ఐక్యత

ఐక్యత 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : తిరుపతి కృష్ణవేణి.

బంధువుల ఇంట్లో శుభాకార్యానికి వెళ్తూ, అందరం బస్ స్టేషన్ కు వెళ్లి మేము ఎక్కాలసిన  బస్సు గురించి ఎదురు చూస్తూ, కూర్చున్నాము.మాతో పాటు ఇతర ప్రయాణికులు, అందరూ తమ, తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి బస్సుల  గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చిపోయే జనాలతో బస్సు స్టేషన్ రద్దీగా ఉంది. దానికి తోడు ఆ రోజు ఆకాశంలో, నల్లని మబ్బులు కమ్ముకొని, విపరీతమైన గాలి వీస్తూంది. బస్సు స్టేషన్ చుట్టూ పెద్దపెద్ద వృక్షాలు. ఆ చెట్ల కొమ్మలపై కోతుల గుంపు, ఒక కొమ్మ పైనుండి మరో కొమ్మపైకి దూకుతూ ఆడుకుంటున్నాయి. వాటి ఆటలు చూడటానికి  చాలా సరదాగా అనిపిస్తూంది. ఆ చెట్ల మధ్యన కరెంటు ట్రాన్స్ ఫార్మర్ కూడా ఉంది. దానిపై ఉన్న తీగలు పట్టుకొని వేలాడుతూ కొన్ని కోతులు ఆడుకుంటున్నాయి. ఆకాశంలో, ఉరుములు మెరుపులతో పెద్దగా గాలి వీస్తూ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. గాలికి చెట్ల కొమ్మలు   అటూ, ఇటూ ఊగుతూంటే, ఆ చల్లని వాతావరణంలో కోతులు రెట్టింపు ఉత్సాహంతో  వాటి ఆటలు, ఇంకా ముమ్మరంగా కొనసాగిస్తూ, ఉన్నాయి. “ఉన్నట్టుండి ట్రాన్స్ ఫార్మర్ లో పెద్ద శబ్దంతో మంటలు వచ్చాయి.” ఒక కోతి కరెంట్ షాక్ కు గురై క్రింద పడిపోయింది. ఒక్కసారిగా కోతులన్నీ భయఆందోళనగా, దాని చుట్టూ మూగి, కాళ్ళు, చేతులు పట్టుకొని గట్టిగా ఊపుతూ, ముఖంలో ముఖం పెట్టి చూస్తూ, తలనుగట్టిగా పట్టుకొని కదలిస్తున్నాయి. దాన్ని బ్రతికించుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఎంత సేపటికి ఆ కోతి ఏ కదలిక లేకుండా, నిర్జీవంగా అలానే పడి ఉండటంతో, ఒక బలమైన కోతి ఆ పడి ఉన్న కోతిని చంకలో ఒడిసి పట్టుకొని మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కు తీసుకెళ్తున్నాం, అన్నట్టుగా దగ్గరగా ఉన్న పొదల మధ్యకు గబగబా పరుగు తీసింది.  అక్కడ ఉన్న కోతులన్నీ చాలా విచారంగా దాన్ని అనుసరించాయి. ఈ సంఘటన నాతోపాటు చూస్తున్నవారికి, కోతి చనిపోయి నందుకు బాధగా ఉన్నా, ఆ కోతులు తమ తోటి ప్రాణిని రక్షించు కోవాలని పడుతున్న ఆవేదన, బాధ, చూచి ఒకింత ఆశ్చర్యం, అనిపించింది. మూగజీవాలైన, సాటి ప్రాణికి కష్టం వచ్చినప్పుడు దాన్ని బ్రతికించు కోవవటానికి, ఎంత ఆతురత, ఆవేదన పడుతున్నాయి? అదే నేటి, సమాజంలో మనుషులు అయితే! తోటి మనిషి కష్టంలో ఉంటే, పలుకరించేవారే ఉండరు? రోడ్డుపై పట్టపగలు తోటి మనిషిపై ఏదైనా అఘాయిత్యం జరిగినా, ప్రమాదం జరిగి మనిషి ప్రాణాపాయ పరిస్థిలో ఉన్నా, నాకెందుకులే, అని ప్రక్కనుండి చూస్తూ, వెళ్తారే కానీ తప్పించి, సహాయపడే వారే ఉండరు. మేధావుల మనుకునే మనుషులకు, 5సాటి మనిషి కష్టాన్ని పట్టించుకొనే తీరిక, జాలిగుణం ఉండవు. నోరులేని మూగ జీవులైనా తోటి ప్రాణి పట్ల ఎంత దయాగుణం.? “సాటి ప్రాణి, కష్టంలో ఉన్నప్పుడు, దాన్ని, రక్షించు కుంటానికి ఆ మూగ ప్రాణులు   ఎంత తాపత్రయం ప్రదర్శించాయి? ఆ మూగ ప్రాణుల్లో ఉన్న, ఐకమత్యం, ప్రేమదయాగుణం మనుషులు కొంతయినా, నేర్చుకోవాలసిన అవసరం ఎంతయినా ఉన్నదని ఆ క్షణంలో.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!