేశ మేగినా మన పద్దతులు మనవే అంటూ కామాక్షి గొప్పగా వీడియోలూ అందరికీ పెడుతూ ఉంటుంది

నా పిల్లలకు పల్లె లో పెరిగిన విదేశాలకు వెళ్ళిన సిటీలో ఉన్నా ఎంతో చక్కగా ఉన్నారు అని గర్వంగా చెపుతుంది

ననాటి బ్రతుకు నాటకము అని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో చెప్పినట్లు
మానవునికి విద్య ఉద్యోగం లో రకాలు ఎక్కడా ఉంటే నూకలు అక్కడే కదా . కార్తీకం ఎక్కడ అయిన అంతా శోభ చేకూర్చే విధంగా దీపాలు ఐకమత్యం చూపు కార్య క్రమాలు ముఖ్యము శాంతి శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!