నీ మీదే ధ్యాస

నీ మీదే ధ్యాస
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఝాన్సీ లక్ష్మి జాస్తి

నీవు ఉంటే చెంత
నిదుర ఇక దరిచేరదు నా చెంత
నా చేతులేమో నా మాట వినక
పడుతుంటాయి నీ వెనుక
ఎంత మంది లో ఉన్న ఏచోట ఉన్నా
నా ఆలోచనలు అన్నీ నీ మీదే లగ్నం
మనసులో ఉండదు వేరే ధ్యాస
పదిమంది చూస్తున్నా నిన్ను పట్టుకోవాలనే ఆతృతలో సభ్యత మర్చి మరీ నీ కోసమే వెతుకులాట నిన్ను వదిలించుకోడానికి చేసిన యత్నాలు అన్ని  వర్థ్యం
నీ ప్రతాపానికి గుర్తుగా నాకిక సవరమే శరణ్యం
ఓ పేను మహాతల్లి ఇకనైనా నను వీడి వెళ్ళు
నన్ను ప్రశాంతంగా నిద్ర పోనివ్వు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!