నింగి అంత ప్రేమ

(అంశం:”ప్రేమ /సరసం)

నింగి అంత ప్రేమ

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

నింగిని అడిగా, నేలనడిగా  ప్రేమించిన చెలి ఏదీ అనీ…. అన్నట్టుగా.

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, ….

అలా అలా కవులు తమ ప్రేమని అంతా ఆకాశం తో పోల్చి  చెప్పుకోవటంతో, ఆకాశం విలువ పెంచుతారు.

ఆకాశాన సూర్యుడు ఉండడు, సందే వేళకు…
చందమామ కి రూపముండదు తెల్ల వారి తే…
తన పాట లో భాదను వెలిబుచ్చుతారు  ఇంకొకరు…

మన ప్రేమ కావ్యానికి ఆ నింగి, దానిలోని జాబిలి, చుక్కలు సాక్ష్యాలు. అంటూ తన సంభాషణ కొనసాగించాడు చరణ్.

కానీ అవి మాట్లాడలేవు కదా, అంది  చంగల్వ.

అవి మాట్లాడక పోయినా పరవాలేదు. మనది ఎమీ మూగ ప్రేమ కాదుగా అన్నాడు.

చిరునవ్వు నవ్వింది చంగల్వ.

అబ్బా, వెన్నెలనంతా నీ నవ్వులోనే పొగేశావా? అన్నాడు అపురూపంగా తనని చూస్తు.

చంగల్వ సిగ్గు తో తల దించుకుంది, ముసి ముసిగా నవ్వుకుంటూ.

చంగల్వ, కొమర్ల గూడెం అనే ఒక పల్లెటూరులో  ఉండే అందమైన, సున్నితమైన మనసు కలిగిన  అమ్మాయి.

చరణ్ ఒక ఫోరెస్ట్ ఆఫీసర్. కొమర్లగూడెంకి దగ్గర లో ఉన్న అడవికి కొత్త గా ట్రాన్స్ఫర్ పైన వచ్చాడు.

చంగల్వ అమ్మ లేని పిల్ల. రెండు, మూడు ఇల్లల్లో పని చేసుకుంటూ బతుకుతుంది. అందుకే, చరణ్ రాగానే, వాళ్ల ఇంటిలో పని అడగటానికి వెళ్ళింది.

మొదట నేను ఒక్కడినే కదా, నాకు పనికి ఎవరూ అక్కర లేదు అని చెప్పాడు.

కానీ చెంగల్వ పరిస్తితి తెలిసిన తర్వాత, తను ఇచ్చే రూపాయికి విలువ దక్కుతుందని, చంగల్వని పనికి పెట్టుకున్నాడు.

రోజు ఉదయాన్నే డ్యూటీ ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట పనికి రమ్మని చెప్పాడు.

ఇద్దరూ ఒకే వయసు వాళ్లు అవ్వటంతో, చంగల్వకు కావలసినంత ప్రేమ పంచే వాళ్లు లేకపోవడంతో, చరణ్ కూడ వంటరిగా ఉండటం వల్ల, ఇద్దరూ తొందరలోనే ప్రేమలో పడ్డారు.

కానీ, మీరు చదువుకున్న వాళ్లు బాబు గారు, మాలాంటి వాళ్ళు మీ ప్రేమను పొందడం కోసం ఆశ పెట్టుకోవటం అత్యాశే అవుతుంది అంటూ ఎప్పుడూ తన హద్దులో తనే ఉండేది. చరణ్ ఎంత చొరవ ఇచ్చినా కూడా ఎప్పుడూ హద్దు మీరెది కాదు.

అందుకే, చరణ్ ని తన ప్రవర్తన ఇంకా ఆకట్టుకుంటుంది.

అలా రోజు సాయంత్రం పూట వాళ్లు కలుసుకునే వారు.వాళ్ల ప్రేమని చరణ్ ఉండే గెస్ట్ హౌస్ వెనక ఉన్న తోట వరుకునే పరిమితం చేశారు.

వాళ్ళ ప్రేమకి నింగి ఒక్కటే హద్దు. అలాగే వాళ్ల ప్రేమ ఒక్క ఆకాశానికి మాత్రమే తెలుసు.

హటాత్తుగా చంగల్వ రెండు రోజులు పని లోకి రాలేదు. ఇంకా ఉండబట్టలేక, వాళ్ళ ఇంటికి బయలు దేరుతాడు ఏమైందో చూద్దామని.

వాళ్ల ఇంటి ముందుకు వచ్చేసరికి, ఎదో బెరుకు, మనసులో అలజడి.

ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి, చంగల్వ….. కాదు చంగల్వ  శవం పడుకో పెట్టి ఉంది బయట.

చిన్న గా కాళ్లు వణకటం మొదలు పెట్టాయి. మేము చెప్పుకున్న ఊసులు గుర్తుకు వచ్చి,  నన్ను వెక్కిరించినట్టు, నా భవిష్యత్ నన్ను ఏడిపిస్తోంది.

ఎమీ జరిగిందని ఎవరినైనా అడిగే ఓపిక కూడా లేక, కదలలేనట్టు అక్కడే నుంచుని ఉండిపొయాడు ఒక కట్టెలాగ.

ఎవరో ఎవరితోనో చెపుతున్నారు. రెండు రోజుల నుంచీ జ్వరంగా ఉంది, నిన్న నోటిలో నుంచి రక్తం కూడా  వచ్చింది అంతే, అని.

ఇంకా అక్కడ నుంచో లేనట్లు ముందుకు కదిలాను… పైకి చూస్తే ఆకాశం, నాతో చెప్పుకో నీ భాద అంటూ నన్నే చూస్తోంది. రెండు వాన చినుకులు, నా కళ్ల నీళ్ల కు తోడు గా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!