మనం బానిసలం
రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు
మనం బానిసలం
బానిసత్వం నుండి విముక్తిపొందినా మనం బానిసలం
మంచికి బానిసలం
మానవత్వానికి బానిసలం
వంచనకి బానిసలం
దుర్మార్గానికి బానిసలం
దురభ్యాసాలకు బానిసలం
ప్రేమకు బానిసలం
పెళ్ళికి బానిసలం
చరవాణికి బానిసలం
దూరశ్రవణానికి బానిసలం
టివికి బానిసలం
సినిమాలకు బానిసలం
తిండికి బానిసలం
తిరగడానికి బానిసలం
పొందుకు బానిసలం
విందుకు బానిసలం
అన్నింటికి మించి డబ్బుకు బానిసలమై బానిసబ్రతుకు
బ్రతుకుతున్నాం!