“గోంగూర”

“గోంగూర”
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

గోంగూర వంటకం ఎంతో
రుచిగల వంటకం కదా!
గోంగూర రొయ్యల ఎంతో
భలే భలే గా ఉంటుంది కదా!
గోంగూర మటన్ నాలుక
పై రసం ఊరేనూ కదా!
గోంగూర చికెన్ అంటే చాలు
నోరు ఊరి పోవుకదా!
గోంగూర మటన్ బిరియాని
తినడాని అదృష్టం కావాలి! కదా !
గోంగూర పుల్లగూర లో ఎండు చేప నంచు కోంటే చెప్పటానికి పదాలు లేవు కదా!
గోంగూర పప్పు లో ఆవకాయ
కలుపు కుంటే ఆ మజా వేరు కదా!
గోంగూర పచ్చట్లో కాస్త నెయ్యి
కలుపుకొని వేడివేడి అన్నంలో
తింటే అమృతమే కదా!
గోంగూర లో ఉల్లిపాయ నంచు
కొంటే అబ్బబ్బా..! మధురం
గోంగూర పెరుగు అన్నం లో కలుకుంటే ఆహ..వోహో..కదా!
గోంగూర పుల్లగూర రాగి సంగటిలో అద్దుకొని నాలుక పై పెట్టకొంటే ఆ అనుభూతి చెప్పడం ఎవరి తరం..? కదా!
గోంగూర ఊరగాయి లో కాస్త
వెన్నపూస రాసి ఊతాపంలో
అద్దుకుంటే మామా! కదా!
గోంగూర తో వంటలు ఎన్నో ఎన్నెన్నో కదా!
గోంగూర కు భారతంలోనే
చోటుదొరికింది.. కదా!
గోంగూర శాకాంభరీ దేవి వర
ప్రసాదం కదా! ఆంద్రుల ఆభిమాన వంటకం! కదా!
ఒకసారి చూద్దాం రండు రండు
గోంగూర రుచులు భలే భలే
నోరూరించే వంటలు చాలా కదా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!