దివ్యౌషధం….
రచన: రేపాక రఘునందన్
అలసిన మనసుకు రెక్కలొచ్చి
పునరుత్తేజం పొందడానికి
హాస్యమే దివ్యౌషధం….
కండరాల్లో కలకలం సృష్టించి
హృదయాలకు స్వాంతన చేకూరుస్తుంది
నవరసాల్లో అగ్రపీఠాన నిలిచి
ఉదాసీనత పై దాడి చేసి
ఉనికిని చాటుకుంటూ
ఉల్లాసాన్ని కలిగించి
బద్దకాన్ని వదిలిస్తూ
బడలికను తరుముతూ
ఆరోగ్యానికి రక్షణ నిస్తుంది
అవయవాలకు శిక్షణ నిచ్చి
హాస్యం బాసటగా నిలబడకపోతే
మనిషికి మనుగడే లేదు…
మనసుకు ఆహ్లాదమే రాదు